E-Paper
Advertisement

Tirupati DMart fraud: కేజీ పప్పుకు రూ.2899 బిల్లేసిన డిమార్ట్.. ఎఫ్‌సీఐ మాజీ సభ్యుడికి చేదు అనుభవం

Tirupati DMart fraud: కేజీ పప్పుకు రూ.2899 బిల్లేసిన డిమార్ట్.. ఎఫ్‌సీఐ మాజీ సభ్యుడికి చేదు అనుభవం
Advertisement

Tirupati DMart fraud: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని ప్రముఖ రిటైల్ స్టోర్ డిమార్ట్ (DMart)లో వినియోగదారులను నిలువునా ముంచేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఎఫ్‌సీఐ (FCI) మాజీ సభ్యుడు, ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న మించల ప్రదీప్ ఈ మోసాన్ని బయటపెట్టారు. ఆయన డిమార్ట్ స్టోర్‌లో 1.2 కిలోల ఉద్దుపప్పు (మినపప్పు) కొనుగోలు చేయగా.. బిల్లులో దాని ధర చూసి షాక్‌కు గురయ్యారు. సాధారణంగా వందల్లో ఉండాల్సిన పప్పు ధరను ఏకంగా రూ. 2,899గా వేయడంతో ఆయన యాజమాన్యాన్ని నిలదీశారు.

ప్రదీప్ వెంటనే స్టోర్ నిర్వాహకుల వద్దకు వెళ్లి ఈ దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. అది కేవలం సాంకేతిక పొరపాటు అంటూ వారు నీళ్లు నమిలారు. అయితే సామాన్య ప్రజలు బిల్లులను సరిచూసుకోరనే ఉద్దేశంతోనే ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ (JC), లీగల్ మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు నమ్ముకుని వచ్చే చోట ఇలాంటి అక్రమాలు జరగడం దారుణమని ఆయన పేర్కొన్నారు.

Advertisement

ఈ సందర్భంగా మించల ప్రదీప్ తన రాయలసీమ యాసలో తన ఆవేదనను వ్యక్తం చేశారు: “డిమార్ట్ లో ఇదొక మా బిల్లు.. కేవలం ఉద్దుపప్పు అంటారు, మా రాయలసీమ భాషలో ఉద్దుపప్పు అంటారు.. ఆ ఉద్దుపప్పు ఒక కేజీకి 2,800 నుండి 2,900 రూపాయలు వేసినారు. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇదే విధంగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, ఎంతో మంది నిరుద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, దేవస్థానానికి సంబంధించిన ఉద్యోగులందరూ ఇక్కడికి వచ్చి సరుకులు కొనుక్కుంటారు. ఈ విధంగా మోసాలకు పాల్పడటం ఎంతవరకు న్యాయం? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడే లీగల్ అండ్ మెట్రాలజీ ఆఫీసర్‌కు ఫోన్ చేశాను.. జాయింట్ కలెక్టర్ గారి మీటింగ్ లో ఉండటం వల్ల ఫోన్ బిజీగా వస్తోంది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. నేను నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ మెంబర్‌గా ఉన్నాను.. మోసపూర్వతంగా నాకే అన్యాయం జరిగితే నేను ఊరుకునేది లేదు. సమాజంలో నాకు జరిగినట్టే ఎంతో మందికి జరుగుతుంటుంది. దీన్ని ప్రశ్నిస్తున్నాను, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి.” అని డిమాండ్ చేశారు.

Advertisement

Read Also: Illegal Mining: అనుమతులు లేని గనుల్లో దర్జాగా విద్యుత్ వాడకం.. అధికారుల నిఘా శూన్యం..!

Related News

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Big Stories

Advertisement
×