E-Paper
Advertisement

Wife Killed Husband: ప్రియుడు మోజులో భర్తని లేపేసింది.. ఫోన్స్ ద్వారా, విశాఖలో దారుణమైన ఘటన

Wife Killed Husband: ప్రియుడు మోజులో భర్తని లేపేసింది.. ఫోన్స్ ద్వారా, విశాఖలో దారుణమైన ఘటన
Advertisement

Wife Killed Husband: అక్రమ సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా భార్యభర్తల మధ్య విభేదాలు, ఆపై ఆత్మహత్యలు లేకుంటే హత్య చేసుకునే స్థాయికి వెళ్లింది. తాజాగా అలాంటి ఘటన ఒకటి విశాఖలో వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో పడింది భర్తని చంపేసింది తాళి కట్టిన భార్య. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..

Advertisement

ప్రియుడి మోజులో పడి భర్తను చంపేసింది

విశాఖ సిటీ పరిధిలో పీఎం పాలెంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లా గరివిడి ప్రాంతానికి చెందిన నాగరాజు-భార్య రమ్యతో కలిసి మధురవాడలోని బక్కన్నపాలెం గ్రామంలో నివాసం ఉంటున్నాడు.  అయితే మద్యానికి బానిసైన నాగరాజు.. చీటికి మాటికి భార్యని వేధించేవాడు.

Advertisement

ఇదిలా వుండగా డిసెంబర్ 9న ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్లాడు నాగరాజు. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. వారం రోజుల తర్వాత భార్య రమ్య, పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొలుత మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేశారు. నాగరాజు ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు గాలించారు.

విశాఖలోని పీఎం పాలెంలో దారుణమైన ఘటన

నాగరాజు ఆచూకీ గురించి ఎలాంటి విషయాలు తెలియరాలేదు. చివరకు తిమ్మాపురం సమీపంలో ఓ మృతదేహం లభ్యమైంది. దీనిపై ఆరా తీయగా, నాగరాజుదేనని తేలింది. దీంతో దర్యాప్తులో పోలీసు లకు కొత్త చిక్కు వచ్చింది. దాదాపు 20 రోజులు తర్జనభర్జన పడ్డారు. చివరకు రమ్య ఫోన్ కాల్స్‌పై ఫోకస్ చేశారు. దీంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఓ వ్యక్తితో రమ్యకు పరిచయం అయ్యింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ గురించి ఆరా తీశారు. చివరకు ప్రియుడి మోజుపై పడి భర్తని చంపేసిందని కంక్లూజన్‌కు వచ్చారు పోలీసులు. రమ్య, ఆమె ప్రియుడ్ని పోలీసు స్టేషన్‌కి తీసుకొచ్చి విచారించారు పోలీసులు. దీంతో అక్రమ సంబంధంతో బాగోతం బట్ట బయలైంది.

ALSO READ: ప్రేమించి పెళ్లి చేసుకోమంటే.. నిందలు వేసి ప్రాణం తీశాడు, హైదరాబాద్‌లో ఘోరం

నాగరాజుని ఎవరు చంపారు అనేదానిపై కూపీ లాగుతున్నారు. రమ్య చంపితే నాగరాజు మృతదేహం తిమ్మాపురం సమీపంలో ఎలా లభించింది? ఎవరినైనా కిరాయి వ్యక్తుల చేత హత్య చేయించిందా? ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. నాగరాజు హత్య జరిగి దాదాపు నెల రోజులు గడుస్తోంది.  మరి దర్యాప్తులో ఇంకెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×