E-Paper
Advertisement

వందే భారత్ రైలు ఎక్కుతున్నారా? దోమల బ్యాట్ తీసుకెళ్లండి!

వందే భారత్ రైలు ఎక్కుతున్నారా? దోమల బ్యాట్ తీసుకెళ్లండి!
Advertisement

Secunderabad–Visakhapatnam Vande Bharat Train: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య వేగవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే వందేభారత్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదట్లో ఈ రైలు వేగం, సౌకర్యంతో ఆకట్టుకుంది. కానీ, ఇటీవల ఈ రైలులో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు రైలు మెయింటెనెన్స్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దోమల సమస్య, శుభ్రత లోపం, సీట్ల నుంచి వస్తున్న దుర్వాసన లాంటి అంశాలు ప్రయాణాన్ని అసౌకర్యంగా మారుస్తున్నాయని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దోమల బ్యాట్ తీసుకెళ్లాలంటూ సటైర్లు

రైలులో కూర్చున్న కొద్ది సేపటికే దోమలు ఇబ్బంది పెట్టడం మొదలవుతుందని ప్రయాణీకులు చెప్తున్నారు. ముఖ్యంగా రాత్రి ప్రయాణాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందంటున్నారు. దోమల వల్ల ప్రశాంతంగా కూర్చోలేకపోవడం, నిద్రపోలేకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయంటున్నారు. ప్రీమియం రైలులో ఇలాంటి సమస్యలు ఉండటం షాకింగ్ గా ఉందంటున్నారు.

సీట్ల నుంచి దుర్వాసన..

Advertisement

అంటేకాదు, ఈ  రైలులో శుభ్రత విషయంలో కూడా నిర్లక్ష్యం కనిపిస్తుందంటున్నారు ప్రయాణీకులు. కొన్ని కోచ్‌ లలో సీట్లు సరిగా శుభ్రం చేయకపోవడం, చెత్తను సమయానికి తొలగించకపోవడం వంటి సమస్యలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా సీట్ల నుంచి వచ్చే దుర్వాసన ప్రయాణాన్ని మరింత ఇబ్బందికరంగా మారుస్తోందంటున్నారు. ఇంత ఖరీదైన టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్నప్పుడు కనీస శుభ్రత కూడా లేకపోవడం నిరాశ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందే భారత్ రైలు సాధారణ రైళ్లతో పోలిస్తే అధిక ధరతో ఉండటంతో, ప్రయాణికులు కూడా మంచి సేవలను ఆశిస్తారు. కానీ, వాస్తవ పరిస్థితి అలా లేకపోవడం వల్ల అసంతృప్తి చెందుతున్నారు. “ఇంత డబ్బు ఖర్చు చేసి ప్రయాణిస్తే కనీసం శుభ్రత, సౌకర్యం ఉండాలి కదా?” అని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు.

రైలు మెయింటెనెన్స్ పై ఆగ్రహం

కొందరు ప్రయాణికులు రైలు మెయింటెనెన్స్‌ పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రైలును తరచుగా శుభ్రం చేయకపోవడం, కోచ్‌ లను సరిగ్గా పరిశీలించకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇలాంటి సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే, రైల్వే ప్రతిష్టకు కూడా నష్టం కలిగే అవకాశం ఉందని అంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవడం, కోచ్‌లను పూర్తిగా శుభ్రం చేయడం, సీట్లను సానిటైజ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటే పరిస్థితి మెరుగుపడుతుందంటున్నారు.

Advertisement

Read Also: రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. అరగంట ముందు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు!

వందే భారత్ లాంటి ప్రీమియం రైలులో ప్రయాణించే వారికి సరైన ప్రయాణాన్ని అందిచడంలో అధికారులు విఫలం అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రయాణికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, వెంటనే మెరుగైన  సేవలను అందిస్తేనే, వందేభారత్ రైలుపై ఉన్న విశ్వాసంపెరుగుతుంది. లేదంటే, ఈ ప్రీమియం రైలుకు ఉన్న విలువ తగ్గడం ఖాయం.

Read Also: సికింద్రాబాద్–అనకాపల్లికి ఇక రెగ్యులర్ సర్వీసులు, గుడ్ న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!

Related News

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×