BigTV English

Mobile Offers Ends Tomorrow: రేపే లాస్ట్.. రూ.9 వేల లోపే కొత్త ఫోన్లు.. డబ్బులు తగలెయ్యకండి!

Mobile Offers Ends Tomorrow: రేపే లాస్ట్.. రూ.9 వేల లోపే కొత్త ఫోన్లు.. డబ్బులు తగలెయ్యకండి!

Bonanza Sale Ends Tomorrow: ఫ్లిప్‌కార్ట్‌లో మెగా బొనాంజా సేల్ జరుగుతున్న విషయం మనందిరికే తెలిసిందే. అయితే ఈ సేల్ జూన్ 19న ముగియనుంది. బొనాంజా సేల్‌లో భారీ క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లతో ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లను రూ.9 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఫోన్లపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ ఫోన్‌లలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 6000mAh బ్యాటరీ ఉంటుంది.


Samsung Galaxy F14 5G
సామ్‌సంగ్ గెలాక్సీ F14 5G ఫోన్ GOAT గ్రీన్ కలర్ వేరియంట్ 4 GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ. 8,990 సేల్‌లో అందుబాటులో ఉంది. మీరు ఫోన్‌ కొనుగోలు చేయడానికి సామ్‌సంగ్ యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫినిట్ లేదా సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: కత్తిలాంటి ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్.. చుక్కలు చూపిస్తుంది!


అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపు చేసే ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు కంపెనీ 5శాం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది.అంతేకాకుండా సులభమైన EMIలో కూడా ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.4,450 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ ఫోన్‌లో మీరు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 6000mAh బ్యాటరీతో 6.6 అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లే ఉంటుంది.

Samsung Galaxy A05
సామ్‌సంగ్ గెలాక్సీ A05 స్మార్ట్‌ఫోన్ 4 GB RAM +64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.8299. రూ.1,000 డిస్కౌంట్‌‌తో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. దీని కోసం మీరు SBI కార్డు ద్వారా చెల్లింపు చేయాలి. HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్‌తో EMIపై కొనుగోలు చేయడం ద్వారా మీరు రూ. 1500 వరకు బెనిఫిట్ పొందుతారు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.ఈ ఫోన్ EMI రూ. 292 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది.

Also Read: ఆహా ఏముంది .. ఐక్యూ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. అరాచకం మావ!

Samsung Galaxy M14
ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఫోన్ రూ.8778కి సేల్‌లో అందుబాటులో ఉంది. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి SBI కార్డును ఉపయోగిస్తే మీకు రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు కంపెనీ 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. మీరు HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్‌తో EMI ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు బెనిఫిట్ పొందవచ్చు. దీని EMI రూ. 309 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌లో మీరు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 6000mAh బ్యాటరీని పొందుతారు.

Related News

Mouse Spying: మీ కంప్యూటర్ మౌస్ మీ రహస్యాలను వింటోంది.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

ChatGPT UPI payments: పేమెంట్ యాప్‌లు మర్చిపోండి! ఇక చాట్‌జీపీటీతోనే చెల్లింపులు

Samsung Phone: గెలాక్సీ వినియోగదారులకు సర్‌ప్రైజ్‌.. వన్‌యూఐ 8.5 అప్‌డేట్‌ రాబోతోంది!

Control Z iPhone: రూ7,999కే ఐఫోన్.. దీపావళి సేల్‌లో కళ్లుచెదిరే ఆఫర్లు

Flipkart Nothing Phone 3: ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో గందరగోళం.. మండిపడుతున్న కస్టమర్లు

iPhone 17 Pro Alternatives: ఐఫోన్ 17 ప్రో కంటే ఈ ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్స్ బెటర్..

PS5 Ghost Of Yotei: జాక్ పాట్ కొట్టిన సోనీ కంపెనీ.. రికార్డ్‌లు బద్దలుకొట్టిన ఓజీ తరహా గేమ్

OPPO F31 5G Mobile: రూ.5,000 తగ్గింపుతో OPPO F31 5G వచ్చేసింది.. ఇంత తక్కువ ధరలో ఈ ఫీచర్లలా?

Big Stories

×