Big Stories

Nirmal Janajatara Sabha : రాజ్యాంగం మారితే జరిగేది అదే : నిర్మల్ సభలో రాహుల్ గాంధీ

Rahul Speech Nirmal Janajatara Sabha : కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని మారుస్తామని చెబుతోందని, అదే జరిగితే అన్ని రిజర్వేషన్లు రద్దవుతాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నిర్మల్ లో జరిగిన జనజాతర సభకు హాజరైన రాహుల్ మాట్లాడుతూ.. బీజేపీ గెలిస్తే రాజయాంగాన్నే నిర్వీర్యం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షించాలని కృషి చేస్తుందని తెలిపారు.

- Advertisement -

బీజేపీ కేవలం దేశంలో ఉన్న ధనికుల కోసం పనిచేస్తుందని ఆరోపించారు. ఇప్పటివరకూ సంపన్నులు బ్యాంకుల నుంచి తీసుకున్న 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను బీజేపీ మాఫీ చేసిందని దుయ్యబట్టారు. అదే మాఫీ చేసిన డబ్బుతో దేశంలోని పేదలు ఒక్కొక్కరికి 25 వేల రూపాయలను ఇస్తే.. ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారన్నారు. కాంగ్రెస్ రుణమాఫీలు చేసి, ఉపాధిహామీ ఇస్తే ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నామని దూషించే బీజేపీ.. సంపన్నులకు దోచిపెట్టిన సొమ్ము గురించి మాత్రం ప్రశ్నిస్తే మాట్లాడదన్నారు.

- Advertisement -

Also Read : కవిత ఏమైనా దేశం కోసం జైలుకు వెళ్లిందా..? : తమిళి సై

అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు హామీలను తెలంగాణలో అమలు చేస్తున్నామన్న రాహుల్.. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామన్నారు. ఒక్కో పేద కుటుంబం బ్యాంక్ అకౌంట్ లో ప్రతిఏటా లక్ష రూపాయలను జమ చేస్తామని తెలిపారు. మోదీ సర్కార్ యువకులను నిరుద్యోగులుగా మార్చిందని విమర్శించారు. యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి.. ఉపాధిని చూపిస్తామని, శిక్షణ సమయంలో 8500 భృతి అందజేస్తామని తెలిపారు. అలాగే 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. గత సర్కార్ ఆదివాసీలను సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. కులగణనతో ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు.

 

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News