E-Paper
Advertisement

వినాయకుడి నిమజ్జనమే కాదు.. ఆగమనమూ రచ్చే! తెలంగాణలో వైరల్ అవుతున్న కొత్త ట్రెండ్!

వినాయకుడి నిమజ్జనమే కాదు.. ఆగమనమూ రచ్చే! తెలంగాణలో వైరల్ అవుతున్న కొత్త ట్రెండ్!
Advertisement

Ganapati Aagaman Trend: వినాయక చవితి వచ్చిందంటే తెలంగాణలో సందడి మామూలుగా ఉండదు. ప్రతి వీధిలో గణపతి మండపాలు, అలంకరణలు, భక్తి గీతాలతో మార్మోగుతుంది. అయితే, ఈసారి హైదరాబాద్‌ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. అదే ‘గణపతి ఆగమన్’. వినాయకుడిని మండపానికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా ఒక వేడుకలా నిర్వహించడం ఇప్పుడు యువతలో బాగా క్రేజ్ తెచ్చుకుంటోంది.

గతంలో ఎలా ఉండేదంటే..

కొన్నేళ్ల క్రితం వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసిన తర్వాత పెద్దగా హంగామా లేకుండానే మండపానికి తీసుకెళ్లేవారు. విగ్రహానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాహనంపై జాగ్రత్తగా ఏర్పాటు చేసేవారు. కొన్ని ప్రాంతాల్లో గణపతి ముఖం కనిపించకుండా వస్త్రాలు లేదంటే కవర్లతో కప్పి తీసుకెళ్లడం కూడా కనిపించేది. అంటే వినాయకుడి మండప ప్రవేశం కంటే నిమజ్జన కార్యక్రమానికే ఎక్కువ సందడి ఉండేది. బ్యాండ్ మేళాలు, డీజేలు, డ్యాన్సులతో నిమజ్జన ఊరేగింపు ఘనంగా సాగేది.

ఇప్పుడు ఆగమనమే ఓ వేడుక!

Advertisement

కాలం మారింది. సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. దీంతో గణపతిని మండపానికి తీసుకురావడాన్నే ఓ ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. విగ్రహాన్ని కొనుగోలు కేంద్రం నుంచి వాహనంపైకి ఎక్కించిన వెంటనే అసలు సందడి మొదలవుతోంది. బ్యాండ్ మేళాలు, డీజే చప్పుళ్లు, డప్పుల మోతతో యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నారు. తీన్మార్ స్టెప్పులతో రోడ్లపై సందడి చేస్తున్నారు. గణపతి విగ్రహం ముందు యువకులు, వెనుక భక్తులు.. ఊరేగింపుగా మండపం వరకు తీసుకెళ్తున్నారు.

జిల్లాలకూ విస్తరిస్తున్న ట్రెండ్

హైదరాబాద్‌లో మొదలైన ఈ ‘గణపతి ఆగమన్’ ట్రెండ్ ఇప్పుడు క్రమంగా జిల్లాలకూ విస్తరిస్తోంది. నగరాల్లో కనిపించే తరహాలోనే గ్రామాలు, పట్టణాల్లోనూ యువత ప్రత్యేకంగా ఆగమన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. కొన్ని చోట్ల డీజేలు, మరికొన్ని ప్రాంతాల్లో బ్యాండ్ మేళాలు, డప్పులతో గణపతికి ఘన స్వాగతం పలుకుతున్నారు. దీంతో విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్లే కార్యక్రమం కూడా పండుగలో మరో ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది.

నిమజ్జనానికి ఏమాత్రం తగ్గని సందడి!

Advertisement

గతంలో వినాయక నిమజ్జనం సమయంలో మాత్రమే కనిపించే ఉత్సాహం ఇప్పుడు ఆగమన సమయంలోనూ కనిపిస్తోంది. గణపతి మండపానికి చేరుకునే సమయానికి యువతలో ఉత్సాహం తారాస్థాయికి చేరుతోంది. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఆగమన కార్యక్రమాన్ని సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్‌లో మొదలైన ‘గణపతి ఆగమన్’ ఇప్పుడు తెలంగాణలో కొత్త ట్రెండ్‌గా మారుతోంది. వినాయకుడిని మండపానికి తీసుకురావడం కూడా ఓ వేడుకగా మారడంతో గణేష్ ఉత్సవాల సందడి మరింత పెరుగుతోంది.

Read Also: గాల్లో తేలే పుస్తకాలు.. చుట్టూ అద్దాల మాయ.. ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఫ్యూచరిస్టిక్ లైబ్రరీ!

Tags

Related News

తీరొక్క గణనాథులకు కేరాఫ్.. ధూల్ పేట్ లో అడుగు పెడితే ధూమ్ ధామే!

11 రాష్ట్రాలు.. 4,000 కిలో మీటర్లు.. దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇదే!

భారీ వర్షాలకు దెబ్బతిన్న ట్రాక్.. రైళ్ల రాకపోకలకు బ్రేక్!

రైళ్లలో ఇక చెత్తబుట్టలు నిండిపోవు.. ఇండియన్ రైల్వే సూపర్ ప్లాన్!

వర్షాల దెబ్బకు కుంగిన రైల్వే ట్రాక్.. ఏకంగా 14 ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. గుంటూరు, తిరుపతి సహా 8 రైళ్ల టైమింగ్స్ ఛేంజ్!

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

Big Stories

Advertisement
×