E-Paper
Advertisement

Jio Recharge Plans: జియో షాకింగ్ ఆఫర్.. రూ.579 ప్లాన్‌తో రూ.35,000 విలువైన ప్రీమియం సర్వీస్ ఫ్రీ!

Jio Recharge Plans: జియో షాకింగ్ ఆఫర్.. రూ.579 ప్లాన్‌తో రూ.35,000 విలువైన ప్రీమియం సర్వీస్ ఫ్రీ!
Advertisement

Jio Recharge Plans: రిలయన్స్ జియో తమ కస్లమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను ప్రకటిస్తుంటుంది. మరీ నెల రోజుల తక్కువ గడువు కాకుండా, అలాగని ఏడాది పాటు భారీ ఖర్చు పెట్టలేక మధ్యస్థంగా ఉండే ప్లాన్ కోసం చూసే వారికి రూ.579 ప్లాన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బడ్జెట్‌లో ఉంటూనే అదిరిపోయే బెనిఫిట్స్ కోరుకునే వారికి ఈ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

రోజూ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్:

ఈ రూ.579 ప్లాన్‌తో మొత్తం 56 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీనిలో ప్రతిరోజూ 1.5 GB హైస్పీడ్ డేటా వస్తుంది. దీంతో దాదాపు రెండు నెలల పాటు డేటా టెన్షన్ ఉండదు. ఇక కాలింగ్ విషయానికొస్తే.. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. వీటితో పాటు రోజుకు 100 SMSలు కూడా ఉచితం. అయితే ఈ ప్లాన్‌లో 5G డేటా బండిల్ ఉండదని గుర్తుంచుకోవాలి. నిత్యం 4G వాడుతూ, వై-ఫై అందుబాటులో ఉండేవారికి ఇది చాలా పొదుపైన ప్లాన్.

Advertisement

Also Read: ఎండలకు మీ ఫోన్ సెగలు కక్కుతోందా? బ్యాటరీని చల్లబరిచే సింపుల్ టిప్స్ ఇవిగో!

రూ.35 వేల గిఫ్ట్.. ఇదే హైలైట్:

ఈ ప్లాన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. దీనిలో Google Gemini AI Pro సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దాదాపు 18 నెలల పాటు చెల్లుబాటు అయ్యే ఈ సబ్‌స్క్రిప్షన్ విలువ సుమారు రూ.35,100 అని కంపెనీ చెబుతోంది. ఏఐ టెక్నాలజీని వాడేవారికి ఇది జాక్‌పాట్ లాంటిదే. దీంతో పాటు జియో టీవీ, జియో క్లౌడ్ వంటి యాప్స్ యాక్సెస్ కూడా అదనంగా లభిస్తాయి.

మరిన్ని ఆప్షన్లు:

Advertisement

ఒకవేళ మీరు ఇంకా తక్కువ ధరలో 1.5GB డేటా ప్లాన్ కావాలనుకుంటే.. రూ.239 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. దీని వ్యాలిడిటీ 22 రోజులు మాత్రమే ఉంటుంది. అలాగే రూ.299, రూ.666 వంటి ప్లాన్లు ఉన్నప్పటికీ, గూగుల్ జెమినీ ఆఫర్ కావాలనుకునే వారు మాత్రం కనీసం రూ.299 లేదా అంతకంటే ఎక్కువ ధర గల ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవాలని కంపెనీ నిబంధన పెట్టింది.

Also Read: టీవీ అవసరం లేదు.. ఈ మినీ ప్రొజెక్టర్‌తో ఇంటి గోడనే సినిమా థియేటర్ చేసేయండి!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×