ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్న నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మణికంఠుడి భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లేలా 60 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి నడిపే ప్రత్యేక రైళ్లను వివరాలను వెల్లడించింది. వీటి బుకిగ్స్ ఇవాళ్టి (నవంబర్ 7, 2025) నుంచి ప్రారంభం అయినట్లు తెలిపింది. అయ్యప్ప స్వాములు, భక్తులు ఈ రైళ్లను ఉపయోగించుకుని శబరిమలకు వెళ్లి రావచ్చని రైల్వే అధికారులు సూచించారు. ఇవి మచిలీపట్నం, నర్సాపురం, చర్లపల్లి నుంచి కొల్లం వరకు నడుస్తాయని తెలిపారు. ఈ రైలు సర్వీసులు నవంబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు అందుబాటులో ఉంటాయన్నారు.
SCR to run 60 #Sabarimala #SpecialTrains
Bookings for the Sabarimala Special Trains will be open tomorrow morning i.e., 07/11/2025 @ 08.00 hrs pic.twitter.com/U1xbjxkRPa
— South Central Railway (@SCRailwayIndia) November 6, 2025
మచిలీపట్నం- కొల్లాం ప్రత్యేక రైలు(07101) నవంబర్ 14, 21, 28, డిసెంబర్ 26, జనవరి 2న మచిలీపట్నం నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు కొల్లాం చేరుకుంటారు. అటు కొల్లాం- మచిలీపట్నం ప్రత్యేక రైలు (07102) నవంబర్ 16,23, 30, డిసెంబర్ 28, జనవరి 4న కొల్లాం నుంచి బయల్దేరి మరుసటి రోజు మచిలీపట్నం చేరుకుంటుంది.
మచిలీపట్నం- కొల్లాం స్పెషల్ రైలు (07103) డిసెంబర్ 5, 12, 19, జనవరి 9, 16తేదీల్లో మచిలీపట్నం నుంచి బయల్దేరనుంది. ఈ రైలు పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, రేణిగుంట జంక్షన్ మీదుగా కొల్లాం చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు (నంబర్ 07104) డిసెంబర్ 7, 14, 21, జనవరి 11, 18 తేదీల్లో కొల్లాం నుంచి బయల్దేరి మరుసటిరోజు మచిలీపట్నం చేరుకుంటుంది.
నర్సాపూర్- కొల్లాం స్పెషల్ రైలు (07105) నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18 తేదీల్లో నర్సాపూర్ నుంచి బయల్దేరనుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం, విజయవాడ మీదుగా, తెనాలి, గూడూరు, రేణిగుంట జంక్షన్ మీదుగా కొల్లాం చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి (07106) నవంబర్ 18, 25, డిసెంబర్ 2, 9, 16, 23, 30, జనవరి 6, 13, 20 తేదీల్లో బయల్దేరి మరుసటిరోజు నర్సాపూర్ చేరుకుంటుంది.
చర్లపల్లి- కొల్లాం ప్రత్యేక రైలు(07107)- నవంబర్ 17, 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి బయల్దేరనున్నాయి. ప్రత్యేక రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల మీదుగా గుంటూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతాయి. కొల్లాం నుంచి ఇదే రైలు (07108)- నవంబర్ 19, 26, డిసెంబర్ 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21 తేదీల్లో చర్లపల్లికి బయల్దేరుతాయి.
Read Also: ఇక ఆ వందే భారత్ రైలు నరసాపురం వరకు పొడిగింపు, ప్రయాణికులకు పండగే!