E-Paper
Advertisement

ఈ కారు హెడ్‌ లైట్లు సినిమా చూపించేస్తాయ్.. వామ్మో.. ఇదేం టెక్నాలజీ భయ్యా!

ఈ కారు హెడ్‌ లైట్లు సినిమా చూపించేస్తాయ్.. వామ్మో.. ఇదేం టెక్నాలజీ భయ్యా!
Advertisement

Huawei Big Innovation: కార్లలోని హెడ్‌ లైట్లు ఇప్పటి వరకు రాత్రి సమయంలో దారి చూపించే పరికరాలుగానే ఉండేవి.  సాధారణ భద్రతా పరికరాలుగానే ఉండేవి. కానీ ఇప్పుడు వాటి పాత్ర పూర్తిగా మారబోతోంది. చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం హువావే కొత్త X పిక్సెల్ లైటింగ్ టెక్నాలజీని పరిచయం చేస్తూ, కార్ హెడ్‌ లైట్లను చిన్న ప్రొజెక్టర్‌ గా మార్చే ప్రయత్నం చేసింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా కారు ముందు ఉన్న గోడ మీద లేదంటే ఇతర స్క్రీన్ మీద 120 ఇంచుల వరకు వీడియోలను ప్రొజెక్ట్ చేయవచ్చే. అంటే, డ్రైవర్లు, ప్రయాణికులు తమకు ఇష్టమైన సినిమాలు, టీవీ షోలు, స్పోర్ట్స్ ను హెడ్‌ లైట్ల సాయంతో పెద్ద స్క్రీన్‌ పై చూసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, కొన్ని ఇంటరాక్టివ్ గేమ్‌ లను నేలపై ప్రొజెక్ట్ చేసి ఆడే అవకాశం కూడా ఈ టెక్నాలజీ కల్పించనుంది.

లైటింగ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కూడా..

ప్రస్తుతం మార్కెట్లో  అధునాతన కార్లలో LED హెడ్‌ లైట్లు, అడాప్టివ్ లైటింగ్, మ్యాట్రిక్స్ లైటింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి రాత్రి సమయంలో డ్రైవింగ్‌ ను మరింత సేఫ్ గా మారుస్తాయి. అయితే, హువావే తీసుకొచ్చిన X పిక్సెల్ టెక్నాలజీ కేవలం లైట్ ఇవ్వడానికే కాకుండా వినోదాన్ని కూడా అందించడం విశేషం. హువావే గత కొన్నేళ్లుగా ఆటోమొబైల్ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త బ్యాటరీల అభివృద్ధితో పాటు స్మార్ట్ లైటింగ్ వ్యవస్థలపై కూడా పరిశోధనలు చేస్తోంది. 2026 బీజింగ్ ఆటో షోలో హువావే, చైనా వాహన తయారీ సంస్థ సెరెస్‌ తో కలిసి రూపొందించిన ఐటో M9 SUVలో ఈ కొత్త XPixel సిస్టమ్‌ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

కంప్లీట్ పూర్తి RGB కలర్ సపోర్ట్‌ తో..

Advertisement

ఈ టెక్నాలజీతో కంప్లీట్ కలర్స్ తో వీడియోలను ప్రదర్శించేలా చేస్తుంది. పాత X పిక్సెల్ వ్యవస్థలు బ్లాక్ అండ్ వైట్, పరిమిత రంగుల్లో మాత్రమే పని చేసేవి. ఇప్పుడు కొత్త వెర్షన్ పూర్తి RGB కలర్ సపోర్ట్‌ తో వస్తోంది. దీంతో గోడపై, స్క్రీన్‌ పై ప్రొజెక్ట్ అయ్యే విజువల్స్, ఫోటోలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సిస్టమ్ 23 అడుగుల దూరం నుంచి 120 అంగుళాల పరిమాణంలో విజువల్స్ ను ప్రొజెక్ట్ చేస్తుంది.

వినోదంతో పాటు భద్రత కూడా..

ఈ టెక్నాలజీ కేవలం వినోదం కోసం మాత్రమే కాదు. భద్రతకు కూడా ఇది ఉపయోగపడుతుంది. రోడ్డు వివరాలు, నావిగేషన్ సూచనలు, పాదచారుల హెచ్చరికలు లాంటి సమాచారాన్ని కూడా హెడ్‌ లైట్ల ద్వారా ప్రొజెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా,  పొగమంచు, భారీ వర్షం లాంటి పరిస్థితుల్లో డ్రైవర్‌ కు మంచి విజుబులిటీని అందిస్తుంది.  అడాప్టివ్ హెడ్‌ లైట్ టెక్నాలజీ ఇప్పటికే మార్కెట్లో ఉన్నప్పటికీ, ప్రొజెక్టర్ ఫీచర్‌ తో కూడిన ఈ కొత్త వ్యవస్థ కార్ల లైటింగ్ రంగంలో కీలక ముందడుగుగా చెప్పుకోచ్చు. ధర వివరాలను హువావే ఇంకా ప్రకటించలేదు.

Advertisement

Read Also: హైవే సైన్ బోర్డులు గ్రీన్ కలర్‌లోనే ఉంటాయి.. ఎందుకో తెలుసా?

Related News

ఒకటి రెండు కాదు ఒకేసారి 5 కొత్త కార్లు.. టాటా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!

పుతిన్ ఆరస్ vs జిన్‌ పింగ్ హాంగ్‌ కీ L5.. ఎవరి కారు ఎక్కువ పవర్‌ ఫుల్?

80ల్లో సైకిల్ ఉంటే అదో గొప్ప.. అప్పటి నిబ్బాలు చేసే విన్యాసాలకు నిబ్బీలు ఫిదా!

కారు కాదు.. కదిలే కోట.. జిన్‌పింగ్ హాంగ్‌కీ N701 ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఎండ్ల బండిపై హయ్.. హయ్.. మారుతీ కారులో రయ్ రయ్.. 80’s జర్నీ మరపురానిది!

పెట్రోల్ vs డీజిల్ vs సీఎన్జీ vs ఈవీ.. టాటా నెక్సాన్‌లో ఏది కొంటే లాభం?

హీరో గ్లామర్ X 125 ఇక మరింత సేఫ్.. కొత్త ABS వేరియంట్ వచ్చేసింది!

చేతక్ స్కూటర్ బండి కాదు.. మాటల్లో చెప్పలేని ఎమోషన్.. 80s నాటి మిడిల్ క్లాస్ మెమోరీస్!

Big Stories

Advertisement
×