E-Paper
Advertisement

టీవీ అంటే ఇలా ఉండాల్రా బాబూ.. 115 ఇంచుల భారీ స్క్రీన్‌తో Samsung Micro RGB లాంచ్!

టీవీ అంటే ఇలా ఉండాల్రా బాబూ.. 115 ఇంచుల భారీ స్క్రీన్‌తో Samsung Micro RGB లాంచ్!
Advertisement

Samsung Micro RGB TV: టెక్ దిగ్గజం శాంసంగ్ 2026 మైక్రో ఆర్జీబీ టీవీ లైనప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో R95H, R85H అనే రెండు కొత్త సిరీస్‌లను లాంచ్ చేసింది. చిన్న గది అయినా, పెద్ద హాల్ అయినా సరే.. అన్ని రకాలుగా సెట్ అయ్యేలా 55 అంగుళాల నుంచి 115 అంగుళాల వరకు భారీ సైజుల్లో ఈ టీవీలు అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి.. టీవీ చూసే పద్ధతినే ఈ సరికొత్త శాంసంగ్ టీవీలు మార్చేయబోతున్నాయని చెప్పవచ్చు.

కట్టిపడేసే విజువల్స్..

సాధారణంగా టీవీల్లో వెనక నుంచి వచ్చే లైటింగ్ వల్ల రంగులు ఒక్కోసారి వెలవెలబోతుంటాయి. కానీ ఈ మైక్రో ఆర్జీబీ టీవీల్లో ఆ సమస్య ఉండదు. దీనిలో వేల సంఖ్యలో ఉండే చిన్న చిన్న ఎల్ఈడీలు వాటంతట అవే వెలుగుతూ కలర్స్‌ను చాలా నేచురల్‌గా చూపిస్తాయి. ముఖ్యంగా R95H మోడల్‌లో గదిలో లైట్లు ఎక్కువగా ఉన్నా కూడా స్క్రీన్ పైన ప్రతిబింబాలు పడవు. దీంతో పట్టపగలు కూడా కిటికీలు తీసి దర్జాగా సినిమా చూసేయొచ్చన్నమాట.

Advertisement

Also Read: రూ.30 వేల బడ్జెట్‌లో అదిరిపోయే గేమింగ్ ఫోన్.. Vivo T5 Pro 5G పూర్తి వివరాలు మీ కోసం!

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ..

ఈ టీవీల్లో శాంసంగ్ ఒక పవర్‌ఫుల్ ఏఐ ఇంజిన్‌ను అమర్చింది. ఇది మనం చూసే సీన్లను బట్టి క్లారిటీని, కలర్స్‌ను దానంతట అదే అడ్జస్ట్ చేస్తుంది. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా లేదంటే ఏదైనా యాక్షన్ మూవీ చూస్తున్నా.. బొమ్మ ఎక్కడా బ్లర్ అవ్వకుండా చాలా స్మూత్‌గా కనిపిస్తుంది. పాత కాలపు సినిమాలు చూసినా సరే, వాటికి కొత్త మెరుగులు దిద్ది మరీ మన ముందు ఉంచుతుంది ఈ టెక్నాలజీ.

ఆడియో అదిరిపోద్ది..

Advertisement

గేమ్స్ ఎక్కవగా ఆడేవారికి ఈ టీవీలు బాగా నచ్చుతాయి. ఇందులో ఉండే హై రిఫ్రెష్ రేట్ వల్ల గేమ్స్ ఆడుతున్నప్పుడు ఏమాత్రం లాగ్ లేకుండా స్పీడ్‌గా ఉంటుంది. ఇక సౌండ్ గురించి చెప్పక్కర్లేదు.. స్క్రీన్ మీద యాక్షన్ ఎటువైపు జరుగుతుంటే.. శబ్దం కూడా అటు నుంచే వస్తున్నట్టు అనిపిస్తుంది. సరౌండ్ సౌండ్ సిస్టమ్ సపోర్ట్‌తో ఇంట్లోనే సినిమా థియేటర్‌లో కూర్చున్న ఫీలింగ్ వచ్చేస్తుంది.

ధర వివరాలు ఇలా..

సాఫ్ట్‌వేర్ విషయంలో శాంసంగ్ మంచి హామీ ఇచ్చింది. ఈ టీవీలకు ఏకంగా ఏడేళ్ల పాటు అప్‌డేట్స్ ఇస్తామని చెప్పింది. అంటే.. ఈ టీవీని ఒక్కసారి కొంటే చాలాకాలం పాటు కొత్త టీవీలాగే వాడుకోవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే.. 55 అంగుళాల మోడల్ సుమారు రూ.1.33 లక్షల నుంచి మొదలవుతుంది. భారీ సైజులో ఉండే 115 అంగుళాల టీవీ కావాలంటే మాత్రం దాదాపు రూ.25 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Also Read: హువావే నుంచి కళ్లుచెదిరే లగ్జరీ వాచ్ లాంచ్.. స్మార్ట్‌వాచ్ అంటే ఇలా కూడా ఉంటుందా?

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×