OG Collections:రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)తో ‘సాహో’ సినిమా చేసి డైరెక్షన్లో తన మార్క్ చూపించిన సుజీత్ (Sujeeth) తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ‘ఓజీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చినా.. సెప్టెంబర్ 24 రాత్రే ప్రీమియర్ షోలు పడడంతో ఈ సినిమాకి భారీ హైప్ వచ్చేసింది. అలా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్స్ అయినా.. ఒకసారి చూసే మూవీ అంటూ ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన యాక్షన్, మాస్ పెర్ఫార్మెన్స్ మూవీ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈ చిత్రానికి హైప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాను ప్రమోట్ చేశారు.
రూ.200 కోట్ల క్లబ్లో చేరిన ఓజీ..
దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయి.. అలా మొదటి రోజే భారీ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.200 కోట్లకు క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లోనే ఫస్ట్ టైం ఈ రికార్డ్స్ క్రియేట్ చేయడం అని చెప్పవచ్చు.. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా రెండు , మూడు రోజుల కలెక్షన్లు కలిపి మొత్తం రూ.210 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మరో సినిమా పోటీ లేకపోవడం.. పైగా దసరా పండుగ సెలవులు కావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కేవలం మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్.
ఓజీ సినిమా విశేషాలు..
ఓజీ సినిమా విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Imran Hashmi) ఇందులో ఓమీ అనే విలన్ పాత్ర పోషించారు. ఇక్కడ హీరో పాత్రతో సమానంగా పోటీ పడుతూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు ఇమ్రాన్ హష్మీ. అలాగే ఇందులో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటించారు. అర్జున్ దాస్, శుభలేఖ సుధాకర్, శ్రేయ రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అంతేకాదు ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సాయేషా కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఈ చిన్నారికి ఇదే మొదటి సినిమానే అయినా ఇందులో ఓజీకి కూతురిగా సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ పండిస్తూ అందరి మనసులు దోచుకుంది. అలా మొత్తానికైతే ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో దూసుకుపోతూ భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ అందరిని కలెక్షన్లతో అబ్బుర పరుస్తోంది.
పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాలు..
మరొకవైపు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే హరిహర వీరమల్లు 2 సినిమాతోపాటు OG 2 కూడా చేస్తున్నారు.