E-Paper
Advertisement

మార్కెట్లో ఎగిసిన ముడి చమురు ధర.. బ్రెంట్ క్రూడ్ 102 డాలర్లు, భారత్‌‌లో ధరలు పెరిగే ఛాన్స్

మార్కెట్లో ఎగిసిన ముడి చమురు ధర.. బ్రెంట్ క్రూడ్ 102 డాలర్లు, భారత్‌‌లో ధరలు పెరిగే ఛాన్స్
Advertisement

Rising Oil Prices: పశ్చిమాసియా అంతటా పోరాటాల నేపథ్యంలో ఘర్షణకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ 10న అనగా గురువారం చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 102 డాలర్లకు చేరువయ్యింది. ఇదే కంటిన్యూ అయితే పలు దేశాలకు ఇబ్బంది తప్పవనే వాదన బలంగా పెరుగుతోంది.

పశ్చిమాసియాలో యుద్ధం మేఘాలు, ఆయిల్ ధరలకు రెక్కలు

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్న సామాన్యుడి ఆశలు ఆవిరయ్యాయి. ధరలు ఎంత పెరుగుతాయనే దానిపై ఆందోళన మొదలైంది. అమెరికా వ్యవహారంపై ఇరాన్ ఘాటు హెచ్చరికలు చేసింది. యుద్ధానికి సిద్ధమవుతామని శపథం చేసింది. ఫలితంగా చమురు ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోసింది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 102 డాలర్లు సమీపంలో ఉంది. డబ్ల్యూటీఐ- WTI బ్యారెల్‌కు 100 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో భారత్‌కు చమురు కష్టాలను తీవ్రతరమైంది. కేవలం పెట్రోల్, డీజిల్ కాకుండా, ముడి చమురుతో తయారయ్యే ప్రతి ఉత్పత్తి ధరలు పెరుగుతాయనే భయం మొదలైంది. పెయింట్, ప్లాస్టిక్, నెయిల్ పాలిష్ వరకు అన్నింటిపై ముడి చమురు ధర ప్రభావం చూపుతుందని ఓ అంచనా.

భారత్‌లో ధరల పెంపు ఖాయమా?

Advertisement

భారత్ తన చమురు అవసరాలలో 90 శాతం దిగుమతి చేసుకుంటోంది. దిగుమతుల బిల్లులు అమాతంగా పెరగనుంది. ముడి చమురు కొనుగోలుకు ఎక్కువగా డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మళ్లీ మొదలవుతుందా? అన్న ప్రశ్నలు లేకపోలేదు. గడిచిన మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు మార్పులేదు. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 102.12 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ. 95.20గా ఉంది. చివరిసారి మే 25న ధరలను సవరించింది కేంద్రం. అప్పుడు పెట్రోల్ ధర లీటరుకు రూ.2.61, డీజిల్ ధర లీటరుకు రూ. 2.71 పెంచారు. ఆ తర్వాత నాలుగు సందర్భాల్లో ఆయా ధరలను చెరో రూ. 7.50 చొప్పున పెంచారు.

ALSO READ: పసిడి ప్రియులకు పంగడే.. దిగొస్తున్న లోహాల ధరలు, తులం ఎంతంటే..

Advertisement

ముడి చమురు ధరల పెరుగుదలతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీల లాభాలపై ఒత్తిడిని పెరుగుతుంది. ప్రస్తుతం చమురు రంగ కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు సుమారు రూ.5, డీజిల్‌పై లీటరుకు రూ. 23 నష్టాలను చవి చూస్తున్నాయి. ఇరాన్ సీనియర్ అధికారి మాటల ప్రకారం.. అమెరికా తమ భూభాగంపై దాడులు కొనసాగిస్తే ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేస్తుందని చెప్పకనే చెప్పారు. నవంబరులో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత యుద్ధం ముగుస్తుందన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అప్పటివరకు చమురు ధరల్లో చెప్పుకోదగ్గ ఉపశమనం ఏమీ ఉండదని అంచనా వేశారు. గడిచిన ఏడు నెలలుగా కొనసాగుతున్న సంఘర్షణ ఇప్పట్లో సద్దుమణిగే అవకాశం కనిపించలేదు.

Related News

పసిడి ప్రియులకు పంగడే.. దిగొస్తున్న లోహాల ధరలు, తులం ఎంతంటే..

ఫోన్, కారు కంటే ఇల్లు ముఖ్యం? ఆర్థికపరంగా భారతీయుల ఆలోచనల్లో మార్పు

నిర్మాణ ఖర్చుల కంటే వేగంగా పెరుగుతున్న ఇళ్ల ధరలు.. కారణాలు ఇవే

ఎక్కువ షుగర్, సాల్ట్ ఉన్న ఫుడ్ ప్యాకెట్స్‌పై వార్నింగ్ లేబుల్స్ స్పష్టంగా ఉండాలి.. వినియోగదారుల డిమాండ్

రైతులకు కీలక కబురు.. పీఎం కిసాన్ స్కీమ్ 24వ విడత నిధులు, నవరాత్రుల సమయంలో

దిగొస్తున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు మాటేంటి?

ఇండియాలో వారసత్వ ఆస్తుల బదిలీ అంత ఈజీ కాదు.. అన్నీ సవ్యంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×