E-Paper
Advertisement

Motorola Signature: 16GB ర్యామ్, 50MP 4 క్యామెరాలు.. మోటోరోలా మిలిటరీ గ్రేడ్ ఫోన్ లాంచ్

Motorola Signature: 16GB ర్యామ్, 50MP 4 క్యామెరాలు.. మోటోరోలా మిలిటరీ గ్రేడ్ ఫోన్ లాంచ్
Advertisement

Motorola Signature| మోటోరోలా తన అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోటోరోలా సిగ్నేచర్‌ను గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ టాప్ లెవెల్ ఫీచర్లను ఒకే పవర్‌ఫుల్ డివైస్‌లో కలిపింది. ప్రీమియం సెగ్మెంట్‌లో మళ్లీ టాప్ పొజిషన్ సాధించాలని మోటోరోలా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫోన్ భారతదేశంలో ఈరోజు జనవరి 7, 2026న లాంచ్ అవుతుంది. లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.

ఏడు సంవత్సరాల అప్‌డేట్స్‌తో కొత్త బెంచ్‌మార్క్ సెట్

మోటోరోలా సిగ్నేచర్ ఏడు సంవత్సరాల ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తుంది. ఇది మోటోరోలా చరిత్రలో అత్యధిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్. లాంగ్ టర్మ్ అప్‌డేట్స్ వల్ల మంచి సెక్యూరిటీ, స్మూత్ పర్‌ఫామెన్స్ లభిస్తాయి. ఈ అడ్వాన్స్ ఫీచర్లతో ఈ ఫోన్ ఫ్యూచర్-రెడీ రిలయబుల్ చేస్తుంది.

మోటోరోలా సిగ్నేచర్ ధర, అందుబాటు

Advertisement

గ్లోబల్‌గా ఒకే వేరియంట్‌లో లభిస్తుంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఉంది.ర్యామ్ మరో 4GB పెంచుకోవచ్చు.  గ్లోబల్ ధర యూరో 899.99, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.82,000. పాంటోన్ కార్బన్, పాంటోన్ మార్టినీ ఆలివ్ కలర్స్‌లో వస్తుంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో లాంచ్ అయింది. ఇండియాలో ధర వివరాలు త్వరలో తెలుస్తాయి.

పెద్ద AMOLED డిస్‌ప్లే ప్రీమియం ప్రొటెక్షన్‌తో ఎలా

మోటోరోలా సిగ్నేచర్‌లో 6.8 అంగుళాల సూపర్ HD LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1,264 x 2,780 పిక్సెల్స్. 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్, HDR10+ వీడియో, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తాయి. రంగులు బ్రైట్‌గా, షార్ప్‌గా, సినిమాటిక్‌గా కనిపిస్తాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంది.

ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, పవర్‌ఫుల్ మెమరీ

Advertisement

ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ ఉంది. 3nm టెక్నాలజీతో ఎక్సలెంట్ స్పీడ్, పవర్ ఎఫిషియెన్సీ ఇస్తుంది. 16GB LPDDR5X ర్యామ్‌తో మల్టీటాస్కింగ్ స్మూత్. 512GB UFS 4.1 స్టోరేజ్ ఫాస్ట్ డేటా యాక్సెస్ ఇస్తుంది. హెవీ యాప్స్, గేమ్స్ ల్యాగ్ లేకుండా నడుస్తాయి.

Also Read: ఏఐతో డబ్బు సంపాదించడం ఎలా? సింపుల్ టిప్స్ ఇవిగో

ప్రొఫెషనల్స్‌ కోసం క్వాడ్ 50MP కెమెరా సెటప్

మోటోరోలా సిగ్నేచర్‌లో పవర్‌ఫుల్ క్వాడ్ కెమెరా సిస్టమ్ ఉంది. 50MP సోనీ LYTIA 828 మెయిన్ సెన్సార్ ఉంది. 50MP అల్ట్రా-వైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్) ఉన్నాయి. సెల్ఫీలకు 50MP ఫ్రంట్ కెమెరా. 8K HDR వీడియోలు సులభంగా రికార్డ్ చేయవచ్చు. ఫోటోగ్రాఫర్లు, కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్.

బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌

ఫోన్‌లో 5,200mAh బ్యాటరీ ఉంది. మోటోరోలా ప్రకారం 52 గంటల వరకు యూసేజ్ వస్తుంది. 90W టర్బోపవర్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్. 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఉంది.

మిలిటరీ గ్రేడ్ డిజైన్, బలమైన సెక్యూరిటీ

ప్రీమియం అల్యూమినియం ఫ్రేమ్ ఉంది. బ్యాక్ ప్యానెల్ ఫాబ్రిక్-ఇన్‌స్పైర్డ్ లగ్జరీ ఫినిష్. ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఫేస్ అన్‌లాక్, థింక్‌షీల్డ్ సెక్యూరిటీ ఉన్నాయి. IP68, IP69 రేటింగ్స్, MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఉంది.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×