E-Paper
Advertisement

Green Mirchi Halwa: పచ్చిమిర్చితో హల్వా కూడా చేస్తారు తెలుసా? తింటే అదిరిపోతుంది కూడా

Green Mirchi Halwa: పచ్చిమిర్చితో హల్వా కూడా చేస్తారు తెలుసా? తింటే అదిరిపోతుంది కూడా
Advertisement

సాధారణంగా పచ్చిమిర్చి అంటే మనకు గుర్తుకు వచ్చేది కారంగా ఉండే వంటరాలే. కానీ అదే పచ్చిమిర్చితో తీపి హల్వా తయారు చేయొచ్చు. ఈ హల్వా తీపి, కారం కలిసిన కొత్త రుచిని ఇస్తుంది. కొత్త రకాల వంటకాలు ప్రయత్నించేవారికి ఇది సరైన ఎంపిక. ముఖ్యంగా పెద్దగా కారం లేని లావుగా ఉండే పచ్చిమిర్చిని ఉపయోగిస్తే ఈ హల్వా మరింత రుచిగా ఉంటుంది. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే ఈ స్వీట్ చేయవచ్.

పచ్చిమిర్చి హల్వా రెసిపీ వలసిన పదార్థాలు
పెద్ద పచ్చిమిర్చి – 8 నుంచి 10
పాలు – 1 కప్పు
ఖోవా – అర కప్పు
చక్కెర – అర కప్పు
నెయ్యి – 3 నుంచి 4 స్పూన్లు
యాలకుల పొడి – చిటికెడు
జీడిపప్పు – 8 నుంచి 10
బాదం – 6 నుంచి 8
కుంకుమపువ్వు – రెండు రేకలు

Advertisement

Also read: Mutton Curry: కొత్తిమీర మటన్ ఇలా వండారంటే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది, రెసిపీ ఇదిగో

పచ్చిమిర్చి హల్వా రెసిపీ
1. పచ్చిమిర్చిని బాగా కడిగి తడి తుడిచేయాలి. తరువాత పొడవుగా చీల్చి లోపల గింజలు తీసేయాలి. దీనివల్ల కారం తగ్గిపోతుంది.

Advertisement

2. స్టవ్ మీద కళాయి తీసుకుని నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో మిర్చి ముక్కలు వేసి 5 నిమిషాలు తక్కువ మంటపై వేయించాలి. మిర్చి మెత్తగా మారే వరకు కలుపుతూ ఉండాలి.

3. ఇప్పుడు పాలు పోసి ఉడికించాలి. పాలు మిర్చిలో కలిసే వరకు కలుపుతూ ఉండాలి. తరువాత ఖోవా వేసి బాగా కలపాలి. మిశ్రమం కొద్దిగా చిక్కబడుతుంది.

4. చక్కెర వేసి మళ్లీ కలుపుతూ ఉంచాలి. చక్కెర కరిగి మిశ్రమం ముద్దలా మారే వరకు ఉడికించాలి.

5. చివరగా యాలకుల పొడి, జీడిపప్పు, బాదం ముక్కలు వేసి కలపాలి. మిశ్రమం కడాయి నుంచి విడిపోతున్న దశలో స్టవ్ ఆఫ్ చేయాలి.

6. అంటే టేస్టీ పచ్చిమిర్చి హల్వా సిద్ధం అయినట్టే. ఒక్కసారి తింటే కొత్త రుచిని అందిస్తుంది.

Also Read: Simple Breakfast: రాత్రి మిగిలిన రోటీలతో ఉదయం టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రోటీ ఉప్మా .. రెసిపీ ఇదిగో

వేడిగా ఉన్నప్పుడే బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేయండి. తీపి, తేలికపాటి కారం కలిసిన ప్రత్యేక రుచితో పచ్చిమిర్చి అందరికీ నచ్చుతుంది. ఒక్కసారి దీన్ని వండుకుని చూడండి అద్భుంగా ఉంటుంది.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×