BigTV English

Lungs healthy: రాకెట్ టెక్నాలజీతో ఊపిరితిత్తులకు ఆరోగ్యం..

Lungs healthy: రాకెట్ టెక్నాలజీతో    ఊపిరితిత్తులకు ఆరోగ్యం..
Lungs healthy

Machine named ECMO keeps lungs healthy says China

ఇతర ప్రపంచ దేశాలతో పోటీపడి మరి పరిశోధనలు చేయడానికి చైనా ఉత్సాహం చూపిస్తోంది. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి అయినా ఆ దేశం వెనకాడడం లేదు. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో లేని టెక్నికల్ పరికరాలు చైనాలో ఉన్నాయి. తాజాగా చైనా రాకెట్ టెక్నాలజీని ఉపయోగించి హెల్త్ సెక్టార్‌కు ఉపయోగపడే ఒక కొత్త పరికరాన్ని తయారు చేసింది.


పలు వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లకు కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సమయంలో వారికి ఆక్సిజన్ సపోర్ట్‌ను అందిస్తారు. దానికోసమే ఆక్సిజన్ సిలండర్లు కూడా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఒక పరికరాన్నే చైనా హైబ్రిడ్ విధానంతో తయారు చేసింది. దాని పేరు ఎక్స్‌ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజెనరేషన్ (ఎక్మో). రాకెట్ టెక్నాలజీ సహాయంతో ఈ పరికరాన్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. తాజాగా బీజింగ్‌లో లాంచ్ అయిన ఈ పరికరం కోవిడ్ 19 పేషెంట్ల జీవితాలను నిలబెడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఎక్మో అనేది కృత్రిమ గుండె, ఊపరితిత్తుల లాంటిది. ఇది బయట నుండే పేషెంట్‌కు ఊపిరి తీసుకునే విషయంలో, గుండె ఆరోగ్యంగా కొట్టుకునే విషయంలో సహాయపడుతుంది. మామూలుగా దీనిని ఓపెన్ హార్ట్ సర్జరీ సమయాల్లో ఉపయోగిస్తుంటారు. కోవిడ్ మహహ్మరి సమయంలో దీని వినియోగం ఆకాశాన్ని తాకింది. ఎక్మో ద్వారా ఎంతోమంది కోవిడ్ 19 పేషెంట్లు ఆరోగ్యంగా బతికి బయటపడడం అనేది సెన్సేషన్ సృష్టించింది.


2020 తర్వాత ఎక్మోను రీవైవ్ 1 పేరుతో రాకెట్ టెక్నాలజీ సాయంతో డెవలప్ చేయడం మొదలుపెట్టారు. రాకెట్‌లోని సెర్వోమెకానిజంతో ఈ ఎక్మో సిస్టమ్ డెవలప్‌మెంట్ జరిగిందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఒక రాకెట్ పొజిషన్, డైరెక్షన్ మార్చడానికి ఈ సెర్వో మెకానిజం ఉపయోగపడుతుందని వారు అన్నారు. అందుకే ఎక్మో కూడా రాకెట్ సెర్వో మెకానిజంకు తగినట్టుగా పనిచేస్తుందని వారు తెలిపారు. ఇతర ఆక్సిజన్ పరికరాలతో పోలిస్తే.. ఎక్మో బరువు తక్కువగా ఉంటుందని, ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

బీజింగ్, టయాన్జిన్‌లోని ఎన్నో ఆసుపత్రులు, వైద్యులు ఎక్మో తయారీలో పాల్గొని.. తగిన సహాయాన్ని అందించారు. ఎన్నో సీరియస్ కేసులపై ఎక్మోను పరీక్షించిన తర్వాతే దీనిని లాంచ్ చేశామని వైద్యులు చెప్తున్నారు. ఎన్నో ఫారిన్ ప్రొడక్ట్స్‌తో పోలిస్తే.. ఎక్మో ధర కూడా చాలా తక్కువని వారు అంటున్నారు.

Tags

Related News

Vivo vs Realme Comparison: ఫోన్లలో ఎవరు విన్నర్? ఏ ఫోన్ వాల్యూ ఫర్ మనీ? షాకింగ్ రిజల్ట్!

Motorola vs Redmi comparison: మోటరోలా vs రెడ్‌మీ అసలైన కింగ్ ఎవరు? బడ్జెట్ ఫోన్లలో బెస్ట్ ఎవరు?

WhatsApp Status: వాట్సాప్ స్టేటస్ కొత్త ట్రిక్.. టార్గెట్ కాంటాక్ట్ తప్పక చూడాలంటే ఇలా చేయండి

Toyota Car 2025: కొత్త టయోటా కరోల్లా క్రాస్ రాయల్ టచ్! ఇంత స్టైలిష్‌గా ఎప్పుడూ చూడలేదేమో

Infinix Note launched: ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ప్లస్ లాంచ్.. ఫాస్ట్ ఛార్జింగ్‌తో గ్రాండ్ ఎంట్రీ!

Oppo New Launch: 7000mAh బ్యాటరీ కెపాసిటీ.. ఒప్పో యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లు.. ధర కూడా!

Vivo New Launch: వావ్.. అనిపిస్తున్న వీవో ఫోన్.. ఫోటో లవర్స్ కోసం ప్రత్యేక ఫీచర్లు

OnePlus Phone: గేమింగ్‌కి బెస్ట్ ఆప్షన్.. ఆండ్రాయిడ్ 15 సపోర్ట్‌తో వన్‌ప్లస్ నార్డ్ 5 ఎంట్రీ

Big Stories

×