E-Paper
Advertisement

Walkie Talkie Building: ఇది భవనం కాదు సూర్యుడి ‘బిడ్డ’.. అక్కడ ఏం పెట్టినా బుగ్గే.. మిస్టరీ వీడింది

Walkie Talkie Building: ఇది భవనం కాదు సూర్యుడి ‘బిడ్డ’.. అక్కడ ఏం పెట్టినా బుగ్గే.. మిస్టరీ వీడింది
Advertisement

ఓ పెద్దాయన తన కారును రోడ్డు సైడ్ పార్కు చేసి షాపింగ్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఆ కారులోని కొన్ని పార్టులు కరిగిపోయి కనిపించాయట. ఇంకాస్త ఆలస్యం చేసి ఉంటే కారు మొత్తం బుగ్గయ్యేది. అయితే పొగలు గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో ఆ కారులోని కొన్ని పార్టులు మాత్రమే కరిగాయి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.. సరిగ్గా అదే ప్లేసులో పార్కు చేసిన చాలా కార్లు ఇలాగే కరిగిపోయాయట. మొదట్లో అలా ఎందుకు జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత అసలు కారణం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అలాంటి ఘటనలకు కారణం.. ఓ బహుళ అంతస్తుల భవనం.

భవనం వల్ల కార్లు ఎందుకు కరుగుతాయ్?

ఔను కదా.. భవనం వల్ల కార్లు కరిగిపోవడం ఏమిటీ? మరీ సిల్లీ రీజన్ కాకపోతే అని అనుకుంటున్నారా? మొదట్లో చాలామంది అలాగే అనుకున్నారట. అయితే, ఆ భవనానికి ఎదురుగా ఉన్న షాపులు, ఆఫీసుల్లో పనిచేసేవారు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారట. ఆ భవనం వల్ల అక్కడ చాలా వేడి పుడుతోందని, అస్సలు ఉండలేకపోతున్నామని వారు అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. విషయం కాస్త సీరియస్‌గా మారింది. ఆ బిల్డింగ్ యాజమాన్యాన్ని దీన్ని ప్రశ్నిస్తే.. వాళ్లు కూడా మొదట్లో షాకయ్యారట. మా బిల్డింగ్ వల్ల వాళ్ల కార్లు ఎలా కరిగిపోతాయ్? అని అడిగారట. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని.. ఔను కదా అని దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారట.

ఇంతకీ ఏమిటీ ఆ మిస్టరీ?

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న భవనం పేరు ‘వాకి టాకీ’. ఇది లండన్‌లోని 20 ఫెన్‌చర్చ్ స్ట్రీట్‌లో ఉంది. వాకీ టాకీ షేపులో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. 2013 సంవత్సరంలో ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యింది. అప్పటి నుంచి స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడం మొదలైంది. ఆ బిల్డింగ్ వల్ల చాలా వేడి పుడుతోందని, తమ కార్ల భాగాలు కరిగిపోతున్నాయని చెప్పడంతో.. అధికారులు అసలు విషయం తెలుసుకున్నారు. ఆ బిల్డింగ్ పై భాగం కాస్త ముందుకు వంగినట్లు ఉంటుంది. పైగా ఆ బిల్డింగ్ మొత్తాన్ని అద్దాలతో నిర్మించారు. దానివల్ల ఆ బిల్డింగ్ మీద పడిన సూర్య రశ్మి.. పైభాగంలో అర్ధచంద్రాకారంలో ముందుకు వంగి ఉన్న అద్దాల మీద పడేది. ఆ కిరణాలు నేరుగా ఎదురుగా ఉన్న రోడ్డు, భవనాల మీద పడేవి. దీంతో అక్కడ విపరీతమైన వేడి పుట్టేది.

భూతద్దంలా మారిన భవనం

ఉదాహరణకు భూతద్దంతో కాగితం మీద ఒకే చోట సూర్యరశ్మిని ఫోకస్ చేస్తే.. ఆ పేపర్ భగ్గుమని కాలిపోతుంది. ఆ భవనం కూడా అంతే.. అలాగే పనిచేసేది. అయితే, భూతద్దాన్ని సూర్యుడికి ఎదురుగా పెడితే అలా పనిచేస్తుంది. కానీ, ఆ భవనం సూర్యుడికి రిఫ్లెక్షన్‌లా ఉండేది. దాని షేపు వల్ల అర్ధవృత్తాకారంలో ఉన్న అద్దంలా పని చేసేది. కిరణాలను వక్రీకరించి.. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ వీధిని భగభగలాడించేది. అందుకే స్థానికులు ఆ సూర్యరశ్మి పడే ప్రాంతానికి ‘డెత్ రే’ అని పేరు పెట్టారు. చివరికి ఆ ప్రాంతాన్ని నో పార్కింగ్ ఏరియాగా మార్చారు. ఆ సూర్య కిరణాల వల్ల ఆ భవనం ఎదురుగా ఉన్న ఆఫీసుల ముంగిట్లోని డోర్ మ్యాట్‌లు కరిగిపోయేవట. టైల్స్ నుంచి పొగలు వచ్చేవట. గోడల రంగులు కూడా ఎండిపోయి రాలిపోయేవట. దీన్ని బట్టి చూస్తే.. ఆ బిల్డింగ్ వల్ల అక్కడ ఎంత భయానక పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు.

చివరికి ఏం చేశారు?

Advertisement

స్థానికుల ఫిర్యాదు మేరకు ఆ బిల్డింగ్ యజమాని పెద్ద మనసు చేసుకుని.. దానికి ఉన్న అద్దాలను మార్పించాడు. సూర్యరశ్మి తగలకుండా పర్మినెంట్ సన్‌షేడ్ సిస్టమ్ ఏర్పాటు చేశాడు. దీన్నే Brise soleil అని కూడా అంటారు. ఇది సూర్య రశ్మిని అద్దాల మీద పడకుండా అడ్డుకుంటుంది. సన్‌షేడ్స్ ఏర్పాటు చేసిన తర్వాత మళ్లీ ఎలాంటి సమస్యలు రాలేదు. చూశారా.. చిన్న డిజైన్ ఎంత నష్టం కలిగించిందో. అందుకే ఇలాంటి భారీ నిర్మాణాలు చేపట్టేప్పుడు.. సైన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే ఇలాగే జరుగుతుంది.

Also Read: బిల్డింగ్‌పై వేలాడుతోన్న బస్సు.. కంగారు పడొద్దు, ఆ డిజైనే అంత!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×