Whistle Podu Celebration: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో సోమవారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ (Chennai Super Kings vs Sunrisers Hyderabad) జట్ల మధ్య బిగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్, ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అంతేకాదు ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్ళింది హైదరాబాద్ జట్టు. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ఉద్దేశించి ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ ర్యాగింగ్ చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ పైన విజయం సాధించిన తర్వాత మొదట సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్ ( Ishan Kishan) విజిల్స్ వేస్తూ రెచ్చిపోయాడు. స్టేడియాన్ని ఖాళీ చేయండి… ఇక మీ పని అయిపోయింది అంటూ సైగలు చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక అటు డ్రెస్సింగ్ రూమ్ నుంచే ఎల్లో కలర్ విజిల్ వేస్తూ రచ్చ చేశాడు హెడ్ (Travis Head). చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ఉద్దేశిస్తూ… గట్టిగానే విజిల్ వేశాడు. ఈ సంఘటన కూడా హాట్ టాపిక్ అయింది. అదే సమయంలో అభిషేక్ శర్మ తల్లి కూడా తగ్గలేదు. ఎల్లో కలర్ విజిల్ పట్టుకొని.. ఈలలు వేస్తూ దారుణంగా ర్యాగింగ్ చేసింది. ఇక మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప కూడా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చినట్లు వీడియో వైరల్ అయింది. ఇక నోరు మూయండి అంటూ వాళ్లను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన నేపథ్యంలో బీసీసీఐకి చెన్నై సూపర్ కింగ్స్ ఫిర్యాదు చేసినట్లు ఓ ప్రకటన వైరల్ గా మారింది.
చెన్నై స్టేడియం లో అభిమానులను ఉద్దేశించి సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు, ఓనర్ ఓవరాక్షన్ చేశారని బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ పైన రెండు సంవత్సరాల పాటు బ్యాన్ విధించాలని బీసీసీఐని కోరిందట చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. అటు కావ్య పాపపై మందలింపు చర్యలు తీసుకోవాలని కోరినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు లెటర్ కూడా హాట్ టాపిక్ అయింది. కాగా ఈ మ్యాచ్ లో ఓడిన చెన్నై.. ప్లే ఆఫ్స్ చేరడం కష్టమేనంటున్నారు.
Also Read: Mushfiqur Rahim: కాలితో గట్టిగా తన్నిన ముష్ఫిఖర్ రహీం..10 మీటర్ల దూరంలో పడ్డ హెల్మెట్
Not just Ishan Kishan, even Kavya Maran told CSK crowd to go home silently😭😭 pic.twitter.com/XEewnC7uiG
— ` (@wristofkohli) May 19, 2026
🚨 OFFICIAL COMPLAINT FILED 🚨
According to this alleged notice, CSK has reportedly lodged a complaint with the BCCI accusing Travis Head and Ishan Kishan of mocking CSK fans and the iconic “Whistle Podu” chant during the SRH vs CSK clash. pic.twitter.com/GmwbbQaRnz
— 𝐍𝐚𝐞𝐞𝐦 (@RCBfied) May 19, 2026