E-Paper
Advertisement

Nagachaitanya: నా జీవితంలో ఇది ప్రత్యేకమైన ప్రయాణం.. నాగచైతన్య ఆసక్తికర పోస్ట్..

Nagachaitanya: నా జీవితంలో ఇది ప్రత్యేకమైన ప్రయాణం.. నాగచైతన్య ఆసక్తికర పోస్ట్..
Advertisement

Nagachaitanya: అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నటుడు నాగచైతన్య ఇటీవల కాలంలో మంచి కథలను ఎంపిక చేసుకుంటూ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇటీవల నాగచైతన్య తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన తదుపరి పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వృషకర్మ (Vrusha Karma)అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఉత్తమ నటుడిగా నాగచైతన్య..

ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డు(Gaddar Film Award) కార్యక్రమంలో భాగంగా నాగచైతన్య ఉత్తమ నటుడిగా తండేల్ (Thandel) సినిమాకు గాను గద్దర్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఇలా నాగచైతన్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నటుడు రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడమే కాకుండా వేదికపై అవార్డు రావడం పట్టణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈయన తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా గద్దర్ అవార్డు రావడం గురించి బావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు.

గద్దర్ ఫిలిం అవార్డు గౌరవంగా ఉంది..

Advertisement

ఈ సందర్భంగా నాగచైతన్య గద్దర్ ఫిలిం అవార్డు అందుకున్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ.. తండేల్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా గద్దర్ ఫిలిం 2025 అవార్డును అందుకోవడం చాలా గౌరవంగా ఉంది.ఈ సినిమా తన సినీ కెరీర్ లోనే ఒక అత్యంత ప్రత్యేకమైన ప్రయాణం. ఇలాంటి ఒక అద్భుతమైన కథలో భాగమై, నిజజీవిత కథను తెరపైకి తీసుకువచ్చే అవకాశాన్ని కల్పించినందుకు ఎంతో సంతోషంగా భావిస్తున్నానని ఈయన తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు అలాగే తనకు ఇలాంటి ఒక గౌరవమైన పురస్కారాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం నటుడు రామ్ చరణ్ అలాగే గద్దర్ ఫిలిం అవార్డు జ్యూరీకి ఈయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

ఇలా తండేల్ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో నాగచైతన్య తదుపరి వృషకర్మ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని ఈ ఏడాది జూన్ లేదా జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య విభిన్నమైన పాత్రలో ఒక యోధుడిగా కనిపించబోతున్నారనే చెప్పాలి. నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. నాగచైతన్య సినీ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read: Vijay Rashmika: హనీమూన్ కోసం థాయిలాండ్ వెళ్ళిన విరోష్… వైరల్ అవుతున్న ఫోటో!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×