E-Paper
Advertisement

Bus in Wall: బిల్డింగ్‌పై వేలాడుతోన్న బస్సు.. కంగారు పడొద్దు, ఆ డిజైనే అంత!

Bus in Wall: బిల్డింగ్‌పై వేలాడుతోన్న బస్సు.. కంగారు పడొద్దు, ఆ డిజైనే అంత!

కొత్త వాళ్లు ఎవరైనా ఆ రోడ్డు నుంచి వెళ్తున్నప్పుడు.. పైకి చూసి ఒక్కసారే ఉలిక్కిపడతారు. బిల్డింగ్ 3వ ఫ్లోర్‌‌లో వేలాడుతున్న ఆ బస్సును చూసి షాకవుతారు. ఆ తర్వాత భలే ఉందే అని నవ్వుకుంటూ సెల్ఫీ తీసుకుంటారు. ఈ భవనాన్ని చూసిన కొందరు.. ‘‘క్రియేటివిటీ పరాకాష్టకు చేరినప్పుడు ఇలాంటి ఐడియాలే వస్తాయి. మనకు ఏ డిజైన్లు తట్టలేనప్పుడు ఇలా బస్సులు, విమానాలను బిల్డింగులోకి దూసుకెళ్లినట్లు పెట్టేస్తే సరిపోతుంది’’ అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అయితే, అలాంటి డిజైన్లు ఏర్పాటు చేయడం అంత ఈజీ కాదని అది చాలా ప్రమాదంతో కూడుకున్నదని మరి కొందరు అంటున్నారు. సోషల్ మీడియాలో చర్చనీయంగా మారిన ఈ బిల్డింగ్ ఎక్కడుందో తెలుసా?

చాంగ్‌కింగ్ నగరంలో..

చైనాలోని చాంగ్‌కింగ్ నగరంలో ఈ బస్సు భవనం ఉంది. ఇలాంటివి రెండు బిల్డింగులు ఉన్నాయి. ఒకటి బస్సు ముందు భాగం బిల్డింగు నుంచి బయటకు వస్తున్నట్లుగా ఉంటే.. రెండోది బస్సు బిల్డింగ్ లోపలికి చొచ్చుకెళ్తున్నట్లుగా ఉంది. ఆ బస్సు వెనుక భాగం బయటకు కనిపిస్తుంది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు వచ్చిన ఐడియా ఇది. మరి, అలాంటి డిజైన్లు ప్రమాదకరం కదా? అవి ఎవరి మీదైన పడితే? అని సందేహిస్తు్న్నారా? డోన్ట్ వర్రీ.. ఈ నిర్మాణానికి మున్సిపాలిటీ అధికారుల పర్మిషన్ కూడా లభించింది. దాని నిర్మాణాలు పరిశీలించిన తర్వాత అది ఏమాత్రం ప్రమాదకరం కాదని నిర్ధరించారు.

ఆ చైనా పాట స్ఫూర్తితో..

చైనాలో ‘‘ఎనిమిదో అంతస్తులో నిలిచిన నెంబర్ 2 బస్సు’’ అనే పాట ఉంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొనే ఈ బిల్డింగ్‌ను డిజైన్ చేసినట్లు ఆ భవన యజమాని తెలిపాడు. మరో విషయం ఏమిటంటే చాంగ్‌కింగ్ నగరం సబ్ వే రైళ్లకు ప్రసిద్ధి. అక్కడ కొన్ని రైళ్లు భవనాల మధ్య నుంచి దూసుకెళ్తుంటాయి. దానికి సింబాలిక్‌గా ఈ బస్సు భవనం పర్యాటకులను ఆకట్టుకుంటుందని భవన యజమాని ఓ మీడియా సంస్థకు తెలిపాడు. ఈ డిజైన్ పూర్తి చేయడానికి సుమారు ఆరు నెలలు పట్టిందని పేర్కొన్నాడు. ఈ బిల్డింగ్ అలా ప్రారంభమైందో లేదో.. పర్యటకులు దాన్ని చూసేందుకు క్యూ కడుతున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. అయితే కొందరు దీని సేఫ్టీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అర్బన్ మేనేజ్‌మెంట్ బ్యూరో రంగంలోకి దిగింది. మున్సిపాలిటీ అధికారుల నుంచి అనుమతి లభించినా, అది ప్రజలకు ప్రమాదకరం కాకూడదనే ఉద్దేశంతో మరోసారి పూర్తిగా పరిశీలించి నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు.

ఇండియాలోనూ ఉంది

ఇండియాలో కూడా ఇలాంటి బిల్డింగ్ ఒకటి ఉందంటే మీరు నమ్ముతారా? అయితే, అది బస్సు కాదు.. విమానం. ముంబయిలోని కిడ్‌జానియా (KidZania) చిల్డ్రన్ థీమ్ పార్క్ బిల్డింగ్ బయట నుంచి విమానం ముక్కు భాగం బయటకు వచ్చినట్లుగా ఉంటుంది.  అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత ఈ బిల్డింగ్ పేరు మార్మోగింది. సరిగ్గా ప్రమాదం జరిగిన రోజు ఉదయమే ఆ సంస్థ.. ఆ బిల్డింగ్ ఫొటోతో ప్రకటన ఇచ్చింది. అయితే, అది యాదృశ్చికంగా జరిగిన ఘటన.

Also Read: ఈ పక్షి ఉమ్ము ఖరీదు రూ.10 లక్షలకు పైనే.. లొట్టలేసుకుని మరీ తింటున్నారు!

Related News

ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.. కానీ డ్యూటీలో చేరే లోపే రిటైర్ అయిపోయాడు!

ఉపాధి కూలీలకు ‘గుండు’ గండం.. యాప్‌లో విచిత్ర సమస్య!

హైదరాబాద్ మెట్రోలో బరితెగించిన యువకుడు.. సీటుపై కాళ్లు పెట్టి రచ్చ రచ్చ!

వీధి కుక్కలను ఉపయోగించి విద్యుత్ తయారీ.. ఎక్కడో తెలుసా..!

ఇదెక్కడి విచిత్రం సామి! 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం.. ట్విస్ట్ ఏంటంటే?

ఐటీ జాబ్‌కు గుడ్‌బై చెప్పి.. ఆటో నడుపుతున్న మహిళ.. నెల సంపాదన తెలిస్తే షాకే!

పక్షులు తమ గూట్లో పాముల కుబుసం ఎందుకు పెట్టుకుంటాయి? అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే!

వైరల్ వీడియో .. కేవలం రూ. 1600 ఖర్చుతో ఏసీ.. సామాన్యుడి టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

×