E-Paper
Advertisement

నేషనల్ లెవెల్ లో సత్తా చాటిన నల్లగొండ, ఏకంగా సెకెండ్ ప్లేస్ కైవసం!

నేషనల్ లెవెల్ లో సత్తా చాటిన నల్లగొండ, ఏకంగా సెకెండ్ ప్లేస్ కైవసం!
Advertisement

Nalgonda’s Clean Air Success: నల్లగొండ పేరు మరోసారి జాతీయ స్థాయిలో మార్మోగింది. గాలి నాణ్యతను మెరుగుపరచడంలో తీసుకున్న చర్యలకు గుర్తింపుగా నల్లగొండ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో రెండో స్థానం సాధించింది. అయితే, ఈ ఘనత 2024 సర్వేక్షణ్‌కు సంబంధించినది. మూడు లక్షలలోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీ-3లో నల్లగొండ ఈ ర్యాంక్ దక్కించుకుంది. ఇంతకీ ఈ ర్యాంకులు ఎలా ఇస్తారు? కేవలం గాలి నాణ్యతను కొలిచి నిర్ణయిస్తారా? లేక నగరంలో జరుగుతున్న ఇతర పనులను కూడా పరిశీలిస్తారా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

దేశ వ్యాప్తంగా నగరాల మధ్య జరిగే పోటీ

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌ను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని  నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP)లో భాగంగా నిర్వహిస్తారు. నగరాలు గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయో అంచనా వేయడమే ప్రధాన ఉద్దేశం. జనాభా ఆధారంగా నగరాలను మూడు కేటగిరీలుగా విభజిస్తారు. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలు ఒక కేటగిరీలో, 3 నుంచి 10 లక్షల మధ్య ఉన్నవి మరో కేటగిరీలో, 3 లక్షలలోపు జనాభా ఉన్న నగరాలు మూడో కేటగిరీలో పోటీ పడతాయి.

ఏ అంశాలను పరిశీలిస్తారు?

Advertisement

ఈ పోటీలో గాలి నాణ్యత మాత్రమే కాదు.. కాలుష్యాన్ని నియంత్రించేందుకు నగరం తీసుకుంటున్న చర్యలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. రోడ్లపై దుమ్ము నియంత్రణ, చెత్త నిర్వహణ, వాహనాల కాలుష్యం, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ, డీజిల్ జనరేటర్లు, వాణిజ్య ప్రాంతాల నుంచి వచ్చే ఉద్గారాలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు వంటి అంశాలను పరిశీలిస్తారు. అంటే.. నగరం ఎంత శుభ్రంగా ఉందన్నది మాత్రమే కాదు, భవిష్యత్తులో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎంత సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నదీ లెక్కలోకి వస్తుంది.

ర్యాంక్ ఎలా ఖరారు చేస్తారు?

మొదట నగరాలు తమ పనితీరుకు సంబంధించిన వివరాలను సమర్పిస్తాయి. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ వాటిని పరిశీలిస్తుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా వాటిని చెక్ చేస్తుంది.  అంతటితో ప్రక్రియ పూర్తికాదు. స్వతంత్ర కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలనలు కూడా నిర్వహిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ ఆధారంగా నగరాలకు తుది స్కోర్, ర్యాంక్ నిర్ణయిస్తారు.

నల్లగొండకు సెకండ్ ప్లేస్

Advertisement

ఈ విధానంలో 2024లో నల్లగొండ మంచి పనితీరు కనబరిచింది. మూడు లక్షలలోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీ-3లో రాయ్‌బరేలీ మొదటి స్థానంలో, నల్లగొండ రెండో స్థానంలో, నాలాగఢ్ మూడో స్థానంలో నిలిచాయి. నల్లగొండకు దక్కిన ఈ గుర్తింపు వెనుక రోడ్డు దుమ్ము నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం పెంపు, రోడ్ల నిర్వహణ లాంటి చర్యలు కీలకంగా నిలిచాయి.

మరి 2026లో ఎవరు టాప్?

2026 స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో కేటగిరీ-3లో కళింగనగర్ మొదటి స్థానంలో, అంగుల్ రెండో స్థానంలో, తల్చేర్ మూడో స్థానంలో నిలిచాయి. నల్లగొండకు రెండో ర్యాంక్ అనేది 2026కి కాకుండా 2024 ఏడాదికి గాను లభించింది. నల్లగొండకు లభించిన జాతీయ స్థాయి గుర్తింపు నగరంలో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలకు వచ్చిన మంచి గుర్తింపుగా చెప్పొచ్చు.

Read Also: నాగార్జునసాగర్ లో రంగు మారుతున్న నీళ్లు, అసలేం జరుగుతోంది?

Tags

Related News

రూ.7 కోట్ల బంగారు శవపేటికలో అంత్యక్రియలు.. ఆశ్చర్యపోతున్న ప్రపంచం!

నాగార్జునసాగర్ లో రంగు మారుతున్న నీళ్లు, అసలేం జరుగుతోంది?

ఎయిర్‌పోర్ట్‌కు లగేజ్ తీసుకెళ్లడం ఇక అవసరం లేదు.. ఇంటి వద్దనే చెక్ ఇన్ సర్వీస్

మ్యూజియంలో ఉండాల్సిన ట్రైన్ మళ్లీ పట్టాలపైకి.. 63 ఏళ్ల ఈ రైలుకు ఇప్పటికీ ఇంత డిమాండా?

ప్రపంచంలోనే అత్యంత సన్నని ఇల్లు.. లోపల సౌకర్యాలు చూస్తే షాకవ్వాల్సిందే?

దీపావళి రైలు టికెట్ల బుకింగ్ షురూ.. కన్ఫర్మ్ బెర్త్ కావాలంటే ఈ డేట్ మిస్ కావొద్దు!

అడవిలో దాగిన 1,500 ఏళ్ల అద్భుతం.. తెలంగాణ ఆంగ్‌కోర్ వాట్ ఆలయం గురించి మీకు తెలుసా?

Big Stories

Advertisement
×