E-Paper
Advertisement

బీఆర్ఎస్‌ని ఏకేసిన మంత్రి సీతక్క.. మీది దళిత వ్యతిరేక నైజం, కవితను ఎందుకు బహిష్కరించారు?

బీఆర్ఎస్‌ని ఏకేసిన మంత్రి సీతక్క.. మీది దళిత వ్యతిరేక నైజం, కవితను ఎందుకు బహిష్కరించారు?
Advertisement

Telangana Assembly: అసెంబ్లీలో బీఆర్ఎస్ తీరుపై ఓ రేంజ్‌లో మండిపడ్డారు మంత్రి సీతక్క. బీఆర్ఎ ను అన్ని కోణాల్లో ఏకిపారేశారు. హరీష్ రావును కవిత ఏదో అన్నారని ఆమెని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారని ప్రశ్నించారు. ఈ విషయంలో ఏం జరిగిందో దేశానికి అంతా తెలుసన్నారు. ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. మా సీఎంని అంటే మేం ఊరుకుంటామా? అంటూ ఎదురుదాడి చేశారు.

అసెంబ్లీలో బీఆర్ఎస్‌పై మంత్రి సీతక్క ఎదురుదాడి

మంగళవారం అసెంబ్లీలో సోమవారం జరిగిన ఘటనపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకున్నారు. స్పీకర్‌ను దూషించిన వారిని సభ నుంచి బహిష్కరించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.

Advertisement

మహిళా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసభ్యంగా చేతులు వేసి నెట్టి వేశారని, అందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడే చూశామన్నారు. దీనిపై మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేస్తామని సభలో వెల్లడించారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటారన్నారు.

బీఆర్ఎస్‌ది దళిత వ్యతిరేక నైజం-మంత్రి సీతక్క

గిరిజన, దళిత వ్యతిరేక నైజం బీఆర్ఎస్ దని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలు ఎదిగితే ఓర్చుకోలేని భూస్వామ్య విధానం ఆ పార్టీదని మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టి ఎందుకు రాజకీయం చేస్తున్నారో తెలీదన్నారు. కేటీఆర్.. మహిళా పోలీసులపై చేతులు వేశారన్నారు. ఎస్సీ-ఎస్టీ వ్యక్తులను దూషిస్తే యాక్ట్ వర్తిస్తుందన్నారు.

Advertisement

వీళ్లకు తల్లులు లేరా? లకారంతో ఏలా తిడుతారని రుసరుసలాడారు. వారి తల్లులను తిడితే.. వారు బాధ పడరా? 2018 లో స్పీకర్ పై దాడి చేశారని ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అర్టికల్ 194 (3) ప్రయోగించి సస్పెండ్ చేశారని గుర్తు చేశారు మంత్రి సీతక్క. అదే రూల్ బీఆర్ఎస్ సభ్యులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో హరీష్‌రావు స్పీకర్ పోడియం మీదకు ఉరుకుతున్నారని, స్పీకర్‌ను కొడతారా? నిన్న దూషించారు? గుర్తు చేశారు. సభలో నైతిక విలువలు, సంప్రదాయాలు ఉండాలన్నారు. సోమవారం జరిగిన ఘటనపై ఇప్పటివరకు స్పీకర్ కు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పలేదని, ఆ పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

ALSO READ: హరీష్‌రావుపై స్పీకర్ ఆగ్రహం.. నా తల్లిని తిట్టారు.. నాకు ఆవేశం ఉండాలి?

 

Related News

స్పీకర్ ఛాంబర్‌లో అత్యవసరంగా భేటీ.. గడ్డం ప్రసాద్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మేటరేంటి?

Telangana Assembly: హరీష్‌రావుపై స్పీకర్ ఆగ్రహం.. నా తల్లిని తిట్టారు.. నాకు ఆవేశం ఉండాలి?

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ అరెస్ట్, మిగతా నేతలపై..

స్పీకర్‌పై మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను: తాతా మధు!

జోగులాంబ గద్వాల్లో భూ బకాసురుల పంజా.. నకిలీ పట్టాలతో భూమి ఆక్రమణ!

ఈనెల 14 నుండి 25 వరకు తెలంగాణలో హై అలర్ట్!

దద్దరిల్లిన హన్మకొండ.. వేలాది మంది విద్యార్థులతో కవిత భారీ పాదయాత్ర!

Big Stories

Advertisement
×