E-Paper
Advertisement

Top 20 News:  క్షుద్రపూజ పేరుతో మోసపోయిన దంపతులు…యాదాద్రిలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Top 20 News:  క్షుద్రపూజ పేరుతో మోసపోయిన దంపతులు…యాదాద్రిలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

1. విజన్ డాక్యుమెంట్-2047 అగ్రి చాప్టర్ తుది రూపకల్పన

విజన్ డాక్యుమెంట్-2047లోని అగ్రి చాప్టర్ తుది రూపకల్పనపై అధికారులతో సమావేశమయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడంలో వ్యవసాయ రంగం ప్రధాన భూమిక వహిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగ ఉజ్వల భవిష్యత్తు కోసం పొందుపర్చాల్సిన కార్యక్రమాల వివరాలపై చర్చించారు మంత్రి.

 

2. కాళోజీ యూనివర్సిటీపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం

కాళోజీ యూనివర్సిటీలో అక్రమాల పేరుతో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అన్నారు కాళోజీ యూనివర్సిటీ వీసీ నందకుమార్‌రెడ్డి. కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. యూనివర్సిటీలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. తాము యూనివర్సిటీకి మంచి పేరు తెచ్చేందుకే పనిచేశామన్నారు వీసీ.

 

3. ఖమ్మం జిల్లాలో తాత్కాలికంగా మీసేవల్లో అంతరాయం

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మీసేవల్లో తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. రెండు వారాలుగా మీసేవ కేంద్రాల్లోని వెబ్‌సైట్స్ మొరాయిస్తున్నాయి. డెత్, బర్త్ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ అప్డేట్ సంబంధించి సవరణ చేసే ఆన్లైన్ సైట్స్ మెరాయించడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

 

4. క్షుద్రపూజ పేరుతో మోసపోయిన దంపతులు

కర్నూలు జిల్లా ఆదోనిలో క్షుద్రపూజల బాగోతం బయట పడింది. వెంకటయ్య- పద్మ అనే దంపతుల నుంచి దుర్గాసింగ్ అనే ఒక నకిలీ బాబా మూడున్నర లక్షలు స్వాహా చేశాడు. మీ పొలంలో నిధి నిక్షేపాలున్నాయని, దాని ద్వారా మీకు ప్రాణహాని పొంచి ఉందని భయపెట్టించి మోసానికి పాల్పడ్డాడు.

 

5. రేణిగుంట ఎయిర్‌పోర్టులో విమానా లోపం

రేణిగుంట అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. హైదరాబాద్‌ నుంచి రేణిగుంటకు వచ్చినవిమానం తిరిగి బయలుదేరే సమయంలో రన్‌వేపై ఆగిపోయింది. పైలట్లు లోపాన్ని గుర్తించి విమానాన్ని నిలిపివేయడంతో ప్రయాణికుల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది. విమానాశ్రయం సాంకేతిక బృందం వెంటనే రన్‌వేకు చేరుకొని లోపం సరిదిద్దేందుకు చర్యలు చేపట్టారు.

 

6. భీమారంలో గుడుంబా దుకాణాలపై పోలీసులు ఆగ్రహం

మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. 10 లీటర్ల గుడుంబా, 500 లీటర్ల బెల్లం పానకం, 5 మద్యం బాటిళ్లు, ఎలాంటి అనుమతి పత్రాలు లేని 26 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు. వచ్చే ఉగాది వరకు గ్రామాన్ని గుడుంబా రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే గ్రామస్తుల లక్ష్యమని తెలిపారు వెండటేశ్వర్లు.

 

7. పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీలో కెసిఆర్ ఫ్లెక్సీలు చింపేస్తున్నారని విద్యార్థుల ఆరోపణ

ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించడానికి మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలను బీఆర్ఎస్వీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను ఉస్మానియా యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది, ఓయూ పోలీసులు చించివేసారని విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు.

 

8. సాయంత్రం 5 గంటల సమయానికంటే ఒక్కనిమిషం ఆలాస్యం అయినా నామినేషన్ స్వీకరించద్దు: భద్రాచలం సబ్‌ కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు సబ్‌ కలెక్టర్. నామినేషన్ స్వీకరణకు ఇవాళే చివరి రోజు కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సాయంత్రం 5 గంటల సమయానికంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా నామినేషన్ పత్రాలు స్వీకరించకూడదని సంబంధిత అధికారులకు కఠిన ఆదేశాలు జారీ.

 

9. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ డీఈపై కౌన్సిలర్ల ఆగ్రహం

నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ డీఈపై కౌన్సిలర్లు చాంద్ బాషా, మందడి వాణి, రవుఫ్ మండిపడ్డారు. డీఈ ప్రజలకు అందుబాటులో లేరని, కార్యాలయానికి ఆలస్యంగా వస్తున్నారని, నెలకు 20 రోజులు కూడా విధులకు హాజరు కావడం లేదని ఆరోపించారు. కౌన్సిలర్లు అడిగినా పనులు జరగకపోవడంపై చాంద్ బాషా తీవ్రంగా ప్రశ్నించారు.

 

10. యాదాద్రిలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

దీక్షా దివస్ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ళ శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ పాల్గొన్నారు.

 

11. రోడ్డు ప్రమాదంలో వాటర్ మ్యాన్ మృతి

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ధర్మారం గ్రామపంచాయతీలో వాటర్‌మాన్‌గా విధులు నిర్వహిస్తున్న కుంటయ్య మృతిచెందారు. నీళ్లు వదలడానికి సైకిల్ పై వెళ్తుండగా లారీ అతివేగంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

12. అధిక వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన పుల్ల శనగ రైతులు

ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల, వీరులపాడు మండలాల పరిధిలో ఈ ఏడాది సుమారు 14 వేల ఎకరాల్లో పుల్ల శనగ సాగును రైతులు చేపట్టారు. ఈ ఏడాది అధిక వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన మెట్ట రైతులు పత్తి, మొక్కజొన్న, పెసర దిగుబడులు లేక అప్పులు పాలయ్యారు. ఈ నేపథ్యంలో మండలాల్లో రెండో పంటగా సాగు చేస్తున్న పుల్ల శనగ పంటపైనే ఆశలు పెట్టుకున్నారు రైతులు.

 

13. కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో రోబోటిక్ మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయి

విశాఖపట్నం, గాజువాకలోని కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో రోబోటిక్ మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని ఎండీ, ఆర్థోపెడిక్ సర్జన్ డా. సతీష్ కుమార్ పెతకంశెట్టి తెలిపారు. రోబోటిక్ సాంకేతికతతో ఖచ్చితత్త్వం పెరిగి, కండకోత తక్కువగా ఉండటం వల్ల రోగులు వేగంగా కోలుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ సేవలు ఇప్పుడు విశాఖలోనే అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

 

14. శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్టు సహాయం

విజయనగరం జిల్లా మంగళ పాలెం గ్రామం వద్ద శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్టు వారు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమం చేశారు. ఆస్ట్రేలియన్ కౌన్సిలేట్ జనరల్ వారి సహకారంతో FCRA ద్వారా 7.5 లక్షలతో ఈ కార్యక్రమం చేపట్టారు. చెవిటి వారికి చెవి మిషన్లు, అంధులకు పెన్షన్లు, వృద్ధులకు నిత్యవసరాలు, రగ్గులు పంపిణీ చేశారు.

 

15. దొంగలు దొరికేసారు

ఇటీవల మేడికొండూరు పరిధిలో పాలడుగు గ్రామంలో జరిగిన దొంగతనం కేసును ఛేదించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి లోతైన దర్యాప్తు జరిపి దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 86 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, 40వేల నగదు, బైక్, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

 

16. ఆస్ట్రేలియా ప్రధాని వివాహం

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తన చిరకాల స్నేహితురాలు జోడీ హైడెన్‌ను కాన్ బెర్రాలోని తన అధికారిక నివాసం ‘ది లాడ్జ్’లో వివాహం చేసుకున్నారు. ప్రధాని హోదాలో పెళ్లి చేసుకున్న తొలి వ్యక్తి ఈయనే. ఐదేళ్ల పరిచయం కాగా.. రిలేషన్షిప్ తర్వాత వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అల్బనీస్‌కు ఇది రెండో వివాహం కావడం విశేషం.

 

17. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ గృహం, కార్యాలయాలను అవినీతి నిరోధక సంస్థల అధికారులు సోదా

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి ఆంద్రీ యెర్మాక్‌ గృహం, కార్యాలయాలను అవినీతి నిరోధక సంస్థల అధికారులు సోదాలు చేశారు. చమురు రంగంలో 10 కోట్ల డాలర్ల అవినీతి జరిగిందనే ఆరోపణలను పురస్కరించుకుని ఈ దాడులు జరిగాయి.

 

18. తృతీయ ప్రపంచ దేశాల వలసలకు శాశ్వత విరామం: డొనాల్డ్‌ ట్రంప్‌

తృతీయ ప్రపంచ దేశాల నుంచి తమ దేశంలోకి వలసలకు శాశ్వత విరామం ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే విదేశీయుల్ని వెనక్కి పంపించేస్తామని చెప్పారు. గ్రీన్‌కార్డులు పొందినవారిలో ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు.

 

19. వారణాసి’ చిత్రం టైటిల్ వివాదం కొలిక్కి

రాజమౌళి, మహేశ్ బాబుల ‘వారణాసి’ చిత్రం టైటిల్ వివాదం పరిష్కారమైంది. తెలుగులో రిజిస్టర్ కావడంతో ఈ చిత్రాన్ని తెలుగులో ‘రాజమౌళి వారణాసి’ పేరుతో, ఇతర భాషల్లో ‘వారణాసి’గా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో మహేశ్ బాబు ‘రుద్ర’ పాత్రలో నటిస్తుండగా.. 2027 వేసవిలో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

20. WPL 2026 స్కెడ్యూల్ వచ్చేసింది

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ తేదీలను బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది.ముంబై వేదికగా తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగాళూరు, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×