Irfan Pathan On Kapil Dev: టీమిండియా స్టార్ క్రికెటర్లు నిత్యం గాయాల బారిన పడటంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కపిల్ దేవ్ లాంటివాళ్ళు అప్పట్లో ఒక్క గాయం లేకుండా ప్రతి మ్యాచ్ ఆడే వాళ్ళని, మంచి ఫిట్నెస్ మైంటైన్ చేసే వారంటూ గుర్తు చేశారు. గాయం కారణంగా కపిల్ దేవ్ ఒక్క మ్యాచ్ ఆడకుండా డగౌట్ లో కూర్చున్న సందర్భాలే లేవంటూ హాట్ కామెంట్స్ చేశారు. కానీ ప్రస్తుత క్రికెటర్లు ప్రతి ఒక్కడూ దద్దమ్మ లాగే తయారయ్యారని మండిపడ్డారు. ఒకటి లేదా రెండు మ్యాచ్ లు ఆడి గాయాల బారిన పడతారని… ఐపీఎల్ ప్రారంభం కాగానే ఐసీయూ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆడతారంటూ బాంబు పేల్చారు. ముఖ్యంగా బుమ్రా, హార్ధిక్ పాండ్యా తరచూ గాయాల బారీన పడటంపై ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ, ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ టీమిండియాను ఒకప్పుడు ఏలాడని ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేశారు. ఎలాంటి గాయాలు లేకుండా ప్రతి మ్యాచ్ లో ఆడినట్టు గుర్తు చేశారు. కానీ ప్రస్తుత క్రికెటర్లు బుమ్రా, హార్దిక్ పాండ్యా ఇలా చాలా మంది ఐపిఎల్ మోజుతో విపరీతమైన క్రికెట్ ఆడుతున్నారని… దాని వల్ల టీమిండియా పై ఫోకస్ చేయడం లేదని మండిపడ్డారు. అదే సమయంలో పదే పదే ఈ క్రికెటర్లు గాయాల బారిన పడుతున్నారని ఆగ్రహించారు. దీనివల్ల టీమిండియా కీలక మ్యాచ్ లలో ఓడిపోతూ వస్తోందని గుర్తు చేశారు.
ఇదే ప్లేయర్లు కాళ్లు విరిగిన కూడా ఐపీఎల్ ప్రారంభం కాగానే మళ్లీ పరిగెత్తుతున్నారని సీరియస్ అయ్యారు. కానీ అంతర్జాతీయ క్రికెట్ ఆడమంటే మాత్రం ఐసీయూలో జాయిన్ అవుతున్నట్టు చురకలు అంటించారు. ఇలాంటి క్రికెటర్ల పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు ఇర్ఫాన్ పఠాన్. ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో టీమిండియా దూసుకు వెళ్తుందని స్పష్టం చేశారు. అలాకాకుండా వీళ్లను బీసీసీఐ వదిలేస్తే మాత్రం టీమిండియా సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు.
2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే ఇలాంటి తప్పిదాలను కచ్చితంగా గుర్తించి.. వాటి నుంచి బయటపడాలన్నారు. బుమ్రా అలాగే హార్దిక్ పాండ్యా ఇద్దరు తోపు క్రికెటర్లు అంటూ ప్రసంతించారు. వీళ్ళిద్దరూ గాయాల బారిన పడుతూ ఉంటున్న నేపథ్యంలో టీమిండియా పదే పదే ఇబ్బంది పడుతోందని తెలిపారు. మొన్న బుమ్రా లేకపోవడంతో వెస్టిండీస్ తో జరిగిన టి20 సిరీస్ సమం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. అలాగే ప్రతి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా లోటు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.