E-Paper
Advertisement

Arjun Tendulkar Marriage: అర్జున్ టెండూల్కర్ పెళ్లి డేట్ ఫిక్స్..ఎంత క‌ట్నం ఇస్తున్నారంటే ?

Arjun Tendulkar Marriage: అర్జున్ టెండూల్కర్ పెళ్లి డేట్ ఫిక్స్..ఎంత క‌ట్నం ఇస్తున్నారంటే ?
Advertisement

Arjun Tendulkar Marriage: టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్  ఇంట పెళ్లి సందడి నెలకొంది. సారా టెండూల్కర్ ముందుగా పెళ్లి చేసుకుంటుంది అనుకుంటే, ఆమె సోదరుడు అర్జున్ టెండూల్కర్ అందరికీ రిక్వెస్ట్ ఇచ్చి ముందుగా పెళ్లి చేసుకోబోతున్నాడు. సానియా అనే అమ్మాయితో ఇప్పటికే అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్మెంట్ జరగగా, ఇప్పుడు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారట. ప్రముఖ వ్యాపారవేత్త అయిన రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్, సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar Marriage ) వివాహం మార్చి 5వ తేదీన జరగనున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు ఇరు కుటుంబాలు ఈ తేదీని ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. దీంతో మార్చి మూడవ తేదీ నుంచి ముంబైలో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Also Read: Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !

మార్చి ఐదవ తేదీన అర్జున్ టెండూల్కర్ వివాహం

Advertisement

లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇంటివాడు కాబోతున్నాడు. 2025 ఆగస్టు నెలలోనే అర్జున్ టెండూల్కర్, ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచిన సచిన్ టెండూల్కర్, ఇటీవల రివీల్ చేశాడు. ఇక ఇప్పుడు ముహూర్తాలు వస్తున్న నేపథ్యంలో మార్చి 5వ తేదీన అర్జున్ టెండూల్కర్ -సానియా వివాహం చేసేందుకు సిద్ధమయ్యారట. ముంబైలో ఉన్న ఓ ప్రముఖ ప్యాలెస్ లో వీళ్ళ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. వివాహ నేపథ్యంలో సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కు భారీగానే కట్నం వస్తోన్నట్లు తెలుస్తోంది. ముంబైలో ఉన్న ఓ అపార్ట్మెంట్, కారు, భారీగానే బంగారం కూడా ఇస్తున్నారట.

ఐపీఎల్ 2026 లో ల‌క్నోకు ఆడ‌నున్న అర్జున్ టెండూల్క‌ర్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో అర్జున్ టెండూల్కర్ కు ఊహించని షాక్ ఇచ్చింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. ఐపీఎల్ 2026 నేపథ్యంలో వదిలేసుకుంది ముంబై ఇండియన్స్. లక్నోకు చెందిన శార్దూల్ ఠాకూర్ ను ట్రేడింగ్ ద్వారా తీసుకొని అర్జున్ టెండూల్కర్ ను లక్నో జట్టుకు అప్పగించేసింది. అంటే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament )  లక్నో జెర్సీ లో కనిపించనున్నాడు అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar). ముంబై ఇండియన్స్ లో ఉన్నప్పుడే అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. అలాంటిది ఇప్పుడు లక్నో జట్టులోకి వెళ్ళాడు. లక్నో ( Lucknow Super Giants ) జట్టు ఓనర్ సంజీవ్ అత్యంత కిరాతకుడు. అతని వల్ల కె ఎల్ రాహుల్ బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరి అలాంటి కిరాతకుడి చేతిలోకి ఇప్పుడు అర్జున్ టెండూల్కర్ వెళ్ళాడు. దీంతో అతని కెరీర్ క్లోజ్ అంటున్నారు నెటిజెన్స్.

Advertisement

Also Read: Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×