BigTV English

Pragathi: రెండో పెళ్లి .. నటి ప్రగతి క్లారిటీ..

Pragathi: రెండో పెళ్లి .. నటి ప్రగతి క్లారిటీ..

Pragathi: గత కొద్దిరోజులుగా ప్రముఖ నటి ప్రగతి ప్రొడ్యూసర్ని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వచ్చాయి. చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్న ప్రగతి ఆమె భర్తతో మనస్పర్ధలు కారణంగా విడిపోయి చాలా సంవత్సరాలుగా పిల్లలతో ఒంటరిగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ఒక ప్రొడ్యూసర్ ప్రపోజ్ చేశారని.. అతనికి ఎటువంటి చెడు అలవాట్లు లేకపోవడం..పైగా అతని ప్రపోజ్ చేసిన విధానం నచ్చడంతో ప్రగతి కూడా ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు వచ్చాయి.


అయితే తనపై వస్తున్న వార్తల గురించి ప్రగతి స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ప్రగతి తనపై ఇలా దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అంటూ నిలదీశారు. ఏదన్నా ఉంటే నేను చెబుతాను కదా.. అని అన్నారు. ఈ వీడియోతో ప్రగతిపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న రెండో పెళ్లి డిస్కషన్ మొత్తం నిజం కాదు అన్న విషయం తేలిపోయింది.

ఇంతకీ వీడియోలో ఏముందంటే” నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ప్రముఖ మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఇది నిజంగా అత్యంత బాధ్యతారహితంతో కూడుకున్న పని. మీరు ఒక సంస్థను నడుపుతున్నారు.. అందులో ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు.. మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక న్యూస్ ఎలా ప్రచారం చేశారు. నేను కేవలం ఒక నటిని మాత్రమే కావచ్చు కానీ మీరు ఏం రాసిన చెల్లుతుంది అని అనుకుంటున్నారా? నేను దీన్ని ఖండిస్తున్నాను.


అసలు నా వ్యక్తిగత జీవితం గురించే రాసే హక్కు మీకు ఎక్కడిది? ఇతరుల వ్యక్తిగత జీవితాలలోకి ఇలా చొరబడి ఇష్టం వచ్చినట్లు రాయడం బాధాకరం. ఆధారాలు ఉంటే రాసిన పర్వాలేదు కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా రాయడం మంచిది కాదు. ఇకనైనా నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే రాయండి.” అంటూ ప్రగతి తీవ్రంగా తనపై వస్తున్న వార్తలను ఖండించారు. అంతేకాదు తనకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తాను అని కూడా స్పష్టం చేశారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×