E-Paper
Advertisement

Oppo K13 Turbo Price Drop: ఇంతకంటే మంచి అవకాశం మళ్లీరాదు బాసూ.. అమెజాన్‌లో ఒప్పో K13 టర్బోపై మతిపోయే డిస్కౌంట్!

Oppo K13 Turbo Price Drop: ఇంతకంటే మంచి అవకాశం మళ్లీరాదు బాసూ.. అమెజాన్‌లో ఒప్పో K13 టర్బోపై మతిపోయే డిస్కౌంట్!
Advertisement

Oppo K13 Turbo Price Drop: మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోరుకుంటున్నవారికి ఈ ఆఫర్ మేలు చేస్తుంది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో Oppo K13 Turbo అతి తక్కువ ధరకే లభిస్తుంది. పవర్‌ఫుల్ బ్యాటరీ, ఆకట్టుకునే డిస్‌ప్లే, హై క్వాలిటీ కెమెరా సెటప్‌తో 2025 చివర్లో విడుదలైన ఈ ఫోన్ ఇప్పటికీ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ను కలిగి ఉంది. ఇప్పుడీ డివైజ్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

ఈ Oppo K13 Turbo.. 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.25,198 ధరకే వచ్చేస్తోంది. దీని అసలు లాంచ్ ధర రూ.27,999తో పోలిస్తే దాదాపు రూ.2,700 వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతోపాటు స్కాపియా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే.. 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌నూ పొందొచ్చు. దీని ద్వారా గరిష్టంగా రూ.1,500 వరకు తగ్గింపు లభించడంతో Oppo K13 Turbo ఫోన్ ధర సుమారు రూ.23,938కి దిగుతుంది. మొత్తంగా చూస్తే.. రూ.4,000కి పైగా ఆదా చేసుకోవచ్చు.

Advertisement

Also Read: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలా? జనవరిలో మోస్ట్ ట్రెండ్ అవుతున్న ఆండ్రాయిడ్ మొబైల్స్ లిస్ట్ ఇదే!

అలాగే అమెజాన్‌లో ఒప్పో K13 టర్బో ఎక్స్‌చేంజ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్ ఇచ్చి గరిష్టంగా రూ.23,800 వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ విలువ మీ పాత డివైజ్ కండీషన్, మోడల్, పనితీరుపై ఆధారపడి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి.

Advertisement

ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ఒప్పో K13 టర్బో 6.8 అంగుళాల LTPS AMOLED డిస్‌ప్లే, 1280 x 2800 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. దీంతో రీల్స్ స్క్రోలింగ్, బిగ్ స్క్రీన్ ద్వారా వీడియోను చూసే అనుభూతిని పొందవచ్చు. పీక్ బ్రైట్‌నెస్ 1,600 నిట్స్ వరకు ఉండటం వల్ల ఎండలో సైతం డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది.

Oppo K13 Turbo ఫోన్.. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆక్టా‌కోర్ చిప్‌సెట్ డైలీ యూజ్‌తో పాటు మల్టీటాస్కింగ్‌ను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15, కలర్OS 15 లభిస్తాయి. 7,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఫోన్ 80W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీంతో ఒక్కసారి చార్జ్ చేస్తే ఎక్కువసేపు ఉపయోగించుకోవచ్చు.

ఇకపోతే కెమెరా సెటప్ కూడా ఈ ఫోన్‌కు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, హై క్వాలిటీ ఫొటోల కోసం 2MP సెకండరీ సెన్సార్ అందించారు. అలాగే ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది వీడియో కాల్స్‌కు మరింత మెరుగైన విధానంలోకి తీసుకొస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G సపోర్ట్‌తో పాటు Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

Also Read: నీటిలో మునిగిపోయినా ఏం ఫర్లేదు.. మార్కెట్‌ను షేక్ చేయనున్న వాటర్‌ప్రూఫ్ మొబైల్స్ ఇవే!

 

 

 

 

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×