E-Paper
Advertisement

Nothing Phone 3 Price Drop: ఇది కలా.. నిజమా? అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3పై రూ.32,000 ఫ్లాట్ డిస్కౌంట్!

Nothing Phone 3 Price Drop: ఇది కలా.. నిజమా? అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3పై రూ.32,000 ఫ్లాట్ డిస్కౌంట్!
Advertisement

Nothing Phone 3 Price Drop: లండన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నథింగ్ ఫోన్లకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘నథింగ్ ఫోన్ 3’పై మైండ్ బ్లాకింగ్ ఆఫర్ ప్రకటించింది. గతేడాది జూలైలో దాదాపు రూ.80,000 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ ప్రీమియం ఫోన్.. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఊహించని విధంగా రూ.50,000 లోపే అందుబాటులోకి వచ్చింది. అంటే.. రూ.32,000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. మరెందుకు ఆలస్యం స్టాక్ అయిపోయేలోపు ఈ డీల్‌ను కైవసం చేసుకోండి.

బ్యాంక్ ఆఫర్ వివరాలివే:

ప్రస్తుతం అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 కేవలం రూ.48,000 ధరకే లిస్టైంది. అంతేకాదు, ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా మరో రూ.1,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే మీ పాత స్మార్ట్‌ఫోన్ కండిషన్ బాగుంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఏకంగా రూ.42,000 వరకు అదనపు తగ్గింపును పొందే అవకాశం కూడా ఉంది. ఒకేసారి డబ్బులు కట్టలేని వారు నెలకు కేవలం రూ.1,688 చెల్లించి  నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: రూ.6,999కే ప్రీమియం లుక్.. ఆండ్రాయిడ్ 15తో వచ్చిన లావా కొత్త ఫోన్ విశేషాలివే!

అద్భుతమైన డిస్‌ప్లే:

ఈ ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండటం వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. నథింగ్ సిగ్నేచర్ స్టైల్ అయిన ట్రాన్స్‌పారెంట్ బ్యాక్ డిజైన్, కొత్తగా వచ్చిన గ్లిఫ్ మ్యాట్రిక్స్ లైటింగ్ సెటప్ ఈ ఫోన్‌ను మార్కెట్లోని ఇతర ఫోన్ల కంటే చాలా భిన్నంగా చూపిస్తాయి. దీనికి తోడు గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉండటం వల్ల ఫోన్ చాలా ధృడంగా ఉంటుంది.

నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్:

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే హెవీ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌ను చాలా స్మూత్‌గా డీల్ చేస్తుంది. దీనిలో గరిష్టంగా 16GB RAM, 512GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనుకవైపు 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. దీంతో పాటు సెల్ఫీల కోసం కూడా 50MP కెమెరా ఉండటం వల్ల తక్కువ లైటింగ్‌లో కూడా ఫొటోలు క్వాలిటీగా వస్తాయి. 5,500mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా వాడుకోవచ్చు.

Also Read: గేమర్లు, వ్లాగర్లకు పూనకాలే.. పవర్‌పుల్ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్ డేట్ ఫిక్స్!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×