ఐ వేర్ దిగ్గజ సంస్థ లెన్స్ కార్ట్ దేశీ మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్ గ్లాసెస్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ AI-ఆధారితంగా పని చేయనున్నాయి. ప్రస్తుతం ఈ గ్లాసెస్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ గ్లాసెస్ లోని AI టెక్నాలజీ.. వినియోగదారులకు మరిన్ని సేవలు అందించనున్నాయి. ముఖ్యంగా ఈ స్మార్ట్ గ్లాసెస్ లోని అప్లికేషన్లలో ఫుడ్ డెలివరీ, వినోదం, ఫిట్ నెస్ ట్రాకింగ్, డిజిటల్ చెల్లింపులు కూడా ఉండవచ్చు. స్మార్ట్ గ్లాసెస్ ను ఫ్యాషన్ యాక్సెసరీ నుంచి మల్టీ పర్పస్ యూసేజ్ ప్లాట్ ఫామ్ గా మార్చడమే లక్ష్యం అని లెన్స్ కార్ట్ ప్రకటించింది. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, AI టెన్నాలజీని కలిపే ఫస్ట్ ఇండియన్ వేరబుల్ ఎకో స్టిస్టమ్ గా స్మార్ట్ గ్లాసెస్ గా ఇవి గుర్తింపు పొందనున్నట్లు వెల్లడించింది.
లెన్స్ కార్ట్ స్మార్ట్ గ్లాసెస్ పూర్తిగా ఇండియాలో తయారు చేయబడుతున్నాయి. డిసెంబర్ 2025 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ గ్లాసెస్ 40 గ్రాముల బరువు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కంపెన ప్రొడక్ట్స్ కంటే కంటే దాదాపు 20 శాతం తేలికగా ఉంటుంది. ఇది క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ AR1 Gen 1 చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. హ్యాండ్స్ ఫ్రీ ఫోటో, వీడియో క్యాప్చర్ కోసం సోనీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ గ్లాసెస్ లో జెమిని 2.5 లైవ్ ద్వారా పవర్ ఇచ్చే AI అసిస్టెంట్ ఉంది. ఇది వాయిస్ కమాండ్స్, UPI చెల్లింపులు, రియల్-టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్, వెల్ నెస్ ట్రాకింగ్ కు సపోర్ట్ చేస్తుంది. లెన్స్ కార్ట్ ఓమ్నిఛానల్ రిటైల్ నెట్ వర్క్ ద్వారా దీనిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. కంపెనీ తన టెక్నాలజీ ఆఫర్లను బలోపేతం చేయడానికి అజ్నా లెన్స్ తో సహా XR, AI స్టార్టప్ లలో కూడా పెట్టుబడి పెట్టింది. 2030 నాటికి గ్లోబల్ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్ USD 4-5 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా వేసిన టెక్ విశ్లేషకులను లెన్స్ కార్ట్ ఎగ్జాంపుల్ గా చూపించింది. భారత్ ఐవేర్ రంగంలో కీలక మార్కెట్ గా ఉంటుందని అభిప్రాయపడింది.
Read Also: గూగుల్ మ్యాప్స్ నుంచి క్రేజీ ఫీచర్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
అటు అక్టోబర్ 31న బిడ్డింగ్ కోసం ప్రారంభమైన లెన్స్ కార్ట్ IPO విలువ రూ. 7,278 కోట్లుగా నిర్ణయించబడింది. వాల్యుయేషన్లపై ఆందోళనలు ఉన్నప్పటికీ, గ్రే మార్కెట్ లిస్టింగ్‌కు సానుకూల సూచనను చూపుతోంది. లెన్స్‌కార్ట్ బలమైన బ్రాండ్ ఉనికి, మార్క్యూ పెట్టుబడిదారులను గమనిస్తూనే విస్తరించిన వాల్యుయేషన్ల గురించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సబ్ స్క్రిప్షన్ వ్యవధి ముగిసినందున, పెట్టుబడిదారులు IPO కేటాయింపు తేదీ కోసం వేచి చూస్తున్నారు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్ పట్టేయండి!