E-Paper
Advertisement

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!
Advertisement

Inverter Battery: ఎండాకాలం వచ్చిందంటే చాలు విద్యుత్ కోతలు సర్వసాధారణం అయిపోతాయి. ఇలాంటి సమయంలో అండగా నిలిచేది ఇన్వర్టర్లే. అయితే చాలామంది ఇళ్లలో ఇన్వర్టర్ ఉన్నప్పటికీ.. ‘బ్యాటరీ అస్సలు నిలవడం లేదు, చాలా త్వరగా డ్రైన్ అయిపోతోంది’ అనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తుంటాయి. దీంతో కొందరు బ్యాటరీని సైతం మార్చేస్తుంటారు. అయితే బ్యాటరీని మార్చేయడానికి ముందు కనుక్కోవడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. బ్యాటరీ త్వరగా అయిపోవడానికి గల 5 ప్రధాన కారణాలను తెలియజేస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

బ్యాటరీలో డిస్టిల్డ్ వాటర్ తగ్గడం

ఇన్వర్టర్ బ్యాటరీ సాఫీగా పనిచేయడానికి అందులో ఉండే యాసిడ్ లెవెల్స్ కరెక్ట్‌గా ఉండటం చాలా ముఖ్యం. బ్యాటరీలోని డిస్టిల్డ్ వాటర్ (Distilled water) తగ్గిపోయినప్పుడు ప్లేట్లు ఎండిపోయి బ్యాటరీ సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ప్రతి 2-3 నెలలకోసారి వాటర్ లెవెల్స్ చెక్ చేసి.. అవసరమైతే డిస్టిల్డ్ వాటర్ పోయాలని సూచిస్తున్నారు.

టెర్మినల్స్ పై తుప్పు పట్టడం

Advertisement

బ్యాటరీ పాజిటివ్, నెగటివ్ టెర్మినల్స్ (వైర్లు కనెక్ట్ చేసే చోట) పై కాలక్రమేణా తెల్లటి లేదా ఆకుపచ్చటి కార్బన్ పేరుకుపోతూ ఉంటుంది. ఇది బ్యాటరీ సరిగ్గా ఛార్జ్ అవ్వకుండా అడ్డుకుంటుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయినట్లు చూపించినా లోడ్ పడగానే వెంటనే డిస్చార్జ్ అయిపోతుందని తెలియజేస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు వేడి నీటితో టెర్మినల్స్ క్లీన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఓవర్ లోడింగ్

ఇన్వర్టర్, బ్యాటరీ సామర్థ్యానికి మించి ఎక్కువ పరికరాలను దానిపై రన్ చేయడం వల్ల బ్యాటరీ చాలా వేగంగా అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి పవర్ పోయినప్పుడు కేవలం ఫ్యాన్లు, లైట్లు మాత్రమే వాడుకోవడం బెస్ట్. మిక్సీలు, గీజర్లు, ఎక్కువ పవర్ వాడుకునే పరికరాలను ఇన్వర్టర్‌పై వాడితే బ్యాటరీ లైఫ్ త్వరగా తగ్గిపోతుంది.

పాతబడిన బ్యాటరీ

Advertisement

సాధారణంగా ఇన్వర్టర్ బ్యాటరీ జీవితకాలం 3 నుండి 5 సంవత్సరాలు ఉంటుంది. బ్యాటరీ కొని చాలా కాలం అయిపోతే దాని కెపాసిటీ సహజంగానే తగ్గిపోతుంది. ఎంత ఛార్జ్ చేసినా బ్యాటరీ బ్యాకప్ ఇవ్వడం లేదంటే అది ఎండ్ ఆఫ్ లైఫ్‌కి వచ్చిందని అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!

ఛార్జింగ్ సిస్టమ్‌లో సమస్య

కొన్నిసార్లు సమస్య బ్యాటరీలో కాకుండా ఇన్వర్టర్ లోని ఛార్జింగ్ సర్క్యూట్ లో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్వర్టర్ బ్యాటరీని ఓవర్ ఛార్జ్ చేసినా లేదా తక్కువ ఛార్జ్ చేసినా బ్యాటరీ బ్యాకప్ పడిపోతుందని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఇన్వర్టర్ బ్యాటరీని ఎప్పుడూ గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలని కూడా సూచిస్తున్నారు. మెుత్తంగా పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సమస్య తగ్గకపోతే.. ఒకసారి టెక్నిషియన్ ను పిలిపించి ఇన్వర్టర్ వోల్టేజ్‌ను చెక్ చేయించడం మంచిదని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: కదిలే ఏసీ కావాలా? 2026లో టాప్ ఇవే.. ఎక్కడకెళ్లినా మీ వెంటే!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×