IND VS PAK, Final: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025) నేపథ్యంలో ఇవాళ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా అలాగే పాకిస్తాన్ జట్లు రెండు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో… పాత రికార్డులు టీమిండియాను వనికిస్తున్నాయి. ఫైనల్ స్టేజి లో టీమిండియా.. తడబడే ప్రమాదం ఉన్నట్లు ఈ రికార్డులు చెబుతున్నాయి. మూడు జట్లు లేదా ఐదు జట్లు , ఇతర ఐసీసీ టోర్నమెంట్ లలో ఈ రెండు జట్లు ఫైనల్లో ఆడితే… అక్కడ ఎక్కువ శాతం పాకిస్తాన్ గెలిచింది. ఇలా మొత్తం రెండు జట్ల మధ్య 12 మ్యాచ్ లు జరిగితే.. ఇందులో పాకిస్తాన్ ఎనిమిది మ్యాచ్లో విజయం సాధిస్తే టీమిండియా కేవలం నాలుగు మ్యాచ్లో విక్టరీ కొట్టింది. అంటే ఫైనల్స్ వచ్చేసరికి టీమిండియా.. ఓడిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో టీమిండియా అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
Also Read: Abhishek- Gambhir: అభిషేక్ శర్మను బండబూతులు తిట్టిన గంభీర్..ఈ దెబ్బకు ఉరేసుకోవాల్సిందే
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య గతంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లు సూర్య కుమార్ యాదవ్ జట్టును వణికిస్తున్నాయి. రకరకాల సిరీస్ ల నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య… ఫైనల్ తరహాలో 12 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో పాకిస్తాన్ ఎనిమిది మ్యాచ్ లో విజయం సాధిస్తే టీమిండియా కేవలం నాలుగు మ్యాచ్ లలోనే విజయం సాధించడం గమనార్హం. 1985 సంవత్సరంలో బెన్సన్ అండ్ ఎడ్జెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ జరిగింది. ఇందులో ఫైనల్ మ్యాచ్ టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగితే.. టీమిండియానే విజయం సాధించింది. ఇక ఆస్టల్ వర్సెస్ ఆసియా కప్ టోర్నమెంట్ 1986లో జరిగింది. ఆ సమయంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ కూడా జరిగింది. ఇందులో పాకిస్తాన్ విజయం సాధించింది.
ఇలాంటి సిరీస్ 1994 లో కూడా అని నిర్వహించారు. ఇందులో కూడా ఫైనల్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ ఛాంపియన్ లో నిలిచింది. ఇక 2007 లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అప్పుడు టీమిండియా విజయం సాధించడం గమనార్హం. ఆ సమయంలో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా ఉన్నారు. అలాగే 2017 సంవత్సరంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఇందులో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఫైనల్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ గెలిచింది. ఇక ఇప్పుడు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఫైనల్ జరుగుతోంది. మరి ఇవాళ ఎవరు గెలుస్తారో చూడాలి.