E-Paper
Advertisement

Upcoming Laptops April 2026: అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌ను షేక్ చేయనున్న ‘బడ్జెట్ బీస్ట్’ ల్యాప్‌టాప్స్ ఇవే!

Upcoming Laptops April 2026: అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌ను షేక్ చేయనున్న ‘బడ్జెట్ బీస్ట్’ ల్యాప్‌టాప్స్ ఇవే!
Advertisement

Upcoming Laptops April 2026: అత్యాధునిక ఫీచర్లు, పవర్‌ఫుల్ బ్యాటరీ కలిగిన బెస్ట్ ల్యాప్‌టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. మీకో గుడ్ న్యూస్. త్వరలోనే టాప్ బ్రాండ్ల ల్యాప్‌టాప్స్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఇవి హై స్పీడ్‌ మాత్రమే కాకుండా.. ఏఐ ఫీచర్లు, భారీ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2026లో మార్కెట్‌ను షేక్ చేయనున్న ఈ టాప్-5 ల్యాప్‌టాప్స్ ఏవో చూద్దాం..

Apple MacBook Air M4 Series

యాపిల్ నుంచి వచ్చే ల్యాప్‌టాప్‌ల కోసం ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. త్వరలో అందుబాటులోకి రాబోతున్న కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌లో M4 చిప్‌ను వాడుతున్నారు. ఇది చూడటానికి పాత మోడల్‌లాగే అనిపించినా, లోపల మాత్రం పవర్‌ఫుల్ ఇంజిన్ ఉంటుంది. ముఖ్యంగా గ్రాఫిక్ డిజైనింగ్ చేసేవారికి, వీడియో ఎడిటర్లకు బెస్ట్ ఆప్షన్. ఛార్జింగ్ పెట్టిన తర్వాత రోజంతా వాడినా ఇంకా బ్యాటరీ మిగిలే ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. స్లిమ్ బాడీ, లైట్ వెయిట్ కావాలనుకునే ఇది బాగా నచ్చుతుంది. ఈ మ్యాక్‌బుక్ ఎయిర్‌లో M4 ధర సుమారు రూ.99,900 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Dell XPS 14 (Updated Version)

Advertisement

విండోస్ ల్యాప్‌టాపుల్లో Dell XPS సిరీస్ ఎప్పుడూ ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంటుంది. అప్డేటెడ్ వెర్షన్‌లో బెజెల్స్ లేని డిస్‌ప్లేను మరింత మెరుగుపరిచారు. అంటే.. స్క్రీన్ అంచులే కనిపించవు.. మొత్తం డిస్‌ప్లేనే ఉంటుంది. దీనిలో వాడే కీబోర్డ్ టైప్ చేయడానికి చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఆఫీస్ వర్క్ కోసం స్టైలిష్‌గా, స్ట్రాంగ్‌గా ఉండే ల్యాప్‌టాప్ కావాలనుకుంటే ఈ డెల్ ఎక్స్‌పీఎస్‌ను తీసుకోవచ్చు. దీని ధర దాదాపు రూ.1,64,900 వరకు ఉండవచ్చు.

Also Read: వావ్, రూ.వెయ్యి లోపు ‘ఫీచర్ ఫోన్లు’ చూశారా? UPI పేమెంట్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు!

HP Spectre x360 (2026 Edition)

Advertisement

ల్యాప్‌టాప్‌ను ట్యాబ్లెట్‌లా కూడా వాడుకోవాలి అనుకుంటే.. హెచ్‌పీ స్పెక్టర్ x360ని ఒకసారి పరిశీలించవచ్చు. ఇది 360 డిగ్రీలు తిరుగుతుంది కాబట్టి.. సినిమా చూసేటప్పుడు, డ్రాయింగ్ వేసేటప్పుడు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. కొత్త మోడల్‌లో OLED స్క్రీన్ నాణ్యతను పెంచారు. దీంతో కలర్స్ చాలా నేచురల్‌గా కనిపిస్తాయి. స్టూడెంట్స్, ప్రెజెంటేషన్లు ఇచ్చే ప్రొఫెషనల్స్ ఈ ల్యాప్‌టాప్ బెస్ట్ అని చెప్పొచ్చు. దీని ప్రారంభ ధర రూ. 1,45,000 గా ఉండే అవకాశం ఉంది.

Lenovo Yoga Slim 7i (AI Powered)

లెనోవో ఈసారి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఫోకస్ పెట్టింది. ఈ ల్యాప్‌టాప్ మన పని తీరును బట్టి బ్యాటరీని అడ్జస్ట్ చేసుకుంటుంది. మనం గేమ్ ఆడుతుంటే పవర్ పెంచుతుంది. చిన్న చిన్న పనులు చేస్తుంటే బ్యాటరీని ఆదా చేస్తుంది. ఇక కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండేలా కొత్త రకమైన యాంటీ‌గ్లేర్ టెక్నాలజీని దీనిలో ప్రవేశపెడుతున్నారు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఆశించే వారికి లెనోవో ఎప్పుడూ మంచి ఆప్షనే. దీని ధర సుమారు రూ.94,949 నుంచి ప్రారంభం కావచ్చు.

ASUS ROG Zephyrus G14

గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి ఏసస్ తమ జెఫైరస్ G14 మోడల్‌ను కొత్త హంగులతో తీసుకొస్తోంది. గేమింగ్ ల్యాప్‌టాప్‌లు అంటే బరువుగా ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ, ఇది చాలా తేలికగా ఉంటుంది. రాబోతున్న ఈ సరికొత్త మోడల్‌లో హీటింగ్ సమస్య రాకుండా కొత్త కూలింగ్ సిస్టమ్ పెట్టారు. దీంతో ఎంతసేపు గేమ్స్ ఆడినా ల్యాప్‌టాప్ వేడెక్కదు. అటు గేమింగ్‌కు, ఇటు ఆఫీస్ వర్క్‌కు రెండింటికీ ఇది సెట్ అవుతుంది. దీని ధర దాదాపు రూ.2,39,990 రేంజ్‌లో ఉండబోతోంది.

Also Read: అమ్మో, రోజుకు లక్షల టన్నులా.. ఈ దేశం మొత్తం చేపలు తిని బతికేస్తున్నారు బ్రో!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Tags

Related News

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Big Stories

Advertisement
×