E-Paper
Advertisement

TDP vs YCP : రప్పా రప్పా మళ్లీ మొదలెట్టిన వైసీపీ.. తగ్గేదెలే అన్న టీడీపీ!

TDP vs YCP : రప్పా రప్పా మళ్లీ మొదలెట్టిన వైసీపీ.. తగ్గేదెలే అన్న టీడీపీ!
Advertisement

ఏపీలో మరోసారి రప్పా రప్పా రాజకీయ స్లోగన్స్ మారుమోగాయి. అంతటితో ఆగకుండా జంతుబలులు కూడా చోటుచేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైతే సదరు బహిరంగంగా జంతుబలులు ఇస్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారో వారికి పోలీసులు తగిన గుణపాఠం చెప్పారు. 2029 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావాలని నినాదాలు చేస్తూ వచ్చాకే రప్పా రప్పే అంటే కొందరు వైసీపీ శ్రేణులు నినాదాలు చేసినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది. గతంలోనూ ఇలాగే జగన్ నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఓ వైసీపీ అభిమాని పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘ఈసారి రప్పా రప్పే..గొంతులు కొస్తాం’ అనే అర్ధం వచ్చేలా ఫ్లెక్సీలు ప్రదర్శించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరల్ అయ్యింది.

జగన్ పుట్టిన రోజున జంతు బలులు..

మూడ్రోజుల కిందట వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు.. ఆరోజున కొందరు వైసీపీ శ్రేణులు అత్యుత్సాహానికి పాల్పడ్డారు. గోదావరి జిల్లాల్లో కొందరు వైఎస్ జగన్ ఫ్లెక్సీ బోర్డుల ఎదుట గొర్రె, మేకలను బహిరంగంగా బలి ఇచ్చారు. ఇది స్థానికంగా పలువురిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది.వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయడాన్ని పలువురు తీవ్రంగా ఆక్షేపించారు.ఇలాంటి సంప్రదాయం నేటి రాజకీయాలకు మంచిది కాదని, రక్తపాతాన్ని కోరుకుంటున్నారా? అని మరికొందరు విమర్శిస్తున్నారు.ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత సైతం సీరియస్ అయ్యారు. జగన్ తన పార్టీ కార్యకర్తలకు ఇదేనా నేర్పించేది.. కంట్రోల్ చేయలేరా? అని మండిపడ్డారు.

తగిన గుణపాఠం చెప్పిన పోలీసులు..

Advertisement

జంతు బలులపై ఫిర్యాదు అందండంతో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఈస్ట్ చోడవరం పోలీసులు రంగంలోకి దిగారు. జగన్ ఫ్లెక్సీ ఎదుట జంతు బలి చేసి ప్రజలను భ్రయభ్రాంతులకు గురిచేసిన ఏడుగురిని అరెస్టు చేశారరు. అనంతరం వారిని నడిరోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా పండుగలు, జాతర సమయంలో బలులు ఇస్తారని అందరికీ తెలుసు. వ్యక్తి పూజ పేరుతో జంతు బలులు ఇవ్వడం సమంజసం కాదని జంతు ప్రేమికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తగ్గేదేలే అంటున్న టీడీపీ..

వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ మళ్లీ సీఎం అవుతారని కలలు కంటున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఎద్దేవాచేశారు. జగన్ అధికారంలోకి రావడం కలే అని విమర్శించారు.ఆయన అధికారంలోకి వస్తే మరసారి రౌడీ రాజకీయాలు చేద్దామని వైసీపీ శ్రేణులు అనుకుంటున్నారని.. తమ నేతల మనోధైర్యం దెబ్బతినేలా పదేపదే రప్పా రప్పా నినాదాలు చేస్తున్నారని.. గతంలో నడిచింది కానీ ఈసారి వారి పప్పులు ఉడకవని.. ఎందుకంటే అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు.మరోవైపు జంతు బలుల సంప్రదాయాన్ని మొదలెట్టిందే టీడీపీ అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. జగన్ ఇప్పటికైనా తమ కేడర్, నేతలను తప్పులు చేయకుండా నియంత్రించాలని లేదంటే చట్టం తన పని చేసుకుంటూ పోతుందని తెలుగు తమ్ముళ్లు పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు.

Advertisement

 

Related News

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Big Stories

Advertisement
×