E-Paper
Advertisement

Central Bank of India: రూ.85,920 జీతంలో భారీగా ఉద్యోగాలు.. ఇంకా వారం రోజులే గడువు

Central Bank of India: రూ.85,920 జీతంలో భారీగా ఉద్యోగాలు.. ఇంకా వారం రోజులే గడువు
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం 350 ఫారెన్ ఎక్స్ఛేంజ్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 3 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 350

Advertisement

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు:

ఫారెన్ ఎక్స్ ఛేంజ్ ఆఫీసర్: 50 పోస్టులు

మార్కెటింగ్ ఆఫీసర్: 300 పోస్టులు

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జాబ్ లోకేషన్: దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

విద్యార్హత: డిగ్రీ, ఎంబీఏ పాసై ఉంటే సరిపోతుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2026 జనవరి 20

దరఖాస్తుకు చివరి తేది: 2026 ఫిబ్రవరి 3

ఎగ్జామ్ తేదీలు: 2026 ఫిబ్రవరి, మార్చి

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఫారెన్ ఎక్స్ ఛేంజ్ ఆఫీసర్ ఉద్యోగానికి రూ.85,920 నుంచి రూ.1,05,280 వరకు జీతం ఉంటుంది. మార్కెటింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి రూ.48,480 నుంచి రూ.85,920 జీతం ఉంటుంది.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్దారించారు. ఫారెన్ ఎక్స్ ఛేంజ్ ఆఫీసర్ ఉద్యోగానికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి 22 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: centralbankofindia.bank.in 

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 350

దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 3

ALSO READ: ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. డోంట్ మిస్ గోల్డెన్ అపార్చునిటీ..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×