E-Paper
Advertisement

స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌కు ఇలాంటి ప్రైవసీ కూడా ఉంటుందా? కొత్త టెక్నాలజీ ఇదేనండోయ్!

స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌కు ఇలాంటి ప్రైవసీ కూడా ఉంటుందా? కొత్త టెక్నాలజీ ఇదేనండోయ్!
Advertisement

Best Privacy Phones: బస్సులోనో, మెట్రోలోనో ప్రయాణిస్తున్నప్పుడు అర్జెంట్‌గా బ్యాంక్ యాప్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. లేదా ఆఫీస్ మెయిల్‌కి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పక్కన కూర్చున్న వ్యక్తి మన ఫోన్ వైపు చూపులు తిప్పుతున్నప్పుడు కాస్త ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపించడం సహజం. చాటింగ్స్, పర్సనల్ మెసేజ్‌లు చూస్తున్నప్పుడు కూడా ఇదే తిప్పలు.

పాస్‌వర్డ్‌లు, యాప్ లాక్‌లు పెట్టి ఫోన్ లోపల డేటాను దాచుకోగలుగుతున్నాం కానీ, స్క్రీన్ మీద కనిపించే విషయాలను పక్కవారి చూపుల నుంచి కాపాడుకోవడం మాత్రం కష్టమైపోతోంది. అందుకే ఇప్పుడు సెక్యూరిటీ అంటే కేవలం ఫింగర్‌ప్రింట్ లాక్ మాత్రమే కాదు. మనం స్క్రీన్ వాడుతున్నప్పుడు పక్కన ఉన్నవారికి ఏమీ కనిపించకుండా ఉండటం కూడా అంతకంటే ముఖ్యం అయిపోయింది.

Samsung Galaxy S26 Series

Advertisement

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా మోడల్ ఈ విషయంలో అందరికంటే ముందంజలో ఉంది. దీనిలో తొలిసారిగా ఇన్‌బిల్ట్ ప్రైవసీ డిస్‌ప్లే సాంకేతికతను అందించారు. దీంతో ఫోన్ నేరుగా చూసేవారికి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ పక్క నుంచి చూసేవారికి స్క్రీన్ నల్లగా అయిపోయి ఏమీ కనిపించదు. పబ్లిక్ ప్రదేశాల్లో బ్యాంకింగ్ యాప్స్ వాడేవారికి ఇదొక వరం లాంటిది. ఇక సాధారణ S26 మోడల్‌లో ఈ ప్రత్యేకమైన ఫీచర్ లేకపోయినా, సెక్యూర్ ఫోల్డర్ వంటి డిజిటల్ భద్రతా ఫీచర్లు చక్కగా పనిచేస్తాయి.

Also Read: 4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

Apple iPhone 17 Pro

Advertisement

యాపిల్ ఐఫోన్ 17 ప్రో నేరుగా స్క్రీన్ ప్రైవసీ డిస్‌ప్లేను అందించకపోయినా, డిజిటల్ భద్రతలో ఎప్పటిలాగే టాప్‌లో ఉంది. ఫేస్ ఐడీ, పటిష్టమైన డేటా ప్రైవసీ కంట్రోల్స్ దీని ప్రత్యేకత. అవుట్‌డోర్‌లో స్పష్టంగా కనిపించే డిస్‌ప్లే దీని సొంతం. అయితే, పక్కవారి చూపుల నుంచి స్క్రీన్‌ను కాపాడుకోవడానికి ఐఫోన్ యూజర్లు కచ్చితంగా బయట లభించే ప్రైవసీ స్క్రీన్ ప్రొటెక్టర్ వాడాల్సిందే. సాఫ్ట్‌వేర్ పరంగా పూర్తి రక్షణ కోరుకునే వారికి ఐఫోన్ 17 ప్రో మంచి ఎంపిక.

Google Pixel 10 Pro & TCL NXTPAPER 70 Pro

గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్లతో సాఫ్ట్‌వేర్ ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తుంది. దీని స్క్రీన్ ప్రైవసీ కోసం కూడా ఎక్స్‌టర్నల్ గ్లాస్ వాడాల్సిందే. ఇక TCL NXTPAPER 70 ప్రో విషయానికి వస్తే.. ఇది పేపర్ లాంటి మ్యాట్ ఫినిష్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది కళ్లపై ఒత్తిడి లేకుండా, సూర్యకాంతిలో మెరుపులు లేకుండా చదువుకోవడానికి బాగుంటుంది తప్ప, పక్కనున్న వారికి స్క్రీన్ కనిపించకుండా దాచలేదు. ఇది కేవలం గ్లేర్ తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

ఏ ఫోన్ కొనడం ఉత్తమం?

తరచూ ప్రయాణాలు చేస్తూ.. పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కువ ఫోన్ వాడుతుంటే శాంం‌సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా బెస్ట్ ఆప్షన్. ఎలాంటి ప్రైవసీ గార్డ్స్ అవసరం లేకుండా హార్డ్‌వేర్ స్థాయిలోనే ప్రైవసీని ఇది అందిస్తుంది. మిగిలిన ఫోన్లు డిజిటల్ డేటా భద్రతను బాగానే ఇస్తున్నప్పటికీ.. పక్కవారి చూపుల నుంచి స్క్రీన్ కవర్ చేయాలంటే మాత్రం స్క్రీన్ ప్రొటెక్టర్లపై ఆధారపడక తప్పదు. కాబట్టి.. మీ అవసరాన్ని బట్టి సరైన ఫోన్‌ను ఎంచుకోవడం మంచిది.

Also Read: గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

Tags

Related News

రూ.1,251కే బెస్ట్ ఇయర్‌బడ్స్! ఫిలిప్స్ TAT1269 స్పెషల్స్ చూశారా?

13.3 అంగుళాల భారీ డిస్‌ప్లే.. 3 నానోమీటర్ చిప్.. షియోమీ కొత్త టాబ్లెట్ ఫీచర్లు ఇవే!

వీడియో వాచ్ ఫేసెస్‌తో బోట్ కొత్త స్మార్ట్‌వాచ్..లుక్ అదుర్స్

పాత క్లాసిక్ డిజైన్‌కు బ్లూటూత్ 6.0 పవర్.. సోనీ లవర్స్ అయితే ఈ పిక్స్ చూడాల్సిందే!

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..తక్కువ ధరలో బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ వచ్చేసింది!

ఫ్రిజ్,మొబైల్ బడ్జెట్‌లో అదిరిపోయే 43 ఇంచుల టీవీ..డోంట్ మిస్

ఆపిల్, శాంసంగ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా లెనోవో కొత్త ట్యాబ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్!

Big Stories

Advertisement
×