E-Paper
Advertisement

బాల్క సుమ‌న్ అరెస్టు… కేటీఆర్ క్లీన్ బౌల్డ్‌..! రెండ్రోజుల్లోనే రెండు ర‌కాలుగా..! ఇదేందే రామ‌న్నా..?

బాల్క సుమ‌న్ అరెస్టు… కేటీఆర్ క్లీన్ బౌల్డ్‌..! రెండ్రోజుల్లోనే రెండు ర‌కాలుగా..! ఇదేందే రామ‌న్నా..?
Advertisement

న‌టించ‌డం రాదంటాడు. ఉన్న‌దున్న‌ట్టు మాట్లాడుడే తెలుసంటాడు. దీన్నే జ‌నం త‌ప్పుగా అర్ధం చేసుకుని త‌న‌కు అహంకారాన్ని ఆపాదించార‌ని తెగ బాధ‌ప‌డ‌తాడు. కానీ ఆయ‌న సంద‌ర్బాన్ని బ‌ట్టి, వేదిక‌ను బట్టి నాలుక మ‌డ‌తెడ‌తా ఉంటాడు. ఏ ఎండ‌కు ఆ గొడుగ‌న్న‌మాట‌. సినీ న‌టులు ఆయా పాత్ర‌ల్లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిన‌ట్టు.. కేటీఆర్ కూడా స‌మ‌యానుకూలంగా, అక్క‌డి ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని అభిప్రాయాలు మారుస్తా ఉంటాడు. కేటీఆర్ మాటంటే.. ఆ పార్టీ మాట‌న్న‌ట్టే. ఆయ‌న వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయినా.. స్టీరింగ్ మొత్తం ఆయ‌న చేతిలోనే ఉంది.

బాల్క సుమ‌న్‌పై కేసు పెట్టి జైలుకు పంపిన‌ ఉదంతంలో.. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే రెండు ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్తం చేశాడు కేటీఆర్‌. మీట్ ది ప్రెస్..లో విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు ఒక‌లా.. మరుస‌టి రోజే.. సుమ‌న్ ములాఖ‌త్ త‌రువాత‌.. అక్క‌డ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఇంకో రకంగా ఆయ‌న మాట్లాడిన తీరు ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చింది. అమాయ‌కంగా త‌న నిజాయితీ పట్ల త‌నే స‌ర్టిఫికెట్ ఇచ్చుకున్న మ‌రుస‌టి రోజే.. మాట మార్చ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బాల్క సుమ‌న్ .. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేయాల‌నే క‌రెక్టు వ్యాఖ్య‌లు క‌రెక్టు కాదు..దీన్ని అంతా ఖండించాల్సిందే.. తాను ఏకీభ‌విస్తున్న‌ట్టుగా చెప్పాడు. క‌చ్చితంగా ఇది త‌ప్పుబ‌ట్టాల్సిన విష‌య‌మే అన్నాడు.

Advertisement

బాల్క సుమ‌న్ మాట‌ల వేడిని కొంచెం త‌గ్గించేందుకు.. గ‌తంలో కూడా కాంగ్రెస్ నాయ‌కులు, పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి కూడా రెచ్చ‌గొట్టే మాట‌లు మాట్లాడార‌ని గుర్తు చేశాడు. అంద‌రికీ ఒకేలా చ‌ట్టం వ‌ర్తించాల‌ని అన్నాడు. కానీ మ‌రుస‌టి రోజే. .దీనికి మ‌రింత మ‌సాల ద‌ట్టించాడు. అస‌లు బాల్క సుమ‌న్ మాట్లాడింది త‌ప్పే కాద‌న్నాడు.. అత‌ను అక్క‌డి కార్మికుల క్షేమం కోసం ఉద్య‌మం ఎలా చేయాలో చెప్పేందుకు వాడిన ప‌దాల‌నే.. చిలువ‌లు ప‌లువ‌లు చేసి దాన్ని సైడ్ ట్రాక్ ప‌ట్టించి.. అస‌లు విష‌యం ప‌ట్టించుకోకుండా కేసులు పెట్టి జైలు పాలు చేశార‌న్నారు.

అస‌లు బాల్క సుమన్ పై మీకెందుకు ఇంత క‌క్ష‌? అని కూడా ప్ర‌భుత్వాన్ని నిల‌దీశాడు రామ‌న్న‌. అంద‌రూ అన్నారు.. మేమూ అన్నాం.. త‌ప్పేం లేద‌న్న‌ట్టా..? మేమొక్క‌ర‌మే ఇలాంటి మాట‌లు మాట్లాడుతున్నామా? అని స‌ర్ది చెప్పుకునే ప్ర‌య‌త్న‌మా? అస‌లు ఇలాంటి మాట‌లు కామ‌న్ కదా..? దీనికే ఇంత రాద్దాంత‌మా? అని లైట్ తీసుకోమంటున్నాడా? ఏమీ అర్థంకాక అక్క‌డున్న మీడియా బుర్రగోక్కున్న‌ది. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో మ‌స్తు కేసులు భ‌రించిండు సుమ‌న్‌.. ఇవీ ఓ లెక్క‌నా ? అన్నాడు.

Advertisement

అంటే స‌ర్కార్ క‌చ్చితంగా త‌ప్పుడు కేసులు పెట్టే లోప‌ల వేసింద‌ని ఆరోపిస్తున్నాడా? మేమింతే మార‌మంటే మారం.. మా విధాన‌మే ఇంత‌..! ఇట్ల‌నే ఉంట‌మ‌ని.. స‌మన్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కేటీఆర్ స‌మ‌ర్థిస్తున్నాడా? ఇంకా అర్థం కాక మ‌ళ్లీ బుర్ర గోక్కుందామ‌నుకునేలోపు.. కేటీఆర్ అక్క‌డ్నుంచి వెళ్లిపోయాడు. కొంప‌దీసి ఎవ‌రైనా మ‌ళ్లీ ప్ర‌శ్న‌లు వేస్తే.. దీన్ని ఇంకెన్ని మ‌లుపులు తిప్పి.. ఎన్ని వంక‌ర‌లుగా మార్చి మాట్లాడాలో అని భ‌య‌ప‌డి ఉంటాడు కేటీఆర్‌…అనుకుని స‌ర్దిచెప్పుకున్నారు అక్క‌డి విలేక‌రుల బృందం. మళ్లీ దొర‌క‌క‌పోతాడా? అడ‌గ‌క‌పోతామా ? అని కూడా అనుకున్నారు.

Related News

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

Big Stories

Advertisement
×