Sujeeth: రన్ రాజా రన్ సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన సుజీత్ (Sujeeth)ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మొదటి సినిమాతోనే అవార్డులను సొంతం చేసుకున్న ఈయన తదుపరి సినిమాని ప్రభాస్ తో చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా సాహో, ఓజి వంటి సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సుజిత్ ప్రస్తుతం నాని హీరోగా బ్లడీ రొమియో (Bloody Romeo)అనే సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇదివరకే పూజా కార్యక్రమాలను కూడా ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా సుజిత్ తన సోషల్ మీడియా వేదికగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీనితో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. అభిమానులు క్రికెట్ దేవుడుగా భావించే సచిన్ టెండూల్కర్ ను సుజిత్ డైరెక్టర్ చేయబోతున్నారని తెలుస్తోంది. సచిన్ టెండూల్కర్ క్రికెట్ రంగంలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోని ఈయన ఎన్నో రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరొక అడ్వర్టైజ్మెంట్ యాడ్ షూట్ లో భాగంగా సచిన్ టెండూల్కర్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని సుజిత్ అందుకున్నారు.
సచిన్ టెండూల్కర్ టెక్నో పెయింట్స్ (Techno Paints)కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది. అయితే తాజాగా టెక్నో పెయింట్స్ కి సంబంధించిన యాడ్ షూట్ జరిగిందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే సచిన్ టెండూల్కర్ కు సీన్ వివరిస్తూ.. ఆయనతో కలిసి దిగిన ఫోటోలను సుజిత్ షేర్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో క్రికెట్ లవర్స్ ఈ ఫోటోలపై విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సుజిత్ ఇటీవల ఓజి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
నాని బ్లడీ రొమియో..
పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఓజి యూనివర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నాని బ్లడీ రొమియో షూటింగ్ పూర్తి అయిన వెంటనే సుజిత్ ఓజి సీక్వెల్ పనులను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన బ్లడీ రొమియో ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. నాని ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే సుజిత్ సినిమాలో పాల్గొంటారు. ప్యారడైజ్ సినిమా దాదాపు షూటింగ్ పనులను పూర్తి కావచ్చాయి. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదల చేయాలని ఆలోచనలు చిత్ర బృందం ఉన్నారు.
Also Read: Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!