E-Paper
Advertisement

CM Revanth Reddy: రేపు సిద్ధిపేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: రేపు సిద్ధిపేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy:  ఈనెల 22 ఆదివారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మేట లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో గత మూడు రోజులుగా రైతు మహోత్సవాలు జరుగుతున్నాయి. రైతు మహోత్సవాలకు వివిధ జిల్లాల నుండి భారీగా రైతులు తరలివస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన 150 స్టాల్ లలో వ్యవసాయ యాంత్రీకరణ, ఆయిల్ ఫామ్ తోటల పెంపకంలో మెలుకువలు ,వ్యవసాయం తో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యానవన, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల ద్వారా అధిక దిగుబడి సాధించడానికి శాస్త్రవేత్తల ద్వారా మెలుకువలు నేర్చుకోవడంతో ఆధునిక వ్యవసాయాన్ని అవగాహన చేసుకుంటున్నారు.

Also Read: Ban On Rashid Khan: రషీద్ ఖాన్ కు బిగ్ షాక్‌.. ఆఫ్ఘనిస్తాన్‌లోకి రాకుండా బ్యాన్ వేసిన‌ తాలిబన్స్ !

ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం

Advertisement

రేపు 22 మార్చ్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు నర్మేట లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం పై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ,పోలీస్ కమిషనర్ ,అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించి పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శిస్తారు.తెలంగాణ లో మొట్టమొదటి ఆయిల్ రిఫైనరీ కి శంకుస్థాపన చేస్తారు. సభ కి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు సూచనలు చేశారు. హెలిపాడ్ , సభ వేదిక , భద్రత, తాగు నీరు , ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్ ,విద్యుత్ ,సౌండ్ సిస్టమ్, ఫైర్,అంబులెన్స్ తదితర వాటిపై అధికారులకు సూచనలు చేశారు.

Also Read:Fuel Crisis: మీ జేబు ఖాళీ అవ్వకముందే ఇది చదవండి.. యుద్ధం తెస్తున్న ధరల సునామీ 

Related News

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

Big Stories

Advertisement
×