E-Paper
Advertisement

Nord Buds 4 Pro: 54 గంటల బ్యాటరీ, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్‌తో వన్‌ప్లస్ న్యూ బడ్స్ లాంచ్.. ధర కూడా తక్కువే!

Nord Buds 4 Pro: 54 గంటల బ్యాటరీ, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్‌తో వన్‌ప్లస్ న్యూ బడ్స్ లాంచ్.. ధర కూడా తక్కువే!
Advertisement

Nord Buds 4 Pro: టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ సరికొత్త ఆడియో ప్రొడక్ట్ ‘Nord Buds 4 Pro’ ఫైనల్‌గా ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రీమియం ఫీచర్లను సామాన్యులకు కూడా అందుబాటులో తీసుకురావాలనే లక్ష్యంతో, వన్‌ప్లస్ దీని ధరను కేవలం రూ.3,999గా నిర్ణయించింది. మార్చి 23 నుంచి ప్రముఖ ఇ-కామర్స్ సైట్‌లతో పాటు వన్‌ప్లస్ స్టోర్లలో ఇవి సందడి చేయనున్నాయి. అంతేకాదు.. లాంచ్ ఆఫర్ కింద కస్టమర్లు వీటిని కేవలం రూ.3,799కే సొంతం చేసుకోవచ్చు.

55dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్:

ఈ Nord Buds 4 Proలో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన ఫీచర్.. 55dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇది బయటి అనవసరమైన శబ్దాలను పూర్తిగా అడ్డుకుని, మీకు ప్రశాంతమైన, మ్యూజిక్ అనుభవాన్ని అందిస్తుంది. 12mm డైనమిక్ డ్రైవర్స్‌తో కూడిన ఈ బడ్స్, LHDC 5.0 హైరెస్ ఆడియోను సపోర్ట్ చేస్తాయి. దీనివల్ల పాటల్లోని ప్రతి చిన్న మ్యూజిక్ నోట్ కూడా ఎంతో స్పష్టంగా వినిపిస్తుంది. బ్లూటూత్ 6.0 టెక్నాలజీతో వేగవంతమైన కనెక్టివిటీ, గూగుల్ ఫాస్ట్ పెయిర్ సౌలభ్యం కూడా ఇందులో ఉన్నాయి.

Advertisement

Also Read: బరువు తగ్గించేందుకు.. కొండ చిలువ రక్తం, ఇదిగో ఇలా పనిచేస్తుందట!

రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్:

డిజైన్ పరంగా కూడా వన్‌ప్లస్ ఈసారి చాలా కేర్ తీసుకుంది. పాత మోడల్ కంటే 10% చిన్నదైన, స్లిమ్ అండ్ లైట్ వెయిట్ ఓవల్ షేప్ కేస్ చేతిలో ఇమిడిపోతుంది. ఒక్కో ఇయర్‌బడ్ బరువు కేవలం 4.4 గ్రాములు మాత్రమే. కాబట్టి రోజంతా చెవుల్లో పెట్టుకున్నా ఏమాత్రం భారం అనిపించదు. ఇందులో ఉన్న AI అసిస్టెంట్ ద్వారా వాతావరణ అప్‌డేట్స్, రిమైండర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ‘హేమెలడీ’ యాప్ ద్వారా వివిధ అంతర్జాతీయ భాషలను రియల్ టైమ్‌లో అనువదించుకునే ఫీచర్ యూజర్లకు సరికొత్త అనుభవాన్ని ఇస్తుంది.

54 గంటల నాన్‌స్టాప్ ప్లేబ్యాక్:

Advertisement

బ్యాటరీ విషయంలో కూడా ఈ బడ్స్ చాలా పవర్ఫుల్. కేస్‌తో కలిపి మొత్తం 54 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను ఇది అందిస్తుంది. ఒకవేళ అర్జెంట్‌గా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే.. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో ఏకధాటిగా 13 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు. IP55 రేటింగ్‌తో నీరు, చెమట నుండి రక్షణ ఉంటుంది కాబట్టి.. వర్కవుట్స్ సమయంలో కూడా ప్రశాంతంగా వాడుకోవచ్చు.

Also Read: మళ్లీ వచ్చేస్తోంది అమెజాన్ ట్రాన్స్‌ఫార్మర్.. ఈ ఏఐ ఫోన్‌లో యాప్స్ అక్కర్లేదు!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×