E-Paper
Advertisement

జియో గుడ్ న్యూస్.. రూ. 999 కే 5TB గూగుల్ క్లౌడ్ స్టోరేజ్.. 196 GB డేటా, ఫ్రీ కాల్స్!

జియో గుడ్ న్యూస్.. రూ. 999 కే 5TB గూగుల్ క్లౌడ్ స్టోరేజ్.. 196 GB డేటా, ఫ్రీ కాల్స్!
Advertisement

Jio Plans: దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో, మరొక సరికొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. రూ. 999 ధరతో రూపొందించిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా.. అపరిమిత కాలింగ్‌తో పాటు ఏకంగా 5000 GB (5 TB) గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ ఆఫర్ చేస్తోంది. 98 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ లో యూజర్లకు అనేక రకాల బెనిఫిట్స్ లభించనున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.

రూ.999 ప్లాన్ బెనిఫిట్స్..

జియో ఈ ప్లాన్ ను కంప్లీట్ ఆల్ రౌండ్ ప్యాక్ గా తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద యూజర్లకు ప్రతీ రోజూ 2GB చొప్పున 98 రోజుల పాటు డేటా లభించనుంది. రోజూ వారి లిమిట్ దాటిపోతే.. 64kbps వేగంతో అపరిమితంగా డేటా వాడుకోవచ్చు. అంతేకాకుండా ప్లాన్ గడువు ముగిసేవరకూ దేశంలోని ఏ నెట్ వర్క్ కు అయినా.. ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ప్రతీ రోజు 100 ఎస్ఎంఎస్ లను పంపుకోవచ్చు.

గూగుల్ క్లౌడ్ స్టోరేజ్

Advertisement

ఈ ప్లాన్‌లో అత్యంత ప్రత్యేకమైన అంశం 5000 GB (5 TB) గూగుల్ క్లౌడ్ స్టోరేజ్. సాధారణంగా క్లౌడ్ స్టోరేజ్ కోసం నెలకు వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. కానీ జియో ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు భారీ క్లౌడ్ స్టోరేజ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమైన ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను భద్రంగా దాచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడనుంది.

Also Read: PhonePe కొత్త రూల్.. అకౌంట్ నుంచి రూ.100 కట్ కాకూడదంటే.. ఇదిగో సింపుల్ ట్రిక్!

ఫ్రీగా జియో యాప్స్ కంటెంట్

Advertisement

ఈ రూ.999 ప్లాన్ లో తన యాప్స్ కంటెంట్ ను ఫ్రీగా వీక్షించే వెసులుబాటును జియో కల్పిస్తోంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రముఖ యాప్‌లను ఫ్రీగా వాడుకోవచ్చు. మరోవైపు ఈ ప్లాన్ కింద అర్హులైన కస్టమర్లకు అపరిమిత 5G డేటా సైతం జియో అందిస్తోంది.

Also Read: UPI యూజర్లకు గుడ్ న్యూస్.. నెట్‌వర్క్, పిన్ లేకుండానే పేమెంట్స్.. ఫోన్ అలా ట్యాప్ చేస్తే చాలు!

Related News

బ్లింకిట్, జెప్టోల గుండెల్లో రైళ్లు.. కేవలం 10 నిమిషాల్లో అన్నీ డెలివరీ చేయనున్న Flipkart Minutes యాప్!

వన్‌ప్లస్ నుంచి మరో అద్భుతం.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వస్తున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!

భారీగా తగ్గిన iPhone 17 Pro ధర.. కొత్త మోడల్ వచ్చేలోపు దీన్ని తీసుకోవడం మంచిదేనా?

టాప్ లెవెల్ ఫీచర్లతో Huawei FreeBuds 7 లాంఛ్.. ఏఐ కాలింగ్, 42 గంటల బ్యాటరీ ప్రత్యేకత!

రూ.1500కే కింగ్ వాయిస్ ఫీచర్‌తో itel Tough ఫోన్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

గార్మిన్ నుంచి అద్భుతమైన స్మార్ట్ రింగ్.. పది వేర్వేరు సైజుల్లో లాంచ్‌కు సిద్ధం!

iPhone Duo కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. కానీ చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే?!

యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?

Big Stories

Advertisement
×