BigTV English

Bigg Boss 9 Promo: దసరా జాతర.. సందడి చేసిన మూవీ యూనిట్స్!

Bigg Boss 9 Promo: దసరా జాతర.. సందడి చేసిన మూవీ యూనిట్స్!

Bigg Boss 9 Promo: బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు సొంతం చేసుకున్న ఈ షోలో టాస్కులు, ఎమోషనల్, ప్రేమాయణం, కోపం లాంటివి మాత్రమే కాదు.. అప్పుడప్పుడు పండుగల సమయంలో చేసే సెలబ్రేషన్స్ కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే దేవీ నవరాత్రులు ప్రారంభం అయిపోయాయి. దేశవ్యాప్తంగా ప్రజలు దుర్గామాతను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు బిగ్ బాస్ హౌస్ లో కూడా దసరా సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి అని చెప్పవచ్చు.


బిగ్ బాస్ హౌస్ లో దసరా సంబరాలు..

అందులో భాగంగానే మూడవ వారానికి సంబంధించిన వీకెండ్ వచ్చేసింది. ఇందులో ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఈరోజు ఆదివారం కావడంతో కంటెస్టెంట్స్ ముందుకి రావడమే కాకుండా హౌస్ లో సెలబ్రేషన్స్ ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా తమ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హాజరయ్యి.. సందడి చేశారు. అందులో భాగంగానే తాజాగా 21వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ అందరూ సెలబ్రేషన్స్ లో భాగంగా చాలా అందంగా ముస్తాబయి అందరిని ఆకట్టుకున్నారు.

బిగ్ బాస్ 9 దసరా స్పెషల్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్..


ప్రోమో విషయానికి వస్తే హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. “ఈరోజు బిగ్ బాస్ లో దసరా స్పెషల్..హౌస్ లో అన్ని సరదాలు ఉంటాయి. దసరా పండుగ మీ ఇంట్లో.. జాతర బిగ్ బాస్ హౌస్ లో.. మరి జాతర మొదలు పెట్టేద్దామా?” అంటూ స్టార్ట్ చేశారు హోస్ట్ నాగార్జున. ఈ షోకి తాజాగా పలువురు సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వచ్చి సందడి చేశారు . అందులో భాగంగానే మొదట ‘తెలుసు కదా’ సినిమా యూనిట్ రాశిఖన్నా , సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష స్టేజ్ పైకి వచ్చారు. నాగార్జున మాట్లాడుతూ.. సిద్ధూ నీకొక జెన్యూన్ ప్రశ్న వేస్తున్నాను.. బాయ్ లానే ఉండిపోతావా జెంటిల్మెన్ అవ్వవా? అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత రాశీ ఖన్నాను పెళ్లి చేసుకోవాలంటే అతడిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అని నాగార్జున ప్రశ్నించగా.. రాశీ ఒక విజిల్ వేస్తుంది సర్..విజిల్ వేయగానే నవ్వడం మొదలు పెట్టాలి మళ్ళీ విజిల్ వేయగానే నవ్వడం ఆపాలి అలాంటి వ్యక్తి కావాలి అంటూ సిద్దు కామెంట్ చేశారు.

సందడి చేసిన సెలబ్రిటీస్..

ఆ తర్వాత దేత్తడి హారిక తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టవుతుంది.’కె ర్యాంప్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం తో పాటు హీరోయిన్ యుక్తి కూడా వచ్చేసింది. అలాగే కోర్ట్ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి తమ కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంలో విచ్చేశారు.. అలా పలువురు సందడి చేశారు. ప్రోమో ఎండింగ్లో రీతు ఏడ్చేసింది. ముందు హౌస్ లో వాళ్లను రెండు టీములుగా డివైడ్ చేసి పోటీ నిర్వహించగా.. ఇమ్మానుయేల్ టీం గెలుస్తుంది. దాంతో ఇమ్మానుయేల్ తో నాగార్జున మాట్లాడుతూ.. మీకు వచ్చిన బహుమతి మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అంటూ అడగగా.. రీతూ చౌదరి పేరు చెబుతారు.

ALSO READ:Puri – Sethupathi: వాయిదా పడ్డ పూరీ మూవీ టైటిల్ – టీజర్.. తొక్కిసలాటే కారణమా?

కన్నీళ్లు పెట్టుకున్న రీతూ చౌదరి..

నీకేం కావాలి అని అడిగితే ఆడియో మెసేజ్ వింటాను సార్ అంటుంది. ఆడియో మెసేజ్ లో “హలో అమ్ములు నేను ఇక్కడ బానే ఉన్నాను. నీ గేమ్ నీకోసమే ఆడుకో.. ఎవరికోసమో కాదు నువ్వు వెళ్ళింది” అంటూ వినిపించిన ఆ ఆడియో మెసేజ్ తో ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైపోయింది రీతూ చౌదరి. మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రేషన్స్ ఆకాశాన్ని తాకాయి అని చెప్పవచ్చు.

Related News

Bigg Boss 9: సంజన గల్రానీకు సుప్రీం కోర్ట్ నోటీసులు.. దిక్కుతోచని స్థితిలో కంటెస్టెంట్!

Bigg Boss 9 : ఫ్యూజ్ లు ఎగిరిపోయే వార్నింగ్ లు, సరికొత్త టాస్కులు, మరికొన్ని ట్విస్టులు 

Bigg Boss 9: కంటెస్టెంట్స్ కి రియల్ అగ్ని పరీక్ష.. సంజన కోసం ఇమ్మూ కెప్టెన్సీ, రీతూ జుట్టు.. తనూజ కాఫీ.. త్యాగం

Bigg Boss 9 : ఇది అసలైన రణరంగం,సుమన్ శెట్టి మీద ఒపీనియన్ పోతుంది

Bigg Boss 9: కొత్త కెప్టెన్ గా డిమాన్ పవన్, ఒక మెట్టు ఎక్కేసావయ్యా ఇమ్మానియేల్

Bigg Boss 9 Promo: అంత చీప్‌గా కనిపిస్తున్నానా.. ఇలాంటి మనిషితో ఉండలేం.. హరీష్‌, రాముని కడిగిపారేసిన సంజన!

Bigg Boss 9 Telugu: డబుల్‌ ఎలిమినేషన్‌ కాదు.. సింగిలే, మూడో వారం కామనర్‌ అవుట్‌!

Big Stories

×