BigTV English

OnePlus Nord CE4 Lite 5G: వన్‌ప్లస్ నుండి బడ్జెట్ కిల్లర్.. ఫోన్‌లో సోనీ కెమెరా పెట్టారు.. విశ్వరూపం చూపిస్తుంది..!

OnePlus Nord CE4 Lite 5G: వన్‌ప్లస్ నుండి బడ్జెట్ కిల్లర్.. ఫోన్‌లో సోనీ కెమెరా పెట్టారు.. విశ్వరూపం చూపిస్తుంది..!

OnePlus Nord CE4 Lite 5G: OnePlus మొబైల్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వన్‌ప్లస్ నార్డ్ CE 4 Lite చాలా మంది ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్. ఈ OnePlus Nord CE 4 Lite స్మార్ట్‌ఫోన్ జూన్ 24 లాంచ్ అవుతుంది. ఈ ఫోన్‌ను బడ్జెట్ ప్రైస్‌లో తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీని ఫస్ట్ లుక్ ఈ రోజు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో రివీల్ చేశారు. ఈ ఫోన్ లాంచ్ వివరాలు, ఫీచర్ల తదితర వివరాల గురించి తెలుసుకుందాం.


వన్‌ప్లస్ బడ్జెట్ సెగ్మెంట్‌లో Nord లైనప్‌లో దాని అత్యంత పవర్‌ఫుల్ ఫీచర్స్ గల Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తుంది. ఈ ఫోన్ ఫీచర్ల గురించి కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. అమెజాన్‌లో దీని పోస్టర్ లైవ్ అవుతుంది. అయితే గతంలో జూన్ 18న ఫోన్ లాంచ్ అవుతుందని చాలా మంది యూజర్లు భావించారు. ప్రస్తుతం దీని ఫస్ట్ లుక్ మాత్రమే కస్టమర్లు, వన్‌ప్లస్ అభిమానులకు అందుబాటులోకి వచ్చింది.

Also Read: బంపర్ ఆఫర్.. రియల్‌మీ ఫోన్‌పై డిస్కౌంట్ల జాతర.. రూ.387కే దక్కించుకోవచ్చు!


వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్ Nord CE4 Lite 5G వచ్చే వారం లాంచ్ అవుతుంది. రెండు రోజుల క్రితం వరకు స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేది గురించి అనేక లీక్స్ హల్‌చల్ చేశాయి. ఇప్పుడు దాని అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 24 సాయంత్రం 7 గంటలకు లాంచ్ అవుతుంది. OnePlus Nord CE 3 Lite 5G సక్సెసర్‌గా ఈ ఫోన్ మార్కెట్‌లోకి వస్తుంది. ఇది Qualcomm చిప్‌సెట్‌ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.

వన్‌ప్లస్ Nord CE 4 Lite 5G వెనుక ప్యానెల్ అమెజాన్ మైక్రోసైట్‌లో లైవ్ అవుతుంది. దీనిలో డ్యూయల్ కెమెరా సెటప్ డ్యూయల్ LED ఫ్లాష్‌తో ఉంటుంది. కంపెనీ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ మెగా బ్లూ కలర్‌ను టీజ్ చేసింది. ఫోన్‌కు 8GB RAM+128GB ఇంటర్న్ స్టోరేజ్‌తో వస్తుంది. కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ.20,000 కంటే తక్కువగా ఉంచవచ్చు. అదనంగా ఇది టెక్ బ్లూ, బ్లాక్ కాస్మోస్ కలర్ ఆప్షన్లలో కూడా రావచ్చు.

Also Read: రేపే లాస్ట్.. రూ.9 వేల లోపే కొత్త ఫోన్లు.. డబ్బులు తగలెయ్యకండి..!

వన్‌ప్లస్ Nord CE 4 Lite 5G కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఈ ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో Sony LYTIA కెమెరా ఉండవచ్చని టీజర్‌ ద్వారా తెలుస్తుంది. డ్యూయల్ కెమెరా మాడ్యూల్‌లో 50MP Sony LYT-600 మెయిన్ కెమెరా సెటప్‌తో మీరు బడ్జెట్ సెగ్మెంట్‌లో అద్భుతమైన ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీని ఆనందిస్తారు. లీక్‌ల ప్రకారం 2MP డెప్త్ కెమెరా కాకుండా ఇందులో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలానే దీని 5500mAh బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌‌కు సపోర్ట్ ఇస్తుంది.

Tags

Related News

Nothing Phone Discount: నథింగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్‌పై సూపర్ ఆఫర్.. రూ.35000 డిస్కౌంట్.. ఎక్స్‌ఛేంజ్ లేకుండానే!

No network Simcard: ఫోన్‌లో సిమ్ కార్డ్ ఉన్నా నెట్ వర్క్ చూపించడం లేదా? ఇవే కారణాలు..

Samsung Copy Iphone: ఆపిల్ ఫోన్ డిజైన్ కాపీ కొట్టిన శాంసంగ్.. అచ్చం ఐఫోన్ లాగే గెలాక్సీ S26 ఎడ్జ్!

Swiggy High Bill: రెస్టారెంట్ కంటే స్విగ్గీ బిల్లు 81 శాతం ఎక్కువ.. ఆన్ లైన్ డెలివరీతో జేబుకి చిల్లు

Amazon Prime: అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు బ్యాడ్ న్యూస్.. అక్టోబర్ 1 నుంచి ఆ ఫీచర్ తొలగింపు

Smartphone Comparison: వివో T4 ప్రో vs రియల్‌మీ 15 vs నథింగ్ ఫోన్ 3a.. రూ.30000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

×