Bigg Boss 9 Telugu New Captain: బిగ్‌బాస్ రోజురోజుకు ఆసక్తి పెంచుతోంది. మాధురి ఎలిమినేషన్ తర్వాత పెద్దగా కంటెంట్ ఉండదేమో అని అంత అభిప్రాయపడ్డారు. కానీ, ఇప్పుడు అసలైన ఆట మొదలైంది. ఫినాలే దగ్గర అవుతున్న కొద్ది కంటెస్టెంట్స్‌లో తమ ఆట ఫుల్ ఫోకస్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఎవరి గేమ్ వాళ్లు ఆడుతూ ఎత్తు పైఎత్తులు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ షో తొమ్మిదవ సీజన్‌కి చేరుకుంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం పోరు జరుగుతుంది. వారం జరిగిన టాస్క్‌లో కెప్టెన్సీ కంటెండర్లుగా తనూజ, ఇమ్మాన్యుయేల్, రీతూ, భరణి, రాము రాథోడ్ రేసులో ఉండగా.. దివ్య, సుమన్ శెట్టి రెబల్స్ నుంచి కంటెండర్లుగా నిలిచారు.
రెబల్స్ మినహా మిగతా ఐదుగురిలో నలుగురు మాత్రమే కంటెండర్లు అవ్వాల్సి ఉండగా రాము రాథోడ్ స్వయంగా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నాడు. దీంతో తనూజ, రీతూ, ఇమ్మాన్యుయేల్, భరణి, దివ్య, సుమన్ శెట్టిలు కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఉన్నారు. ఇక వీరికి వీరికి ‘వే టూ కెప్టెన్సీ’ అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఈసారి కెప్టెన్సీ కంటెండర్లు కానీ వాళ్ల చేతిలో పెట్టాడు. ఇందులో భాగంగా ట్రైన్ ఇంజిన్‌లోకి కంటెండర్లు కాని వాళ్లు ఎక్కాలి. అందరినీ దాటుకొని ఎవరు అయితే అందులో చోటు దక్కించుకుంటారో వారికి రేసు నుంచి ఒకరిని తప్పించే పవర్ వస్తుంది. అలా మొదటి రౌండ్‌లో రేసు నుంచి భరణిని తప్పించారని సమాచారం.
నెక్ట్స్ రౌండ్‌లో సాయి ఇంజిన్‌లోకి ఎక్కి దివ్యని రేసు నుంచి ఔట్ చేశాడు. ఆ సమయంలో దివ్య పెద్ద గొడవ చేసింది. ఎందుకంటే ముందు దివ్య కంటే రీతూ పేరు చెప్పాడు సాయి. కానీ రీతూ మళ్లీ బతిమాలడంతో చివరికి దివ్యని రేసుని తొలగించాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి పోయాడు. చివరిగా రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్ మిగిలారు. దీంతో అంత ఇక తనూజ కెప్టెన్ అవుతుందని భావించారు. ఈసారి ఇంజనీ సీటు కళ్యాణ్ రావడంతో అతడు రీతూ, ఇమ్మాన్యుయేల్‌ని తొలగిస్తాడని అనుకున్నారు. ప్రొమోలు చూస్తే కూడా అలాగే అనిపించింది. ఇప్పటి వరకు విడుదల ప్రొమోలు చూస్తుంటే తనూజనే కెప్టెన్ అని అంతా ఫిక్స్ అయిపోయారు.
Also Read: SSMB29: ఎట్టకేలకు రాజమౌళి-మహేష్ మూవీ నుంచి అప్‌డేట్.. పృథ్వీరాజ్ ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
అయితే ఈ రౌండ్‌లో కళ్యాణ్ చీటింగ్ చేశాడు. తనకు దక్కించుకున్న ఇంజిన్ కుర్చీని దివ్యకి ఇచ్చాడు. దీంతో దివ్య తనూజని రేసు నుంచి తొలగించింది. పర్సనల్ రీజన్ వల్లే తనని తీసిందంటూ తనూజ దివ్యతో వాగ్వాదానికి దిగింది. కెప్టెన్సీ కోసం ఎన్నో వారాలకు తనూ కష్టపడుతుంది. చివరి వరకు వచ్చిన అడుగు దూరంలో కొల్పోతుంది. గత వారం, అంతకు ముందువారం ఇదే జరిగింది. ఈసారి కూడా దివ్య వల్ల తనూజ కెప్టెన్సీ చేజారింది. దీంతో ఫైనల్‌గా రీతూ, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ రేసులో నిలిచారు. వీరిద్దరికి పోటీ పెట్టగా ఇందులో ఇమ్మాన్యుయేల్ గెలిచి మరోసారి కెప్టెన్ అయినట్టు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే నేటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇదే నిజమైతే మాత్రం ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అవ్వడం ఇది మూడోసారి అవుతుంది. ఇక ఇప్పటి వరకు నామినేషన్‌లో రాని కంటెస్టెంట్ కూడా ఇమ్మాన్యుయేల్ అవ్వడం విశేషం.