BigTV English

Lucky Bhaskar First Single : “కోపాలు చాలండి శ్రీమతిగారు..” లక్కీ భాస్కర్ నుంచి ఫస్ట్ సింగిల్ సూపర్

Lucky Bhaskar First Single : “కోపాలు చాలండి శ్రీమతిగారు..” లక్కీ భాస్కర్ నుంచి ఫస్ట్ సింగిల్ సూపర్

Lucky Bhaskar First Single(Cinema news in telugu): వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో.. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తెరకెక్కుతోన్న సినిమా లక్కీ భాస్కర్. ఈ సినిమాలో అయేషాఖాన్ అనే మరో హీరోయిన్ కూడా నటిస్తోంది. దుల్కర్ – మృణాల్ నటించిన సీతారామం తెలుగు ఆడియన్స్ కు బాగా నచ్చేసింది. ఇప్పటికీ ఆ సినిమా బోర్ కొట్టకుండా చూస్తారు. ఇప్పుడు కాస్త అదే బ్యాక్ డ్రాప్ లో లక్కీ భాస్కర్ సినిమా వస్తుండటంతో.. ఈ సినిమాపై కాస్త అంచనాలు ఉన్నాయి. సార్ సినిమా తర్వాత వెంకీ అట్లూరి తీస్తున్న చిత్రమిది.


తాజాగా లక్కీ భాస్కర్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూలవ్వండి మేడమ్ గారు.. అంటూ మొదలయ్యే పాట చాలా బాగుంది. ఈ పాట ప్రొమోను నిన్న విడుదల చేయగా.. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. కాగా.. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. లక్కీ భాస్కర్ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ OG కూడా అదే నెలలో విడుదల కానుంది. పవన్ కు పోటీగా వస్తున్న దుల్కర్.. ఆ పోటీని తట్టుకుని నిలబడగలడో లేదో చూడాలి.


Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×