E-Paper
Advertisement

రూ.7 కోట్ల బంగారు శవపేటికలో అంత్యక్రియలు.. ఆశ్చర్యపోతున్న ప్రపంచం!

రూ.7 కోట్ల బంగారు శవపేటికలో అంత్యక్రియలు.. ఆశ్చర్యపోతున్న ప్రపంచం!
Advertisement

Rs 7 Crore Gold Coffin: విలాసవంతమైన జీవితం.. సోషల్ మీడియాలో భారీగా అభిమానులు.. ఖరీదైన ఇల్లు, ఆస్తులు.. చివరికి కోట్ల రూపాయల విలువైన బంగారు శవపేటికలో అంత్యక్రియలు. బ్రిటిష్-నైజీరియన్ వ్యాపారవేత్త, సామాజిక మాధ్యమాల ప్రముఖుడు ఇఘో టైనీ  ఉబిరిబో మరణం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 43 ఏళ్ల ఉబిరిబో 2026 మార్చి 6న థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో కన్నుమూశారు. ఆయన కాస్మెటిక్ ట్రీట్‌మెంట్ చేయించుకున్న అనంతరం తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. చివరకు ఊపిరితిత్తుల్లో రక్తనాళం మూసుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.

బ్యాంకాక్‌లో కాస్మెటిక్ ట్రీట్‌మెంట్

ఉబిరిబో తన భార్య డానియెల్ సింబా అలెన్‌తో కలిసి థాయ్‌లాండ్‌కు వెళ్లారు. మార్చి 5న బ్యాంకాక్‌లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో జననాంగ పరిమాణం పెంచేందుకు స్పెషల్ కాస్మెటిక్ ట్రీట్‌మెంట్ చేయించుకున్నారు. ఈ ప్రక్రియలో సుమారు 40 మిల్లీలీటర్ల హయాలురోనిక్ యాసిడ్ అనే పదార్థాన్ని స్థానిక మత్తు మందుతో కలిపి ఉపయోగించారు.  చికిత్స పూర్తయిన తర్వాత దంపతులు మర్దన చేయించుకునేందుకు వెళ్లారు. అక్కడే ఉబిరిబోకు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చింది. కొద్దిసేపటికే ఆయన రెండుసార్లు స్పృహ కోల్పోయారు.

Advertisement

వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. మొదట వైద్యానికి స్పందించినప్పటికీ పరిస్థితి వేగంగా విషమించింది. పరీక్షలు నిర్వహించేలోపే మరోసారి స్పృహ కోల్పోయారు. వైద్యులు ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళంలో అడ్డంకి ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో ఆయనను అత్యవసర చికిత్స విభాగానికి తరలించి ప్రాణాలను కాపాడేందుకు వంద నిమిషాలకు పైగా గుండెకు సంబంధించిన ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉబిరిబో మృతి చెందారు.

మరణం తర్వాత బ్రిటన్‌లో నిర్వహించిన శవపరీక్షలో కీలక విషయం బయటపడింది. ఉబిరిబో ఊపిరితిత్తుల్లో కనిపించిన కొన్ని పదార్థాలు చికిత్స సమయంలో ఉపయోగించిన హయాలురోనిక్ యాసిడ్‌తో సరిపోలినట్లు నిపుణులు గుర్తించారు. ఆ పదార్థం రక్తప్రవాహంలోకి చేరి ఊపిరితిత్తుల రక్తనాళాల్లో అడ్డంకి కలిగించినట్లు విచారణలో తేలింది. థాయ్‌లాండ్‌లో నిర్వహించిన శవపరీక్ష వివరాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఈ ఘటనపై లండన్‌లోని ఇన్నర్ వెస్ట్ లండన్ కరోనర్ కోర్టులో విచారణ జరిగింది. కరోనర్ జీన్ హార్కిన్.. కాస్మెటిక్ ట్రీట్‌మెంట్ అనంతరం ఏర్పడిన ఊపిరితిత్తుల రక్తనాళ అడ్డంకి కారణంగానే ఉబిరిబో మరణించినట్లు నిర్ధారించారు.

కోట్ల విలువైన బంగారు శవపేటిక

Advertisement

ఉబిరిబో సోషల్ మీడియాలో ‘టైనీ’, ‘డెనిసీ’, ‘ఈగో’ పేర్లతో కూడా గుర్తింపు పొందారు. ఆయనకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. లగ్జరీ లైఫ్ స్టైల్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు లండన్, అమెరికాలో విలువైన ఆస్తులు ఉన్నాయి. లండన్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపయోగించిన బంగారు శవపేటిక అందరి దృష్టినీ ఆకర్షించింది. దాని విలువ 7 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

కాస్మెటిక్ ట్రీట్‌మెంట్ పై తీవ్ర చర్చ

ఈ ఘటనతో జననాంగ పరిమాణం పెంచేందుకు చేసే కాస్మెటిక్ ట్రీట్‌మెంట్ పై మరోసారి చర్చ మొదలైంది. ఇలాంటి ప్రక్రియల్లో వాపు, ఇన్ఫెక్షన్, మచ్చలు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also: అడవిలో దాగిన 1,500 ఏళ్ల అద్భుతం.. తెలంగాణ ఆంగ్‌కోర్ వాట్ ఆలయం గురించి మీకు తెలుసా?

Tags

Related News

అడవిలో పారేసిన 12 టన్నుల నారింజ వ్యర్థాలు.. 15 ఏళ్ల తర్వాత జరిగింది చూసి.. యావత్ ప్రపంచమే షాక్!

చిన్న తెగ నుంచి IAS వరకు.. దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే!

నేషనల్ లెవెల్ లో సత్తా చాటిన నల్లగొండ, ఏకంగా సెకెండ్ ప్లేస్ కైవసం!

నాగార్జునసాగర్ లో రంగు మారుతున్న నీళ్లు, అసలేం జరుగుతోంది?

ఎయిర్‌పోర్ట్‌కు లగేజ్ తీసుకెళ్లడం ఇక అవసరం లేదు.. ఇంటి వద్దనే చెక్ ఇన్ సర్వీస్

మ్యూజియంలో ఉండాల్సిన ట్రైన్ మళ్లీ పట్టాలపైకి.. 63 ఏళ్ల ఈ రైలుకు ఇప్పటికీ ఇంత డిమాండా?

ప్రపంచంలోనే అత్యంత సన్నని ఇల్లు.. లోపల సౌకర్యాలు చూస్తే షాకవ్వాల్సిందే?

Big Stories

Advertisement
×