Bihar News: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికలకు ముందు నుంచే అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీల మధ్య విమర్శలు పక్కనపెడితే.. ఓటర్లు ఏమంటున్నారు? ప్రీ-పోల్ సర్వేలో అంచనాలు ఎవరివైపు ఉన్నాయా? ఇండియా కూటమి వస్తుందా? మళ్లీ ఎన్డీయే వస్తుందా? లోక్ పాల్ చేసిన సర్వేలో ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు లోక్ పోల్ సంస్థ ప్రీ పోల్ సర్వేను విడుదల చేసింది. ఇండియా కూటమికి 118-126 సీట్లు, ఎన్డీయేకు 105-114 సీట్లు వస్తాయన్నది ఆ సర్వే సారాంశం. ఇతరులు అంటే ప్రశాంత్ కిషోర్ పార్టీ 2 నుంచి 5 సీట్లు రావచ్చని తేల్చింది. బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉన్నాయి. 122 సీట్లు గెలిచినవారు ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంటారు.
ఎన్డీయేకు ఈసారి 38 నుంచి 41 శాతం వరకు (105 నుంచి 114 సీట్లు) ఓట్లు రావచ్చని అంచనా వేసింది. మహాకూటమికి 39 నుంచి 42 శాతం ఓట్లు (118 నుంచి 126 సీట్లు )రావచ్చని పేర్కొంది. ఇతరులకు 12 నుంచి 16 శాతం వరకు ఓట్లు వచ్చినా, సీట్లు కేవలం 2 నుంచి 5 కి పరిమితం కానున్నాయి.
లోక్‌పాల్ సంస్థ మూడు వారాల పాటు క్షేత్రస్థాయిలో సర్వే చేసింది. గ్రామీణ, పట్టణ, నగరాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఆ తర్వాత సర్వే ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుత అంచనాలు కూటమిని అనుకూలంగా వచ్చాయి. అయితే ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయం మారవచ్చు, ఓటింగ్ జరిగే సమయానికి బట్టి అంచనాలు తారుమారు అయిన సందర్భాలు లేకపోలేదు.
ALSO READ: పార్టీ తరపున మృతుల కుటుంబాలకు టీవీకే ఎక్స్‌గ్రేషియా
ఈ సర్వేకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే చేపట్టింది. వలసలు-నిరుద్యోగం మొదటి పాయింట్. బీహార్‌లో 243 సీట్లు ఉన్నాయి. విజయం సాధించాలంటే 122 సీట్లు కావాలి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మహా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలింది.
రిజర్వేషన్ల సమస్యకు OBC-EBC మద్దతు: ఆర్జేడీకి రిజర్వేషన్ సమస్యకు OBC, EBCల నుండి మద్దతు లభించింది. కాంగ్రెస్ కులగణన సహాయంతో ఎస్సీలు, EBC ల్లో సీట్లు పెరగవచ్చన్నది ఓ అంచనా. (ఉదా-చమర్, ముసాహర్, మల్లా) కులాల్లో ఓట్ల శాతం పెంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయేకు ఒకప్పుడు వారి మద్దతు ఉండేది. జేడీయూ బలమైన ఓటు బ్యాంకు ఈసారి కష్టమని తేలింది.
నితీష్ ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు: ఎన్డీయే ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు తేలింది. ఆరోగ్య సమస్యలు, అవినీతి, క్షీణిస్తున్న శాంతిభద్రతల వల్ల నితీష్ పాలనపై పడిందని చెబుతోంది. ముస్లింలు-యాదవుల ఏకీకరణ: ముస్లింలు- యాదవుల ఏకీకరణ దేశాన్ని బలోపేతం చేస్తోందని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ JD-U ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్లు పేర్కొంది.
బీజేపీ ప్రధాన ఓటు బ్యాంకుకు జాన్ సూరజ్ పార్టీ గండి కొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నట్లు పేర్కొంది. బీజేపీలకు బనియాల కులం మద్దతు ఉంది. అయితే జాన్ సూరజ్ పార్టీ ఉన్నత కులాల ఓటర్లను టార్గెట్ చేసింది. ఫలితంగా బీజేపీకి ఆయా జిల్లాల్లో నెగిటివ్ ఫలితాలు వచ్చే అవకాశమున్నట్లు తేల్చింది.
మై బెహన్ మాన్ యోజన, ఉచిత విద్యుత్ వంటి పథకాల కారణంగా మహిళా ఓటర్లు మహాకూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఓట్ల దొంగతనం కూడా ప్రభావం చూపుతుందని తెలిపింది. రాహుల్ గాంధీ ఇమేజ్ మెరుగుపడిందని, ఓటర్ల కోసం ఆయన చేసిన యాత్ర, ప్రజా సమస్యలపై దృష్టి సారించిన నాయకుడిగా ఇమేజ్ పెరుగుతున్నట్లు తెలిపింది. ఉత్తరప్రదేశ్ సరిహద్దు సీట్లలో బీఎస్పీ క్షీణించడంతో మహాకూటమికి అవకాశాలు పెరిగే ఛాన్స్ వుందని పేర్కొంది.
After 3 weeks on the ground, intense fieldwork & booth-level insights, #Lokpoll brings you the most anticipated survey for #BiharElection2025.
Here are our seat projections:
▪️NDA: 105 – 114
▪️MGB: 118 – 126
▪️Others: 2 – 5Don't forget to read the state… pic.twitter.com/MVZg41ZINw
— Lok Poll (@LokPoll) September 26, 2025