E-Paper
Advertisement

Instagram Battery Drain: మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని తినేస్తున్న ఇన్‌స్టాగ్రామ్.. ఇలా ఫిక్స్ చేయండి

Instagram Battery Drain: మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని తినేస్తున్న ఇన్‌స్టాగ్రామ్.. ఇలా ఫిక్స్ చేయండి
Advertisement

Instagram Battery Drain| చాలా మంది ఫోన్ ఫుల్ ఛార్జ్ చేసినా కాసేపట్లోనే బ్యాటరీ తగ్గిపోతుందని గమనిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఇన్‌స్టాగ్రామ్ యాప్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు, వీడియోలు, రీల్స్, లైవ్ స్ట్రీమింగ్, మెసేజింగ్.. అన్నీ ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్నీ ఎక్కువ బ్యాటరీ పవర్ తీసుకుంటాయి. ఇన్‌స్టాగ్రామ్ ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే బ్యాటరీ అంత త్వరగా ఖాళీ అయిపోతుంది.

బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్

ఇన్‌స్టాగ్రామ్ మీరు క్లోజ్ చేసినా బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేస్తూనే ఉంటుంది. నోటిఫికేషన్స్ పంపుతుంది, కొత్త కంటెంట్ రిఫ్రెష్ చేస్తుంది, మెసేజ్‌లు సింక్ చేస్తుంది. ఇంటర్నెట్, ప్రాసెసర్ ఎప్పుడూ బిజీగా ఉంటాయి. నెట్‌వర్క్ సిగ్నల్ వీక్ ఉంటే ఇంకా ఎక్కువ బ్యాటరీ పోతుంది.

రీల్స్, వీడియోలు బ్యాటరీని ఎలా తగ్గిస్తాయి?

Advertisement

రీల్స్, వీడియోలు హై క్వాలిటీలో స్ట్రీమ్ అవుతాయి. స్క్రీన్, ప్రాసెసర్, ఇంటర్నెట్ మీద భారీ లోడ్ పడుతుంది. ఆటోప్లే ఫీచర్ వల్ల ఒక వీడియో అయిపోగానే మరొకటి వెంటనే మొదలవుతుంది. మీరు గమనించకుండానే బ్యాటరీ త్వరగా పోతుంది.

లొకేషన్, కెమెరా పర్మిషన్స్ తో మరింత ఎక్కువ బ్యాటరీ వినియోగం

ఇన్‌స్టాగ్రామ్ లొకేషన్, కెమెరా, మైక్ పర్మిషన్స్ తీసుకుంటుంది. స్టోరీస్, రీల్స్ చేసేటప్పుడు ఇవి ఎక్కువగా వాడతాయి. GPS ఎప్పుడూ ఆన్ ఉంటే బ్యాటరీ ఎక్స్‌ట్రాగా పోతుంది. వీడియో ప్రాసెసింగ్ కూడా ఎక్కువ సమయం పవర్ తీసుకుంటుంది.

పాత వెర్షన్ యాప్‌తో మరిన్ని సమస్యలు

Advertisement

ఇన్‌స్టాగ్రామ్ పాత వెర్షన్ యాప్ ఉంటే బగ్స్ వల్ల బ్యాటరీ అతిత్వరగా పోవచ్చు. కొత్త అప్‌డేట్స్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ చేస్తాయి. ఎప్పుడూ లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోండి.

బ్యాటరీ డ్రైన్ ఎలా తగ్గించాలి?

  • రీల్స్ ఆటోప్లే ఆఫ్ చేయండి
  • అనవసర నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి
  • ఫోన్ సెట్టింగ్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ డేటా రిస్ట్రిక్ట్ చేయండి
  • యాప్ ఎప్పుడూ అప్‌డేట్ చేస్తూ ఉండండి
  • ఫోన్ సాఫ్ట్‌వేర్ కూడా లేటెస్ట్‌గా ఉంచండి

ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉపయోగిస్తే బ్యాటరీ సమస్య తగ్గుతుంది. స్క్రీన్ టైమ్ గమనించండి, సెట్టింగ్స్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇక ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు!

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో అనవసర రీల్స్‌కు చెక్..‌ మీరు కోరుకున్నవి మాత్రమే చూడాలంటే ఇలా చేయండి

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×