E-Paper
Advertisement

ఫోన్ తీయాల్సిన పనిలేదు.. నథింగ్ ఏఐ గ్లాసెస్ వచ్చేస్తున్నాయి, అన్నీ కళ్లద్దాలతోనే ఇక!

ఫోన్ తీయాల్సిన పనిలేదు.. నథింగ్ ఏఐ గ్లాసెస్ వచ్చేస్తున్నాయి, అన్నీ కళ్లద్దాలతోనే ఇక!
Advertisement

Nothing AI Smart Glasses: వేగంగా మారుతున్న టెక్నాలజీతో ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్రయోగం చేసే నథింగ్ సంస్థ.. ఇప్పుడు అందరి చూపు తనవైపు తిప్పుకునేలా మరో ప్లాన్ చేస్తోంది. వన్‌ప్లస్ సృష్టికర్త కార్ల్ పీ నేతృత్వంలోని ఈ కంపెనీ, త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సపోర్ట్‌తో పనిచేసే అదిరిపోయే స్మార్ట్ గ్లాసెస్‌ను మన ముందుకు తీసుకురాబోతోంది. బహుశా 2027 మొదట్లోనే ఈ గ్లాసెస్ మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మన చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లకు ప్రత్యామ్నాయంగా, కళ్లజోడు రూపంలోనే అన్నీ చక్కబెట్టేసేలా ఈ కొత్త డివైజ్‌ను డిజైన్ చేస్తున్నారు.

బరువు తక్కువ.. ఫీచర్లు ఎక్కువ:

సాధారణంగా మనం చూసే ఏఆర్ హెడ్‌సెట్లు చాలా పెద్దవిగా, తలకు భారంగా అనిపిస్తాయి. కానీ నథింగ్ మాత్రం మన రెగ్యులర్ కళ్లద్దాల లాగే చాలా తేలికగా ఉండేలా వీటిని తయారు చేస్తోంది. ఇందులో కెమెరాలు, స్పీకర్లు, మైక్రోఫోన్లు ఉన్నప్పటికీ బరువు మాత్రం అస్సలు తెలియదట. ఎందుకంటే.. డేటా మొత్తాన్ని ఫోన్ లేదంటే క్లౌడ్ ద్వారా ప్రాసెస్ చేయడం వల్ల కళ్లద్దాలు సింపుల్‌గా ఉంటాయి. కళ్ల ముందు భారీ గ్రాఫిక్స్ చూపించడం కంటే.. మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, మన పనులను సులభం చేయడం మీదే నథింగ్ ఎక్కువ ఫోకస్ పెడుతోంది.

Advertisement

Also Read: Xiaomi 17 vs Samsung S26: కొత్త ఫోన్ కొనేముందు ఇవి చూడకపోతే పప్పులో కాలేసినట్టే!

మల్టీ డివైజ్ వ్యూహం:

అయితే ఈ గ్లాసెస్ కంటే ముందే.. నథింగ్ నుంచి సరికొత్త ఏఐ ఇయర్‌బడ్స్ రాబోతున్నాయి. ఇవి కేవలం పాటలు వినడానికే కాదు.. ఫోన్‌తోనూ, రాబోయే స్మార్ట్ గ్లాసెస్‌తోనూ ఇట్టే కలిసిపోతాయి. దీంతో మనం ఏ పరికరం వాడుతున్నా, అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై మనకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంటాయన్నమాట. కేవలం ఫోన్లకే పరిమితం కాకుండా.. ఒక కంప్లీట్ టెక్ నెట్‌వర్క్‌ను కస్టమర్లకు అందించాలనేది కార్ల్ పీ అసలు ఉద్దేశం. అందుకే ప్రతి గ్యాడ్జెట్‌లోనూ తెలివైన ఏఐ ఫీచర్లను జోడిస్తున్నారు.

పెరుగుతున్న పోటీ:

Advertisement

ఇప్పటికే మార్కెట్లో మెటా రే-బాన్ గ్లాసెస్ హల్‌చల్ చేస్తున్నాయి. మరోవైపు యాపిల్ కూడా తమ సీక్రెట్ ప్రాజెక్ట్ N50తో స్మార్ట్ గ్లాసెస్ రేసులో ఉంది. ఇలాంటి దిగ్గజ కంపెనీల మధ్య నథింగ్ తన మార్కును ఎలా చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నథింగ్ అనుకున్నట్టుగా తక్కువ బరువుతో, ఎక్కువ ఫీచర్లు ఇస్తే మాత్రం భవిష్యత్తులో జనం ఫోన్ల కంటే ఈ స్మార్ట్ గ్లాసెస్‌నే ఎక్కువగా వాడే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు టెక్ లవర్స్ అంతా ఈ కొత్త గ్లాసెస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని తెగ ఎదురుచూస్తున్నారు.

Also Read: ఫోన్ రీసెట్ చేసే ముందు ఈ ఒక్క పని చేయకపోతే.. మీ గూగుల్ అకౌంట్ డేంజర్లో పడ్డట్టే!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×