BigTV English

OnePlus Ace 5: వన్‌ప్లస్ నుంచి మైండ్‌బ్లోయింగ్ ఫోన్.. 6200 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వచ్చేస్తుంది..!

OnePlus Ace 5: వన్‌ప్లస్ నుంచి మైండ్‌బ్లోయింగ్ ఫోన్.. 6200 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వచ్చేస్తుంది..!

OnePlus Ace 5 and Ace 5 pro: టెక్ బ్రాండ్ OnePlus దేశీయ మార్కెట్‌లో సత్తా చాటుతోంది. కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ అదరగొట్టేస్తుంది. ఇప్పటికే చాలా ఫోన్లను మార్కెట్‌లో పరిచయం చేసిన కంపెనీ ఇప్పుడు తన లైనప్‌లో ఉన్న మరో స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే త్వరలో కంపెనీ OnePlus Ace స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఇప్పటికీ చాలాసార్లు వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ వన్‌ప్లస్ ఏస్ 5 సిరీస్‌ను ప్రవేశపెడుతుందని చెబుతున్నారు.


కనీసం రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఈ సిరీస్ నుంచి లాంచ్ కావచ్చని అభిప్రాయపడుతున్నారు. అందులో OnePlus Ace 5, Ace 5 Proలను కొత్త లైనప్‌లో తీసుకురావచ్చని తెలుస్తోంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని లీక్‌లను టిప్‌స్టర్ వదిలాడు. రాబోయే ఫోన్‌లో ప్రాసెసర్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ల గురించి అతను చెప్పాడు. GizmoChina ప్రకారం.. OnePlus Ace 5 సిరీస్‌లో సిరామిక్ బిల్డ్ క్వాలిటీను చూడవచ్చు. ఇందులో 6200 mAh బ్యాటరీని అందించే అవకాశం ఉందని తెలిపాడు.

Also Read: ఫ్యూచర్ రెడీ స్మార్ట్‌ఫోన్.. 6,100mAh బ్యాటరీ.. మరో విన్నర్..!


అంతేకాకుండా Ace 5లో ఉన్న బ్యాటరీకి మద్దతు ఇచ్చేందుకు ఇందులో 100 వాట్ ఛార్జింగ్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వదు. OnePlus Ace 5లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అందించే అవకాశం ఉంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చు. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌ ఉంటుంది. కొత్త OnePlus ఫోన్ Android 15 OSలో రన్ అవుతుంది.

OnePlus Ace 5 6.78 అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే అవకాశం ఉంది. OnePlus అలర్ట్ స్లైడర్‌ను కూడా ఇందులో అందించే అవకాశం ఉంది. OnePlus Ace 5 Pro ఈ సిరీస్‌లో టాప్ మోడల్‌గా ఉంటుందని తెలుస్తోంది. కానీ దాని గురించి ఇంకా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. ఫోన్‌లో సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్ ఇవ్వవచ్చని ఊహించబడింది. త్వరలోనే వీటికి సంబంధించిన కొన్ని అధికారిక ప్రకటనలు కంపెనీ నుంచి వెలువడే అవకాశం ఉంది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×