Big Stories

Motorola Edge 50 Ultra Launched : మోటో నుంచి సరికొత్త ఫోన్.. ఇది కొంటే కెమెరా అక్కర్లేదు!

Motorola Edge 50 Ultra Launched : Motorola ఇటీవల తన వినియోగదారుల కోసం ప్రపంచవ్యాప్తంగా Edge 50 Ultra స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో అతి త్వరలో ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్లోకి కూడా రాబోతుంది. ఈ Motorola ఫోన్ ఇప్పుడు BIS వెబ్‌సైట్‌లో గుర్తించబడింది. మోటరోలా కొత్త ఫోన్ యూరోపియన్ మోడల్ వంటి స్పెసిఫికేషన్లతో దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

- Advertisement -

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్‌లో డివైజ్ కనిపించడం వల్ల కంపెనీ తన భారతీయ కస్టమర్ల కోసం అతి త్వరలో ఈ ఫోన్‌ను తీసుకురాబోతున్నట్లు స్పష్టంగా అర్థం. మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్  మోడల్ నంబర్ XT2401-1తో గుర్తించబడింది. అయితే సర్టిఫికేషన్‌తో పాటు ఈ కొత్త ఫోన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఇప్పటి వరకు కొన్ని ఫీచర్లు వెల్లడయ్యాయి.

- Advertisement -

Also Read : వివో నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు.. రూ.439 లకే దక్కించుకునే ఛాన్స్!

ఇక మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే యూరోపియన్ మోడల్‌‌ మాదిరిగానే ఇండియన్ మోడల్‌ను స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌తో తీసుకురావచ్చు. ఈ మోటరోలా ఫోన్‌ను 6.67 అంగుళాల కర్వ్డ్ పోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది 2712 x 1220 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో తీసుకురావచ్చు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ ఫోన్‌కు ఉంటుంది.

ఫోన్‌ను గరిష్టంగా 16GB RAM + 1TB వరకు 4.0 స్టోరేజ్‌తో తీసుకురావచ్చు. కెమెరా ఆప్టిక్స్ గురించి మాట్లాడితే ఈ Motorola ఫోన్‌ను 50MP మెయిన్ కెమెరా సెన్సార్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్, OIS సపోర్ట్‌తో 64MP టెలిఫోటో కెమెరాతో తీసుకురావచ్చు. పవర్ కోసం ఫోన్‌లో 4500mAh బ్యాటరీ, 125W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో కంపెనీ Motorola Edge 50 Ultra స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది.

Also Read : ఈ ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు భయ్యా.. టాప్ సెల్లింగ్ ఫోన్‌ను చీప్‌గా కొనేయండి..!

ది టెక్ అవుట్‌లుక్ ప్రకారం డిస్‌ప్లే HDR10+కి సపోర్ట్ ఇస్తుంది. ఇన్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఇది Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌‌పై రన్ అవుతుంది.  ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే,ఇది Android 14-ఆధారిత హలో UIని కలిగి ఉంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం మార్కెట్‌లో చూస్తున్నట్లయితే Motorola Edge 50 Ultraని మంచి ఫీచర్లతో దక్కించుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News