BigTV English

Laser Communication: రోదసి నుంచి.. హైస్పీడ్ డేటా..?

Laser Communication: రోదసి నుంచి.. హైస్పీడ్ డేటా..?

Laser Communication: రోదసి కమ్యూనికేషన్లకు సంబంధించి నాసా మరో కీలక ప్రయోగం చేపట్టనుంది. ఇది విజయవంతమైతే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISC) నుంచి ఎర్త్‌స్టేషన్‌కు సమాచార బట్వాడా అతి వేగంగా జరగగలదు. అంతరిక్ష నౌకల నుంచి సమాచారం తీసుకోవాలన్నా, పంపాలన్నారేడియో కమ్యూనికేషన్లపైనే ఆధారపడుతున్నారు.


రాన్రాను అంతరిక్ష పరిశోధనలు ముమ్మరం కావడంతో పాటు పెద్ద మొత్తాల్లో డేటా బట్వాడా అనివార్యమవుతోంది. ఇందుకోసం లేజర్ ఆధారిత కమ్యూనికేషన్లపై పరిశోధనలను నాసా వేగవంతం చేసింది. రేడియో తరంగాలతో పోలిస్తే లేజర్ సాంకేతికతతో డేటా వేగం 10 నుంచి 100 రెట్లు అధికంగా ఉంటుంది. అంటే సెకనుకు 1.2 గిగాబిట్ల వేగంతో సమాచార మార్పిడి జరుగుతుంటుంది.

గతంలో చేపట్టిన లేజర్ ఆధారిత కమ్యూనికేషన్ల ప్రయోగాలతో పోల్చి చూసినా.. తాజా ప్రయోగం వల్ల రెట్టింపు వేగంతో డేటా ట్రాన్సిమిషన్ సాధ్యం కాగలదని నాసా భావిస్తోంది. రేడియో తరంగాలతో పోలిస్తే.. కాంతితరంగాలు మరింత డేటాను ట్రాన్స్‌ఫర్ చేయగలవు. అత్యంత వేగంతో డేటాను ఐఎస్‌ఎస్-ఎర్త్ స్టేషన్ల మధ్య పంపేందుకు హైస్పీడ్ కనెక్షన్లు అవసరం. ఇందుకోసం ఆప్టికల్ సిస్టమ్స్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.


నవంబర్ మొదటి వారంలో ఆ పరికరాలను స్పేస్-ఎక్స్ కార్గో ద్వారా ఐఎస్ఎస్‌కు నాసా చేర్చనుంది. గతంలో ప్రయోగించిన రిలే శాటిలైట్ ద్వారా నాసా తొలిసారిగా ఎండ్-టూ-ఎండ్ లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థను పరీక్షిస్తుంది. భవిష్యత్తులో భూమి నుంచి చంద్రుడు లేదా అంగారకుడిపైకి లేజర్ తరంగాల ద్వారా టెరాబైట్ల మొత్తంలో సమాచారాన్ని పంపొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఐఎస్ఎస్ నుంచి సమాచార బట్వాడాలో భాగంగా కొత్త వ్యవస్థను పరీక్షించిన తర్వాతే మిగిలిన అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది.

నాసా పరీక్షించనున్న కమ్యూనికేషన్ లేజర్‌ను ILLUMA-T (ఇంటిగ్రేటెడ్ లేజర్ కమ్యూనికేషన్స్ రిలే డిమాన్‌స్ట్రేషన్ లో ఎర్త్ ఆర్బిట్ యూజర్ మోడెమ్ అండ్ యాంప్లిఫైర్ టెర్మినల్) అని పిలుస్తున్నారు. ఇన్‌ఫ్రారెడ్ కిరణాల సాయంతో ILLUMA-T లేజర్.. డేటాను బట్వాడా చేస్తుంటుంది. ఈ కొత్త సాంకేతికత విజయవంతమైతే.. డీప్ స్పేస్ కమ్యూనికేషన్లలో విప్లవాత్మక మలుపు కాగలదు.

Related News

Motorola Mobiles: ఒకే ఫోన్‌లో అన్నీ! ఫాస్ట్ ఛార్జ్ తో వచ్చేసిన మోటరోలా అల్ట్రా బీస్ట్!

Wifi Plans Free OTT: 100Mbps వైఫై.. ఉచితంగా ఓటీటీ.. బెస్ట్ ప్లాన్స్ ఇవే

Smartphone Comparison: షావోమీ 17 ప్రో మాక్స్ vs ఐఫోన్ 17 ప్రో మాక్స్.. ఫ్లాగ్‌షిప్ దిగ్గజాల పోటీ

Shai-Hulud virus: ఐటీ కంపెనీలపై సైబర్ దాడులు.. ప్రభుత్వ హెచ్చరిక.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

iPhone 17 cheaper: ఐఫోన్ 16 కంటే ఐఫోన్ 17 తక్కువ ధరకు.. కొత్త మోడల్‌పై ఎక్కువ డిస్కౌంట్!

Vivo vs Realme Comparison: ఫోన్లలో ఎవరు విన్నర్? ఏ ఫోన్ వాల్యూ ఫర్ మనీ? షాకింగ్ రిజల్ట్!

Motorola vs Redmi comparison: మోటరోలా vs రెడ్‌మీ అసలైన కింగ్ ఎవరు? బడ్జెట్ ఫోన్లలో బెస్ట్ ఎవరు?

WhatsApp Status: వాట్సాప్ స్టేటస్ కొత్త ట్రిక్.. టార్గెట్ కాంటాక్ట్ తప్పక చూడాలంటే ఇలా చేయండి

Big Stories

×